Monday, September 16

CURRENT AFFAIRS – APR 24

ఆంధ్రప్రదేశ్
1) దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది ?
జ: రుషికొండ

జాతీయం
02) 2002లో గోద్రా రైలు ఉదంతం తర్వాత సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కు ఎంత పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ?
జ: రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, నివాస వసతి
03) ఇటీవల హిందూ మహాసముద్రంలో జరిగిన భారత్ - అమెరికా యాంటీ సబ్ మెరైన్ సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్న భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ ఏది ?
జ: P8I నెప్ట్యూన్
04) దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు కనీసం 50శాతం పరికరాలను సబ్సిడీగా ఇచ్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ఏది ?
జ: FAME II
05) దేశీయ టెలికాం దిగ్గజం జియోలోకి 2 నుంచి 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన జపాన్ బ్యాంక్ ఏది ?
జ: సాఫ్ట్ బ్యాంక్
06) తమ సభ్యులకు సైబర్ సెక్యూరిటీ కల్పించేందుకు నెట్ వర్క్ ఇంటెలిజెన్స్ సంస్థతో MOU కుదుర్చుకున్న స్టాక్ ఎక్చేంజ్ ఏది ?
జ: బాంబే స్టాక్ ఎక్చేంజ్ (BSE)
07) బాంబే స్టాక్ ఎక్చేంజ్ MD & CEO ఎవరు ?
జ: అశీష్ కుమార్ చౌహాన్
08) చైనాలోని జియాన్ లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్ ఎవరు ?
జ: బజరంగ్ పూనియా
09) గురునానక్ స్టేడియం ఎక్కడ ఉంది ?
జ: లుథియానాలో
(నోట్: ఇటీవల ఇక్కడ సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ మ్యాచెస్ ఫైనల్స్ జరిగాయి)

అంతర్జాతీయం
10) ఈ ఏప్రిల్ 22న జరిగిన ఎర్త్ డే 2019 యొక్క థీమ్ ఏది ?
జ: Protecting our Species