Friday, February 28

CURRENT AFFAIRS – JAN 15

ఆంధ్రప్రదేశ్
01) కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖకి చెందిన ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యుడిగా, దక్షిణ భారత ప్రతినిధిగా నియమితులైన గుండె వైద్య నిపుణులు ఎవరు ?
జ: డాక్టర్ పోతినేని రమేష్ బాబు
02) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య సేవల విలువల పరిధిని ప్రస్తుతం ఉన్న ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ?
జ: 01 ఏప్రిల్ 2019 నుంచి
03) ITDA లోని గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పథకం ఏది ?
జ: ఆహార బుట్ట (ఫుడ్ బాస్కెట్ )
04) ఉద్యాన పంటలలో ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో నిలిచింది చిత్తూరు జిల్లా. ఇక్కడ ఎన్ని వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు ?
జ: 70 వేల హెక్టార్లలో
05) దేశంలోనే అతి పెద్దదైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం పీబీనత్తం గ్రామంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (పూలు, కూరగాయల సాగు ప్రయోగశాల) ను 22.68 ఎకరాల విస్తీర్ణంలో రూ.10కోట్లతో ఏ దేశం సాయంతో నిర్మించారు ?
జ: ఇజ్రాయెల్ దేశం
06) చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.446 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లిథియం ఫెర్రో ఫాస్పేట్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వచ్చిన కంపెనీ ఏది ?
జ: అమెరికాకి చెందిన టెక్రాన్ బ్యాటరీస్
07) 2019 జనవరి 18 నుంచి 20 వరకూ రెండో విడత అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ పండగ ఎక్కడ జరగనుంది?
జ: అరకు లోయ

జాతీయం
08) ప్రజలు (పీపుల్), ప్రయోజనం (ప్రాఫిట్), ప్రపంచం (ప్లానెట్) కోసం కృషి చేస్తున్నందుకు ఏ దేశనేతకి తొలి ఫిలిప్ కాట్లర్ అవార్డు ప్రదానం చేశారు ?
జ: ప్రధాన నరేంద్ర మోడీ (భారత్ )
09) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జనరల్ కేటగిరీలో కల్పించిన 10శాతం కోటా - రాజ్యాంగ (103వ సవరణ) చట్టం 2019 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర సామాజిక న్యాయ, సాధికరత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది ?
జ: 2019 జనవరి 14 నుంచి
10) 10శాతం EWS కోటాని దేశంలో మొదటగా అమలు చేసిన రాష్ట్రం ఏది ?
జ: గుజరాత్ (2019 జనవరి 14 నుంచి )
11) దారిద్ర్య రేఖకు దిగువన (Below poverty line) నిర్వచనం ప్రకారం ఐదుగురు సభ్యులున్న గ్రామీణ, పట్టణ కుటుంబాలు నెలకు ఎంత ఖర్చు చేస్తుండాలి ?
జ: గ్రామీణ కుటుంబం: రూ.4,080
పట్టణ కుటుంబం రూ.5,000
12) ప్రస్తుతం కేంద్ర ఆర్థిక కార్యదర్శి గా పనిచేస్తున్న నారాయణ్ ఝా పదవీ కాలాన్ని మరో నెల పెంచుతూ కేంద్ర సిబ్బంది శాఖ ఆదేశాలిచ్చింది. ఆయన పదవీకాలం ఎప్పటితో ముగుస్తోంది ?
జ: 2019 జనవరి 31 వరకూ
13) కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) పై 6 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించిన విద్యా సంస్థ ఏది ?
జ: ఐఐటీ ఖరగ్ పూర్
14) విమాన ప్రయాణాల్లో కాగితం పని తగ్గించేందుకు దేశంలోనే మొదటిసారిగా బోర్డింగ్ పాస్ లపై స్టాంపింగ్ లేని విధానాన్ని ఏ విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు ?
జ: ముంబైలోని ఛత్రపతి శివాజా మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
15) కేరళలో ఎన్నోయేళ్ళుగా స్త్రీలకు అనుమతి లేని అతస్త్యర్ కూడమ్ ను అధిరోహించిన మహిళా అధికారి ఎవరు ? ( అత్యంత ఎత్తయిన రెండో పర్వత శిఖరం)
జ: కె.ధన్యా సనాల్
16) రైలు కదులుతున్నట్టుగా తెలిపేందుకు ఏ లైట్ ద్వారా ప్రయాణీకులను హెచ్చరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది ?
జ: నీలం లైట్

అంతర్జాతీయం
17) అధిక దిగుబడిని ఇచ్చే కొత్తరకం వరి వంగడాలను చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: జిన్ జియాంగ్ పెంగ్ బృందం ( సౌత్ చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీ )
18) చంద్రుడిపై అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించిన దేశం ఏది ?
జ: చైనా

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/
56 రోజుల రోజువారీ ప్రణాళికకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/wp-content/uploads/2018/01/56-DAYS-AP-GS-COMMON-EXAMS.pdf