TET, DSC., నిర్వహణకు విద్యాశాఖ ప్రయత్నాలు

TET, DSC., నిర్వహణకు విద్యాశాఖ ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను గుర్తించే పనిలో ఉంది విద్యాశాఖ. అంతకంటే ముందుగా టెట్ (ఉపాధ్యాయుల అర్హత పరీక్ష) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 2018లో టెట్ రెండు సార్లు నిర్వహించారు. డీఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు గతంలో టెట్ పాసైన వారికి ఏడేళ్ళు మాత్రమే పరిమితి ఉండటంతో ముందుగా టెట్ ను నిర్వహించాలని విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. ఈసారి టెట్ కు 5 లక్షల మంది దాకా పోటీ పడే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

టెట్, డీఎస్సీలో మార్పులు

ఈసారి టెట్, డీఎస్సీ ఎగ్జామ్స్ లో మార్పులు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఈసారి ఆ మీడియంలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరిశీలించేందుకు ఎంట్రన్స్ టెస్టుల్లో చర్యలు తీసుకుంటున్నారు. టెట్ లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కింద అదనంగా పరీక్షను నిర్వహిస్తారు. దీనిపై విద్యా పరిశోధన, శిక్షణా మండలి (SCERT) సిలబస్ ను రూపొందిస్తోంది. అలాగే టెస్ట్ బుక్స్ లో గత ఏడాది సిలబస్ మారినందున డీఎస్సీ సిలబస్ లోనూ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.