Wednesday, October 23

బ్యాంక్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ : 17 బ్యాంకుల్లో 12075 పోస్టుల భర్తీ

అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న IBPS ద్వారా భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని 12 వేల 75 క్లర్క్ పోస్టులను ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకోసం డిసెంబర్, 2019 & జనవరి 2019 ల్లో ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగే అవకాశాలున్నాయి.

ఈ కింది బ్యాంకులకు సంబంధించిన ఖాళీలను IBPS నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు

1) అలహాబాద్ బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
4) సిండికేట్ బ్యాంక్
5) ఆంధ్రబ్యాంక్
6) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
7) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8) యూకో బ్యాంక్
9) బ్యాంక్ ఆఫ్ బరోడా
10) కార్పోరేషన్ బ్యాంక్
11) పంజాబ్ నేషనల్ బ్యాంక్
12) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
13) బ్యాంక్ ఆఫ్ ఇండియా
14) ఇండియన్ బ్యాంక్
15) పంజాబ్ & సింధ్ బ్యాంక్
16) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
17) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ రిజిష్ట్రేషన్ : 2019 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 9 వరకూ

అప్లికేషన్స్ పేమెంట్ ఫీజ్ : 2019 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 9 వరకూ

ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ : నవంబర్ 2019

ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ : 07.12.19, 8.12.19, 14.1219 & 21.12.2019

ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఫలితాలు: డిసెంబర్ 2019/ జనవరి 2020

మెయిన్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ : జనవరి 2020

మెయిన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్: 19.01.2020

నియామకాలు : ఏప్రిల్ 2020

విద్యార్హతలు:

ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత

కంప్యూటర్ లో వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
( కంప్యూటర్ లో డిప్లొమా, డిగ్రీ లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి )

సొంత రాష్ట్రానికి చెందిన భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

(నోట్: 09.10.2019 నాటికి డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండే వారికి మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అర్హత ఉంది )

వయస్సు : ( 01.09.2019 నాటికి )

కనీస వయస్సు : 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు
(అభ్యర్థులు 02.09.1991 కు ముందు పుట్టి ఉండకూడదు. 01.09.1999 తర్వాత పుట్టి ఉండరాదు. ఈ రెండు తేదీలలోపు పుట్టిన వారికి మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంది )
సడిలింపు :

గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు : 5యేళ్ళు, OBC లకు 3 యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళ సడలింపు ఉంటుంది.

ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ :

నోడల్ బ్యాంకుల సహకారంతో SC/ST/Minorty/Ex-Serviceman/దివ్యాంగులకు ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవడా, విశాఖపట్నంల్లో ఇస్తారు.

ఈ శిక్షణ కావల్సిన వారు ముందుగానే ONLINE APPLICATION లో ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ ఉచితంగానే ఇస్తారు. బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలు మాత్రమే అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది.

ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

1) ఇంగ్లీష్ లాంగ్వేజ్ : 30 ప్రశ్నలు, 30 మార్కులు ( 20 నిమిషాలు)

2) న్యూమరికల్ ఎబిలిటీ : 35 ప్రశ్నలు, 35 మార్కులు (20 నిమిషాలు)

3) రీజనింగ్ ఎబిలిటీ : 35 ప్రశ్నలు, 35 మార్కులు (20 నిమిషాలు)

మొత్తం : 100 ప్రశ్నలు, 100 మార్కులు - 60 నిమిషాలు

నోట్: అభ్యర్థులు మూడు టెస్టులకు విడి విడిగా కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయి, కటాఫ్ మార్కులు పొందిన వారిని IBPS మెయిన్స్ ఎగ్జామ్ కి ఎంపిక చేస్తుంది.

మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

1) జనరల్ /ఫైనాన్షియల్ ఎవేర్ నెస్ : 50 ప్రశ్నలు, 50 మార్కులు, 35 నిమిషాలు

2) జనరల్ ఇంగ్లీష్ : 40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాలు

3) రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ అప్టిట్యూడ్ : 50 ప్రశ్నలు, 50 మార్కులు, 45 నిమిషాలు

4) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 50 ప్రశ్నలు, 50 మార్కులు, 45 నిమిషాలు

మెయిన్స్ మొత్తం : 190 ప్రశ్నలు, 200 మార్కులు, 160 నిమిషాలు
( IBPS ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది )

నెగిటివ్ మార్కింగ్ :

ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ రెండింటిలోనూ తప్పు జవాబులకు నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 లేదా 0.25 మార్కులు కట్ చేస్తారు. ఒకవేళ ప్రశ్నను సమాధానం గుర్తించకుండా ఖాళీగా వదిలేస్తే ఎలాంటి పెనాల్టీ మార్కులు విధించరు.

ఇతర వివరాలకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.

IBPS 2019 NOTIFICATION

(హెచ్చరిక: IBPS కి సంబంధించి ఫేక్ వెబ్ సైట్స్ కూడా పుట్టుకొస్తుంటాయి. అందువల్ల ఒరిజినల్ వెబ్ సైట్ లోకి వెళ్ళి లాగిన్ వివరాలు ఎంటర్ చేయండి )

IBPS ఒరిజినల్ వెబ్ సైట్

తెలంగాణలో పోస్టులు :

ఆంధ్రప్రదేశ్ లో పోస్టులు :

నోట్:

IBPS క్లర్క్స్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో... వీడియో ద్వారా అందించగలం. గ్రాండ్ టెస్టులు నిర్వహించే ఆలోచన చేస్తున్నాం. మీకు పూర్తి వివరాలు వచ్చేవారంలో తెలియచేస్తాం. ప్రిపరేషన్ కు 4 నెలలు మాత్రమే టైమ్ ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్ కలిపి ప్రిపరేషన్ మొదలుపెట్టండి.

బ్యాంక్ ఉద్యోగం మనకి ఎందుకు వస్తుంది... పేపర్ ఇంగ్లీష్ లో ఉంటుంది కదా... అంటూ మిమ్మల్ని మీరు దయచేసి తక్కువ అంచనా వేసుకోవద్దు. కష్టపడండి... ప్రాక్టీస్ చేయండి... షార్ట్ కట్స్ నేర్చుకోండి... రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది.  ముందు నుంచే ప్రిలిమినరీ, మెయిన్స్ కి కలిపి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి.   మీకు పూర్తి వివరాలు 1,2 రోజుల్లో వీడియో ద్వారా అందిస్తాను.

(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్ & కంటెంట్ రైటర్ )