Wednesday, October 23

తెలుగులోనే బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలను తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు. గతంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉండేది... ఇప్పుడు తెలుగు, తమిళం, ఉర్దూ, పంజాబీ, మలయాళం లాంటి 13 ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తారు.

కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ వల్ల స్థానిక భాషలో చదువుకునే విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి. బ్యాంకుల్లో ర్యాంక్ ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంగ్లీష్, హిందీల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించే వారు. ప్రాంతీయ భాషలో పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల నుంచి బలంగా వస్తోంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఇన్నాళ్ళకు అభ్యర్థులకు ఊరట కలగనుంది. ఇకపై ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశముంది.