Friday, January 17

CURRENT AFFAIRS – JAN 6 & 7

ఆంధ్రప్రదేశ్
01) రాష్ట్రంలో ఏయే నదుల కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది ?
జ: కృష్ణా, గోదావరి, నాగావళి
02) దేశంలోనే మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు తెరతో భారీ మల్లీఫ్లెక్స్ థియేటర్ ను ఎక్కడ నిర్మించారు ?
జ: సూళ్ళూరు పేట
03) మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లను దేశంలో మొదటిసారిగా భారతీ స్థాయిలో ఎన్ని పట్టణాల్లో నెలకొల్పనున్నారు ?
జ: 76 పట్టణాల్లో
04) ప్రపంచంలోనే మూడో పెద్ద సౌర విద్యుత్ పార్క్ ను ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: కర్నూలు జిల్లాలో
05) కర్నూలు జిల్లాలో 5,683 ఎకరాల్లో రూ.7వేల కోట్లతో నిర్మించిన అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు ?
జ: వెయ్యి మెగావాట్లు
06) దేశంలో మొత్తం సౌరవిద్యుత్ ఎన్ని మెగావాట్లుగా ఉంది ?
జ: 26 వేల మెగావాట్లు
07) దేశంలో ఎక్కువ సౌరవిద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ?
జ: కర్ణాటక (5100 మెగావాట్లు ) ( రెండో స్థానం తెలంగాణ: 3300, మూడో స్థానం ఏపీ : 2840 )
08) ప్రపంచంలో అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏవి ?
జ: టెంగెర్, చైనా ( 1547 మెగావాట్లు)
కూడ్లా, రాజస్థాన్ (1365 మెగావాట్లు)
కర్నూలు, ఏపీ ( 1000 మెగావాట్లు )
09) పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలను నేర్పేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ అటల్ టింకరింగ్ ల్యాబ్ లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ?
జ: 150 ( నీతి ఆయోగ్ కేటాయింపుల్లో దేశంలోనే మొదటి స్థానం ఏపీది)

జాతీయం
10) గనుల అక్రమ తవ్వకాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ రూ.100కోట్ల జరిమానా విధించింది ?
జ: మేఘాలయ ప్రభుత్వంపై
11) దేశంలోనే మొదటిసారిగా ఏ నదిలో ఆక్టోపస్ లను భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు ?
జ: నర్మదా నది ఉప్పునీటి జలాల్లో
12) సెప్టోపస్ ఇండికస్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఎన్ని ఆక్టోపస్ లు నర్మదా నదిలో కనిపించాయి ?
జ: 17 ఆక్టోపస్ లు
13) పెద్ద నోట్లు రద్దయిన స్థానంలో విడుదల చేసిన కొత్త నోట్లు నేపాల్ లో చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఆ దేశ బ్యాంకు ఏది ?
జ: నేపాల్ రాష్ట్ర బ్యాంకు ( NRB)
14) విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం ప్రకారం నేపాలీయులు ఎంతమేరకు భారతీయ కరెన్సీని తమ దగ్గర ఉంచుకునే అవకాశం ఉంది ?
జ: రూ.25 వేలు
15) భారత సైన్యం చరిత్రలో మొదటిసారి సైనిక దినోత్సవం కవాతుకు (ఆర్మీ సర్వీస్ కోర్) నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారి ఎవరు ?
జ: లెఫ్టినెంట్ భావనా కస్తూరి
16) అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు ఢిల్లీ, ముంబై, బెంగళూరులకు చెందిన నిపుణులైన డాక్టర్లు, ఇతర సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలతో వస్తున్న రైలు బండి పేరేంటి ?
జ: లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్
17) దేశంలో ఆర్థిక జనగణన ఎప్పుటి నుంచి మొదలైంది ?
జ: 1977లో
18) ఆధార్ అనుసంధానంతో గత ఏడాది మార్చి ఆఖరు నాటికి ఎంత మొత్తం ఆదా అయినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు ?
జ: రూ.90 వేల కోట్లు

అంతర్జాతీయం
19) దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఆరోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలిగిన మలేసియా రాజు పేరేంటి ?
జ: సుల్తాన్ మహ్మద్ (49)

56 రోజుల్లో 258 MOCK TESTS
జనవరి11 నుంచి మార్చి 10 వరకూ ( 8 వారాల ప్రోగ్రామ్)

APలో అన్ని ఎగ్జామ్స్ కి పనికొచ్చే GS, అర్థమెటిక్, రీజనింగ్, Group.3 గ్రామీణాభివృద్ధిపై టెస్టులు
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/
56 రోజుల రోజువారీ ప్రణాళికకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/wp-content/uploads/2018/01/56-DAYS-AP-GS-COMMON-EXAMS.pdf