CURRENT AFFAIRS – JULY 19

ఆంధ్రప్రదేశ్
01) రాజధాని అమరావతిలో పూర్తి స్థాయి తనిఖీలు ఒప్పుకోనందున రూ.7,200 కోట్ల రుణం ఇచ్చేది లేదని స్పష్టం చేసిన బ్యాంక్ ఏది ?
జ: ప్రపంచ బ్యాంక్
02) రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ;?
జ: చల్లా మధుసూదన్ రెడ్డి
03) నకిలీ భూపత్రాలు, రికార్డుల్లో అవకతవకలు జరక్కుండా చూస్తూ భూయజమానులకు పూర్తి స్థాయిలో హక్కులు సంక్రమించేందుకు ఉద్దేశించిన ఏ చట్టానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది ?
జ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019
04) మహిళలకు పావలా వడ్డీకే రుణం పొందేలా ఎన్ని లక్షల వరకూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.3 లక్షలు
05) జులై 24న ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ నియమితులవుతున్నారు. ఆయనకు కార్యదర్శిగా ఎవర్ని నియమితస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: ముఖేశ్ కుమార్ మీనా
06) గవర్నర్ కోసం రాజ్ భవన్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
జ: విజయవాడలోని పాత సీఎం క్యాంప్ కార్యాలయం (జలవనరుల శాఖ కార్యాలయం )

జాతీయం
07) ఏ పథకంలో భాగంగా దేశంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఆయుష్మాన్ భారత్
08) వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఎప్పుడు చేపడుతున్నట్టు ఇస్రో ప్రకటించింది ?
జ: 2019 జులై 22న
09) జులై 15న చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని మోసుకెళ్ళాల్సిన ఏ వాహక నౌకలోని క్రయోజనిక్ ఇంజిన్ లో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు ?
జ: GSLV-మార్క్ 3M1
10) జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ ఏ రెండు సామాజిక మాధ్యమాలకు 24 ప్రశ్నలు సంధిస్తూ కేంద్ర నోటీసులు ఇచ్చింది ?
జ: హెలో, టిక్ టాక్
11) హైదరాబాద్ లో పర్యటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఛైర్మన్ ఎవరు ?
జ: పద్మభూషణ్ డాక్టర్ కె.కస్తూరి రంగన్
12) 2019-20 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB) అంచనా వేసింది ?
జ: 7 శాతంగా (గతంలో 7.2శాతంగా అంచానా వేసింది... ఇప్పుడు తగ్గించింది )
13) దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మొదటిసారి ఎప్పుడు 14 బ్యాంకులను జాతీయకరణ చేశారు ?
జ: 1969 జులై 19న
14) డిజిటల్ లావాదేవీల్లో భాగంగా కార్డుల ద్వారా చెల్లింపుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ?
జ: బెంగళూరు మొదటి స్థానం, హైదరాబాద్ రెండో స్థానం
(నోట్: పేమెంట్స్ సొల్యూషన్ సంస్థ రేజర్ పే నిర్వహించిన సర్వేలో తేలింది )
15) అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (IAAF) నుంచి ప్రతిష్టాత్మక వెటరన్ పిన్ అవార్డుకు ఎంపికైన భారత మాజీ అథ్లెట్, ఒలింపియన్ ఎవరు ?
జ: పీటీ ఉష
16) ఇండియన్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ కి ఎవరు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు ?
జ: ట్రెవర్ బేలిస్
17) ట్రెవర్ బేలిస్ ప్రస్తుతం ఏ దేశ క్రికెట్ జట్టుకు కోచ్ గా ఉన్నాడు ?
జ: ఇంగ్లండ్
18) ప్రొ.కబడీ లీగ్ (PKL) సీజన్ -7 ఎక్కడ ప్రారంభం అవుతోంది ?
జ: హైదరాబాద్ లో

అంతర్జాతీయం
19) ప్రపంచ కుబేరుల జాబితాను బ్లూమ్ బర్గ్ ప్రకటించింది. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ఎవరు నిలిచారు ?
జ: మొదటి స్థానంలో జెఫ్ బెజోన్ (అమెజాన్ ), రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్ (LVMH కంపెనీ-ఫ్రాన్స్)
20) ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడేళ్ళలో మొదటిసారిగా మూడో స్థానానికి దిగిపోయిన అపర కుబేరుడు ఎవరు ?
జ: మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్
21) క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి వ్యతిరేకంగా ఏ క్రికెట్ జట్టును ICC అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది ?
జ: జింబాబ్వే