Friday, January 17

CURRENT AFFAIRS – APR 11

ఆంధ్రప్రదేశ్
1) ఆనంద నగరాల సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించింది ?
జ: మంగళ గిరిలో
2) తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: పుట్టా సుధాకర్ యాదవ్
3) ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: వర్ల రామయ్య
4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
5) ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏ అవార్డును అమరావతికి ప్రదానం చేసింది ?
జ: గ్రీన్ సింగ్ ప్లాటినమ్
6) ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులందరికీ ఉపయోగపడేలా తీర్చి దిద్దిన ఏసీ రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ఏది ?
జ: ఈ - ప్రగతి

జాతీయం
7) ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఆయుష్ సంస్థ ఏర్పాటు చేసిన శాస్త్రీ సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
8) ఏ బొగ్గును మండించడం ద్వారా ఎక్కువ కార్భన్ డైయాక్సైడ్ వెలువడుతుండటంతో దాన్ని నిషేధించాలని కేంద్రం భావిస్తోంది ?
జ: పెట్ కోక్
9) లవ్ హార్మోన్ గా పిలిచే ఏ పదార్థాన్ని దేశంలోకి దిగుమతి కాకుండా, స్మగ్లింగ్ చేయకుండా చూడాలని కస్టమ్స్ విభాగాన్ని కేంద్ర సర్కార్ ఆదేశించింది ?
జ: ఆక్సిటోసిన్
(నోట్: పాల ఉత్పత్తి పెంచడానికి, కూరగాయల పరిణామం పెరగడానికి దీన్ని ఉపయోగిస్తారు )
10) దేశీయ దిక్సూచి వ్యవస్థలో భాగంగా ఏ ఉపగ్రహాన్ని ఇస్రో ఈనెల 12న ప్రయోగించనుంది ?
జ: IRNSS-1I ఉప్రగ్రహం
11) అమెరికా జీపీఎస్ తరహాలో భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ ను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. దీనికి ఏమని పేరు పెట్టారు ?
జ: నావిక్
12) 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను గురించి ఎక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో చర్చించారు ?
జ: తిరువనంతపురం (కేరళ)
13) మొండి బకాయిలపై చర్చించేందుకు ఆర్బీఐ గవర్నర్తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైన పార్లమెంటరీ సంఘానికి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామి రెడ్డి
14) పాన్ కార్డు దరఖాస్తుల్లోఇకపై ఏ కేటగిరీ కూడా చేర్చాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయించింది ?
జ: ట్రాన్స్ జెండర్
15) నాస్కామ్ కు ప్రస్తుత ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రిషద్ ప్రేమ్ జీ ( విప్రో అజిమ్ ప్రేమ్ జీ కుమారుడు )
16) ఢిల్లీలో పర్యటిస్తున్న ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రెసిడెంట్ ఎవరు ?
జ: బోర్గే బ్రెండే
17) కామన్వెల్త్ గేమ్స్ లో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో స్వర్ణం కైవసరం చేసుకున్న భారత షూటర్ ఎవరు ?
జ: హీనా సిద్ధు
18) కామన్వెల్త్ గేమ్స్ లో పారా పవర్ లిఫ్టింగ్ లో కాంస్యపతకాన్ని గెలుచుకున్న భారతీయ ప్లేయర్ ఎవరు ?
జ: సచిన్ చౌధరీ
19) ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ఎక్కడ జరగనుంది ?
జ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
20) ప్రపంచ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ అగ్రస్థానానికి చేరుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు ?
జ: కిదాంబి శ్రీకాంత్

అంతర్జాతీయం
21) మధుమేహ పరీక్షలకు సూదులను గుచ్చకుండా కేవలం జిగురు పట్టీలతో గ్లూకోజ్ లెవల్స్ కనుగొనేలా పట్టీలను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు ?
జ: బ్రిటన్ లోని బాత్ వర్సిటీ నిపుణులు
22) ప్రపంచంలో ప్రస్తుతం జీవించిన ఉన్న వారిలో పెద్ద వయస్సున్నవాడిగా గిన్నిస్ బుక్ ఎవర్ని గుర్తించింది ?
జ: నొనాకా ( 112 యేళ్ళు - జపాన్ )