Monday, September 16

CURRENT AFFAIRS – DEC 22

ఆంధ్రప్రదేశ్
01) రాష్ట్రంలో 8,9 తరగతుల విద్యార్థునులకు జనవరి 31 కల్లా సైకిళ్ళ పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పథకం పేరేంటి ?
జ: బడికొస్తా
02) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals) ఆధార నివేదిక 2018లో తెలుగు రాష్ట్రాల స్థానం ఎంత ?
జ: ఆంధ్రప్రదేశ్ 64
తెలంగాణ 61
03) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్ని TMCల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ?
జ: తెలంగాణకి : 55.90, ఏపీకి 33.40 టీఎంసీలు
04) ఆంధప్రదేశ్ లోని 161 మండలాల్లో సెర్ప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత వృద్ధి కార్యక్రమం అమలవుతోంది. అందుకోసం ప్రభుత్వం 32 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ పథకానికి నిధులు అందిస్తున్న సంస్థ ఏది ?
జ: ప్రపంచ బ్యాంక్

జాతీయం
05) ఇకపై ఏ కంప్యూటర్ నుంచి ట్రాన్స్ ఫర్, నిల్వ చేసిన సమాచారాన్ని కేంద్రానికి చెందిన ఎన్ని భద్రతా, దర్యాప్తు సంస్థలు చూడటానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
జ: 10 సంస్థలు
06) ఏయే చట్టాల కింద ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం -2000లోని సెక్షన్ 69
ఐటీ (ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఇంటర్ సెప్షన్, మానిటరింగ్, డిక్రిప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ) నిబంధనలు 2009లోని 4వ నిబంధన కింద
07) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఛైర్ పర్సన్, ఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: డీవీ ప్రసాద్ (1984 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి )
08) నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న సంస్థ పేరేంటి ?
జ: అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( AJL)
09) దేశంలో మరో మూడు బ్యాంకుల విలీనానికి ప్రత్యామ్న వ్యవస్థ (AM) అంగీకారం తెలిపింది ?
జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంక్
10) ధనుర్వాతం రాకుండా ఇచ్చే టీటీ, కంఠసర్పి రాకుండా ఇచ్చే టీకా రెండింటినీ కలిపి ఏ టీకాను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెడుతోంది ?
జ: టీడీ
11) భారత మహిళల క్రికెట్ వన్డే జట్టుకు ఎవర్ని కెప్టెన్ గా కొనసాగిస్తూ బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది ?
జ: మిథాలీ రాజ్ (టీ20కి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ )
12) ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ - 4 ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి ?
జ: ముంబై
13) పీబీఎల్ లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి ?
జ: 9 జట్లు

అంతర్జాతీయం
14) రాజీనామా చేసిన అమెరికా రక్షణ మంత్రి ఎవరు ?
జ: జేమ్స్ మ్యాటిస్

AP PC/SI + Gr.2/Gr.3/AEE (GS) Combined Mock Tests
https://andhraexams.com/combinedmock/

GROUP.II (ప్రిలిమ్స్) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి. ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/gr-2-prelims/