AP TET కు గ్రీన్ సిగ్నల్

AP TET కు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) ను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 23ను విడుదల చేశారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం నడుస్తుండటంతో టెట్ లో ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ ప్రశ్నలకు ప్రాధాన్యత ఇచ్చారు.

1-5 తరగతులకు సంబంధించి SGT పోస్టులకు పేపర్ 1ఏ

6-8 తరగతులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ 2ఏ నిర్వహిస్తారు

పేపర్ 2ఏ రాసేవారు ఆసక్తి ఉంటే పేపర్ 1ఏను కూడా రాయొచ్చు. ప్రత్యేక స్కూళ్ళ పోస్టుల పేపర్ 1బి, పేపర్ 2బి నిర్వహిస్తారు. ఇకపై ఏడాదికి ఒకేసారి టెట్ ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ ను మేలో

విడుదల చేసి జులైలో పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

 

టెట్ కు సంబంధించిన గైడ్ లైన్స్ కోసం చూడండి https://andhraexams.com/ap-tet-dsc-2021/