JAN 12 CURRENT AFFAIRS

జాతీయం
1) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరెవరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ?
జ: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్ర, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్
2) 1984లో సిక్కులపై జరిగిన అల్లర్లపై 186 కేసులపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన సిట్ కు ఎవరు నేతృత్వం వహిస్తారు ?
జ: జస్టిస్ ధింగ్రా
3) భారత్ లో స్త్రీలు, పిల్లల హక్కులపై సాగిస్తున్న పోరాటానికి ఏ బాలీవుడ్ నటుడికి దావోస్ సదస్సుల్లో క్రిస్టల్ అవార్డును ప్రదానం చేయనున్నారు ?
జ: షారూఖ్ ఖాన్
(నోట్: హాలీవుడ్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్, గాయకుడు ఎల్టన్ జాన్ కి కూడా )
4) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ?
జ: కెన్నెట్ జస్టర్
5) రైల్ నీర్ అనేది దేనికి సంబంధించినది ?
జ: రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం
6) అన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్ ను అనుసంధానిస్తూ ఇ-రక్తకోష్ పేరుతో వెబ్ పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: పంజాబ్
7) షెడ్యూల్డ్ కులాల వారికి ఆర్థిక సాయం చేసేందుకు నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (NSFDC) తో ఒప్పందం కుదర్చుకున్న బ్యాంకు ఏది ?
జ: పంజాబ్ నేషనల్ బ్యాంక్
8) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI) కి కొత్త మేనేజింగ్ డైరక్టర్, CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: దిలీప్ అస్బే
9) 2018 కోల్ కతా ఓపెన్ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు ?
జ: ఆదిత్య మెహతా
10) ఫ్రైట్ మేనేజర్ల కోసం కేంద్ర రైల్వే శాఖ ఇటీవల ప్రారంభించిన యాప్ ఏది ?
జ: SFOORTI app
11) జమ్మూకశ్మీర్ లోని ఉరి డ్యామ్ ఏ నదిపై ఉంది ?
జ: జీలమ్ నది

అంతర్జాతీయం
12) చైనా పెట్టుబడుల నేపథ్యంలో... ఇండియా ఫస్ట్ పాలసీనే కొనసాగిస్తామని తేల్చి చెప్పిన దేశం ఏది ?
జ: మాల్దీవులు
13) 8యేళ్ళ చిన్నారిన అత్యాచారం చేసిన, హత్య చేసిన ఘటనపై నిరసనగా, తన కుమార్తెను ఒళ్ళో కూర్చోబెట్టుకొని వార్తలు చదివిన పాక్ టీవీ యాంకర్ ఎవరు ?
జ: కిరణ్ నాజ్
14) నాలుగో అంతర్జాతీయ ధర్మ దమ్మ సదస్సు ఏ దేశంలో జరుగుతోంది ?
జ: భారత్

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/