Monday, September 16

CURRENT AFFAIRS – JAN 22

ఆంధ్రప్రదేశ్
01) చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కింద బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.10 కోట్లు
02) హంద్రీ నీవా జలాలు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోని ఏ మండలంలోకి ప్రవేశించాయి ?
జ:: పెద్ద తిప్ప సముద్రం మండలం
03) విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (UGC) స్వయంప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: రెండో స్థానం (97 కాలేజీలు)
(నోట్: 183 కళాశాలలతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది)
04) ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ఫించన్లను రెట్టింపు చేస్తే ఎంతమంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుంది ?
జ: 54.61 లక్షల మందికి
05) 2014 జూన్ నుంచి ప్రభుత్వం ఇళ్ళు మంజూరు చేయకుండానే నిర్మించుకున్న ఎన్ని ఇళ్ళ లబ్దిదారులకు రూ.60వేలు చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: లక్షా 26 వేల 97 ఇళ్ళు

జాతీయం
06) యువ ప్రవాస భారతీయుల దినోత్సవ కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది ?
జ: వారణాసిలో
07) 2018లో దేశంలో 18మంది కొత్తగా కుబేరులవడంతో వీరి సంఖ్య 119కి చేరినట్టు ఏ సర్వే వెల్లడించింది ?
జ: ఆక్స్ ఫామ్
08) 2018లో దేశంలోని 119మంది అత్యంత ధనవంతుల దగ్గరున్న ధనం ఎంత ?
జ: రూ.28లక్షల కోట్లు ( 44 వేల కోట్ల డాలర్లు )
09) IDBI బ్యాంకులో 51శాతం వాటా కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ?
జ: LIC
10) IDBI ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ?
జ: రాకేశ్ శర్మ
11) భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తుందనీ... 2019, 2020ల్లో ఎంత శాతం వృద్ధి రేటు ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది ?
జ: 2019 - 7.5 శాతం, 2020 లో 7.7శాతం
12) ది వన్ పేరుతో ప్రీమియం పొదుపు ఖాతాని ప్రారంభించిన బ్యాంక్ ఏది ?
జ: ICICI
13) నడిచే దేవుడు,త్రవిధ దాసోహి, శతాయుషిగా పిలిచే తుమకూరు సిద్ధ గంగ మఠాధిపతి కర్ణాటకలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: శివకుమార స్వామి (111)

అంతర్జాతీయం
14) ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: దావోస్
15) చైనాకి 28యేళ్ళ తర్వాత అతి పెద్ద కష్టం వచ్చింది. 2018లో ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా నమోదైంది ?
జ: 6.6శాతంగా
16) రూ.100కి మించి విలువ ఉన్న భారతీయ కరెన్సీని నిషేధించిన దేశం ఏది ?
జ: నేపాల్

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/
56 రోజుల రోజువారీ ప్రణాళికకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/wp-content/uploads/2018/01/56-DAYS-AP-GS-COMMON-EXAMS.pdf