Sunday, August 25

CURRENT AFFAIRS – JULY 12

ఆంధ్రప్రదేశ్
01) తాగు నీటి పరిష్కారానికి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎంత మొత్తం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కోటి రూపాయలు
02) మహిళలకు జీవనోపాధి కల్పనలో భాగంగా ఆర్థిక చేయూత అందించేందుకు ఉద్దేశించిన పథకం ఏది ?
జ: వైఎస్సార్ చేయూత
03) వైఎస్పార్ చేయూత పథకాన్ని ఎన్ని కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.12,126కోట్లు
04) లోక్ సభలో ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఏపీకి చెందిన ఎంపీ ఎవరు ?
జ: బాల శౌరి ( వైసీపీ)
05) లోక్ సభ అంచనాల కమిటీ సభ్యులుగా ఎన్నికైన రాష్ట్ర ఎంపీలు ఎవరు ?
జ: కేశినేని నాని (టీడీపీ), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (వైసీపీ)

జాతీయం
06) ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ లో చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని 2019 జులై 15న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ రాకెట్ నుంచి దీన్ని ప్రయోగించనున్నారు ?
జ: GSLV - MARK 3
07) ఢిల్లీ, ముంబై నుంచి సింగపూర్ కి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించిన సంస్థ ఏది ?
జ: విస్తారా
(నోట్: టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్త సంస్థ ఇది )
08) జాతీయ మెగా లోక్ అదాలత్ ను దేశవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహిస్తున్నారు ?
జ: 2019 జులై 13న
09) దేశంలో అద్దె ఇళ్ళ యజమానులు, కిరాయిదారుల పరిరక్షణ కోసం కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది... ఈ చట్టం ప్రకారం ఇంటి అద్దె అడ్వాన్స్ ఎంత వరకు నిర్ణయించనుంది ?
జ: రెండు నెలలు మాత్రమే
(నోట్: నివాసేతర సముదాయాలు (షాపులు) కు ఒక నెల అద్దె మాత్రమే కనీస సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకోవాలి )
10) ఉగ్రవాదులు, నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోడానికి రైల్వేలు సొంతంగా దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి... ఈ దళాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
జ: కోరాస్ ( కమెండో ఫర్ రైల్వే సెక్యూరిటీ )
11) కేవలం రూ.127కే వేడి వేడి బిర్యానీని ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ఏ జైలులో ఏర్పాటు చేస్తున్నారు ?
జ: కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలులో

అంతర్జాతీయం
12) ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్ లోకి ప్రవేశించిన జట్లు ఏవి ?
జ: ఇంగ్లండ్ - న్యూజిలాండ్
13) భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం కలిగించే గ్రీన్ కార్డు బిల్లును అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించింది. ఈ బిల్లు పేరేంటి ?
జ: ఫెయిర్ నెస్ ఫర్ హై-స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ 2019