Friday, January 17

CURRENT AFFAIRS – JAN 3 & 4

ఆంధ్రప్రదేశ్
01) మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఏ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ?
జ: అభయ ప్రాజెక్ట్
02) అభయ ప్రాజెక్టు కింద వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో జీపీఎస్ సిస్టమ్ తో తెలుసుకునేందుకు వచ్చిన యాప్ ఏది ?
జ: అభయ యాప్

జాతీయం
03) 106వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్ లో
04 సిరామిక్, పాలిమర్స్ కలిపి స్మార్ట్ మెటీరియల్ లో భాగంగా ఎముకలను తయారు చేసిన ఐఐటీ పరిశోధకులు ఎవరు ?
జ: ఐఐటీ హైదరాబాద్
05) గో సంరక్షణ కోసం ట్యాక్స్ విధించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఉత్తరప్రదేశ్
06) 2018-19 సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ గా రూ.699 కోట్లు చెల్లించిన సచిన్ బన్సల్ ఏ దేశీయ ఈకామర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు ?
జ: ఫ్లిప్ కార్ట్
07) రాజ్యసభలో మీడియా అడ్వైజరీ కమిటీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేశారు. దీనికి ఎవరు ఛైర్మన్ గా ఉన్నారు ?
జ: ట్రైబ్యూన్ పత్రిక ఎడిటర్ కేవీ ప్రసాద్ ( 18మంది సభ్యులు )
08) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోచ్ ముంబైలో కన్నుమూశారు. ఆయన ఎరవు ?
జ: రమాకాంత్ అచ్రేకర్
09) చినూక్, అపాచె అత్యాధునిక హెలికాప్టర్లు త్వరలో భారత్ అమ్ముల పొదిలో చేరనున్నాయి. వీటిని ఏ దేశం సప్లయ్ చేస్తోంది ?
జ: అమెరికా
10) అమెరికా నుంచి ఎన్ని చినూక్, అపాచె హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేస్తోంది ?
జ: 15 చినూక్, 22 అపాచె హెలికాప్టర్లు

అంతర్జాతీయం
11) ఏ విప్లవానికి 60యేళ్ళయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నారు ?
జ: క్యూబా విప్లవం
(నోట్: అప్పట్లో ఫిడేల్ క్యాస్ట్రో దీనికి నాయక్తవం వహించారు. 1958 డిసెంబర్ 31న అమెరికా మద్దుతో పాలన సాగించిన నియంత బటిస్టా దేశం విడిచి పారిపోయారు. దాంతో 1959 జనవరి 1న ఫిడెల్ కాస్ట్రో దేశంలో ఏకపార్టీ కమ్యూనిస్ట్ పాలన మొదలుపెట్టారు )
12) పాకిస్తాన్ కి టైప్ 054ఏపీ తరగతికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకను అందిస్తున్న దేశం ఏది ?
జ: చైనా
13) సింగపూర్ లో జరిగిన వరల్డ్ మెమోరీ చాంపియన్షిప్ లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న భారత సంతతి బాలుడు ఎవరు ?
జ: ధృవ్ మనోజ్

APPSC GR.II (ప్రిలిమ్స్)/SI/PC MAINS/GR.III

100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి. ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి (వచ్చేవారంలో డైలీ షెడ్యూల్ రిలీజ్ చేస్తాం)
https://andhraexams.com/gr-2-prelims/