CURRENT AFFAIRS – JUNE 06

ఆంధ్రప్రదేశ్
01) కొత్త శాసన సభలో ప్రొటెం స్పీకర్ గా ఎవరు వ్యవహరించనున్నారు ?
జ: బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు
02) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ?
జ: 12 జిల్లాలు
(నోట్: ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా ప్లాన్ )
03) సముద్ర లోతుల్లో ఆపదలో ఉన్న జలంతర్గామి నుంచి అప్పటికప్పుడు నావికులను రక్షించే అధునాతన వ్యవస్థను భారత్ సొంతం చేసుకుంది. అందుకోసం డీప్ సబ్ మెరైన్స్ రెస్క్యూ వెహికిల్ ను ఏ తీరంలో విజయవంతంగా ప్రయోగించారు ?
జ: విశాఖ తీరంలో

జాతీయం
04) దేశంలోనే మొదటిసారిగా ఏయే అంశాలపై సూచనలు ఇవ్వడానికి రెండు మంత్రి వర్గ సంఘాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు ?
జ: ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన
05) పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి రంగానికి సంబంధించిన కమిటీలో ఎవరెవరు ఉంటారు ?
జ: ప్రధాన నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్
06) ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ఏర్పడే కమిటీలో ఎవరెవరు ఉంటారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, కార్మికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్ సింగ్ పురీ.
07) టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి లోగా ఈ చట్టం తేనున్నారు ?
జ: 2022 లోపు
08) టైటిల్ గ్యారంటీ చట్టాన్ని మొదటగా ఏ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: హరియాణాలో
09) యూపీఏ హయాంలో భూ సంస్కరణల ముసాయిదా చట్టాన్ని ఏ ఏడాదిలో ప్రవేశపెట్టారు ?
జ: 2011 లో
10) దేశంలో పట్టణాల్లో నిరుద్యోగిత శాతం ఎంతగా ఉంది ?
జ: 23.7శాతం
11) తెలంగాణ, ఏపీల్లో పట్టణాల్లో నిరుద్యోగిత శాతం ఎంతగా ఉంది ?
జ: తెలంగాణ : 32.8శఆతం, ఏపీలో 26.9శాతం
12) జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు ఎంతశాతానికి చేరుకుందని జాతీయ గణాంక శాఖ సర్వే ప్రకటించింది ?
జ: 6.1శాతం
13) దేశంలో 15 లక్షల కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రవాణా, రహదారులు, సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే కొత్తగా ఎన్ని ఎక్స్ ప్రెస్ మార్గాలను అభివృద్ధి చేయనున్నారు ?
జ: 22 మార్గాలు
14) భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడిన ఉన్నట్టు ప్రపంచబ్యాంకు స్పష్టం చేసింది. రాబోయే మూడేళ్ల దాకా భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది ?
జ: 7.5 శాతం
15) కిందటేడాది (2018-19)లో సేవా రంగంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఎంత మొత్తం భారత్ కు వచ్చింది ?
జ: 9.15 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.64 వేల కోట్లు )
(నోట్: అంతకు ముందు ఏడాది 2017-18లో 6.7 బిలియన్ డాలర్లు... దాదాపు 47 వేల కోట్లు )
16) దేశంలో చనిపోతున్న చిన్నారుల్లో వాయు కాలుష్యంతో చనిపోతున్న వారి శాతం ఎంతగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ప్రకటించింది ?
జ: 12.5శాతం
17) దేశంలో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ( CSE) ప్రకటించిన నివేదిక పేరేంటి ?
జ: భారత్ లో పర్యావరణ పరిస్థితి ( SOE)

అంతర్జాతీయం
18) టెక్నాలజీ రంగంలో చేసిన విశిష్ట సేవలకు భారత సంతతికి చెందిన గూగుల్ CEO సుందర్ పిచాయ్ కి గ్లోబల్ లీడర్ షిప్ ను ఏ సంస్థ ప్రకటించింది ?
జ: అమెరికా - భారత వాణిజ్య మండలి ( USIBC)
19) అమెరికా ప్రతినిధుల సభలో తాత్కాలిక స్పీకర్ గా ఎంపికైన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళ ఎవరు ?
జ: ప్రమీల జయపాల్
20) ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల రక్షణ బడ్జెట్ ను తగ్గించుకున్న మన పొరుగు దేశం ఏది ?
జ: పాకిస్తాన్
21) నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన దేశం ఏది ?
జ: చైనా
22) నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి చైనా ప్రయోగించిన రాకెట్ ఏది ?
జ: చాంగ్ ఝెంగ్ 11 వాహక రాకెట్