CURRENT AFFAIRS JUNE 12

ఆంధ్రప్రదేశ్
01) జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త కవి, మాజీ ఎంపీ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె )పార్లమెంటు ప్రసంగాల సంకలనం పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: పెద్దల సభలో తెలుగు పెద్ద (పుస్తక సంకలన కర్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ )
02) ఏపీ సమాచార కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: విజయ్ కుమార్ రెడ్డి
03) టాటా పవర్ సోలార్ సంస్థ ఏ పేరుతో తిరుపతిలో తన సేవలను అందిస్తోంది ?
జ: ప్లెడ్జ్ ఫర్ సోలార్ పేరుతో
04) రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో పది మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న సూక్ష్మ కాలుష్య ధూళి కణాలు (PM10) పరిమితికి మించి నమోదవుతున్నట్లు కాలుష్య నియమంత్రణ మండలి ప్రకటించింది. రాష్ట్రంలో అత్యధికంగా 104 మైక్రోగ్రాములు ఏ నగరంలో ఉంది ?
జ: విజయవాడ

జాతీయం
05) రాజ్యసభ నేతలకు ఎవరు నియమితులయ్యారు ?
జ: కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్
(నోట్: గతంలో బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ ఈ బాధ్యతలు నిర్వహించారు )
06) 17వ లోక్ సభలో ప్రొటెం స్పీకర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: వీరేంద్ర కుమార్ ( మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ - 7 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు )
07) దేశంలో ఎప్పటిలోగా ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. (కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ )
జ: 2024 కల్లా
08) డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆన్ లైన్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎప్పటి నుంచి ఛార్జీలును ఎత్తివేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ?
జ: 2019 జులై 1 నుంచి
09) కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC) గా కె.వి చౌదరి పదవీ కాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం ఎవరిని తాత్కాలికంగా ఈ పదవిలో నియమించింది ?
జ: శరద్ కుమార్
10) ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య కార్యదర్శిగా ఎవరిని మళ్లీ నియమించారు ?
జ: నృపేంద్ర మిశ్ర
11) హైజాకింగ్ వ్యతిరేక చట్టం 2016 అమల్లోకి వచ్చాక మొదటి శిక్ష ఎవరికి పడింది ?
జ: ముంబై పారిశ్రామిక వేత్త బిర్జు కె.సల్లా
(నోట్: 2017 అక్టోబర్ 30న ముంబై - ఢిల్లీ జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని హైజాక్ చేస్తానని పేపర్ టిష్యూపై రాసి బెదిరించాడు )
12) అరేబియా సముద్రంలో ఏర్పడిన భారీ తుఫాన్ కు ఏమని పేరు పెట్టారు ?
జ: వాయు
13) అమెరికా నౌకాదళానికి సంబంధించిన ఏ నౌక నాలుగు రోజుల పర్యటన కోసం విశాఖ తీరానికి చేరుకుంది ?
జ: జేపీ ముర్తా
14) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించే క్రీడాకారుల జాబితా ఫోర్బ్స్ 2019లో స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ క్రీడాకారుడు ఎవరు ?
జ: భారత్ క్రికెట్ కెఫ్టెన్ విరాట్ కోహ్లీ

అంతర్జాతీయం
15) ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా అవతరించిన అగ్రగామి రిటైల్ సంస్థ ఏది ?
జ: అమెజాన్
16) ప్రస్తుతం అమెజాన్ బ్రాండ్ విలువ ఎంతగా ఉంది ?
జ: రూ.22.05 లక్షల కోట్లు ( 315 బిలియన్ డాలర్లు )
17) కొత్తగా అందుబాటులోకి వస్తున్న 5G పరిజ్ఞానాన్ని శస్త్రచికిత్సలో ఉపయోగించిన సంఘటన ఏ దేశంలో జరిగింది ?
జ: చైనా