Sunday, August 25

CURRENT AFFAIRS – JULY 18

ఆంధ్రప్రదేశ్
01) దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL) CMD గా ఎవరికి పూర్తి బాధ్యతలను అప్పగించారు ?
జ: ఎం. వెంకటేశ్వర్లు
02) సంగీత నాటక అకాడమీ ఫెలోలుగా ఎంపికైన వారిలో ఏపీకి చెందిన తెలుగు వారు ఎవరు ?
జ: విజయవాడకి చెందిన మల్లాది సూరిబాబు (సంగీతం), కూచిపూడికి చెందిన పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి నృత్యం), గుంటూరుకు చెందిన కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథా విభాగంలో )

జాతీయం
03) పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న కుల్ భూషణ్ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసింది. మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో ఎంతమంది భారత్ కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చారు ?
జ: 15 మంది
04) కుల భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక్క రూపాయి ఫీజు తీసుకొని భారత్ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది ఎవరు ?
జ: హరీశ్ సాల్వే
05) ఉపాధి హామీ పథకాన్ని రైల్వే అభివృద్ధి పనులకు వినియోగించుకుంటున్న రైల్వే ఏది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
06) ఆర్బీఐ దగ్గర ఉన్న రూ.9 లక్షల కోట్ల అదనపు మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వానికి 3-5యేళ్ళల్లో బదిలీ చేయాలని సూచించిన కమిటీ ఏది ?
జ: బిమల్ జలాన్ కమిటీ
07) 2018 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ ఫెలోలుగా ఎవరిని ఎంపిక చేశారు ?
జ: జాకీర్ హుస్సేన్, సోనాల్ మాన్ సింగ్ (మొత్తం 44 మంది కళాకారులు ఉన్నారు )
08) అసోం వరద బాధితులను ఆదుకునేందుకు రూ.2కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: అక్షయ్ కుమార్
09) అత్యాధునిక నావల్ MRశామ్ ( ఉపతితర నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి) వ్యవస్థను భారత్ నౌకాదళం, మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ కు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ ఏది ?
జ: ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీస్
10) నావల్ MRశామ్ ( ఉపతితర నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి) ను ఇజ్రాయెల్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ ఒప్పందం విలువ ఎంత ?
జ: రూ.345 కోట్లు
11) భారతీయులపై, విదేశాల్లోని భారతీయ ఆస్తులపై ఉగ్రవాద దాడులు జరిగితే దర్యాప్తు చేసే అధికారాన్ని ఏ సంస్థకు అప్పగించే బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ? (గతంలో లోక్ సభ ఆమోదం తెలిపింది )
జ: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)

అంతర్జాతీయం
12) ముంబై బాంబు దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్ దవా అధిపతి హఫిజ్ సయీద్ ను పంజాయ్ ప్రావిన్స్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం అదుపులోకి తీసుకుంది. ఆయన్ని ఏ జైలుకి తరలించారు ?
జ: కోట్ లఖ్ పత్ జైలుకి