CURRENT AFFAIRS JUNE 13 & 14

ఆంధ్రప్రదేశ్
01) ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఎవరిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ?
జ: జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్, జస్టిస్ ఎం. వెంకట రమణ
02) ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో మొత్తం జడ్జిల సంఖ్య ఎంతకు చేరింది ?
జ: 13 మందికి
03) APIIC ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా

జాతీయం
04) పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎక్కడ జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ దగ్గర ప్రస్తావించారు ?
జ: బిష్కెట్ (కిర్కిజిగిస్తాన్ )
05) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఫించన్ పథకం కింద ఫించన్ నిధికి రైతులు నెలకు ఎంతమొత్తం చెల్లించాలని కేంద్ర నిర్దేశించింది ?
జ: రూ.100 మాత్రమే
06) ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగులు చెల్లిస్తున్న ESIC చందా మొత్తాన్ని ఎంతకు తగ్గిస్తూ కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది ?
జ: 6.5శాతం నుంచి 4 శాతానికి
07) చంద్రయాదన్ 2 కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడుతున్నట్టు ఇస్రో ప్రకటించింది ?
జ: 2019 జులై 15న
08) ఎన్ని టన్నుల బరువుతో అంతరిక్షంలో సొంతంగా కేంద్ర నిర్మించాలని ఇస్రో నిర్ణయించింది ?
జ: 20 టన్నులు
09) ఫోర్బ్స్ జాబితా విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతి పెద్ద సంస్థల జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు ఉన్నాయి ?
జ: 57 కంపెనీలు
10) అంతర్జాతీయంగా అగ్రగామి 10 వినియోగదారు ఆర్థిక సంస్థల్లో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన బ్యాంకు ఏది?
జ: HDFC
11) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉంచుకోవాల్సిన మూలధన పరిమాణం అంశాన్ని ఏ కమిటీ పరిశీలిస్తోంది ?
జ: బిమల్ జలాన్ కమిటీ
12) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎంత శాతం మంది మన దేశంలో ఉన్నారు ?
జ: 12శాతం మంది
13) భారత నౌకాదళానికి 1,187.82 కోట్ల విలువైన అధిక బరువున్న టోర్పెడోలు సరఫరా చేసే భారీ ఆర్డర్ ఏ సంస్థకు దక్కింది ?
జ: భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL- హైదరాబాద్ )
(నోట్: 42 నెటల్లో వీటిని సరఫరా చేయనుంది )
14) మండుటెండల్లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎయిర్ కండీషన్డ్ హెల్మెట్స్ అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఛత్తీస్ గఢ్
15) బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బిహార్ కు చెందిన ఎంతమంది రైతుల బ్యాంకు రుణాలను చెల్లించారు ?
జ: 2,100 మంది

అంతర్జాతీయం
16) ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎన్నికోట్లకు చేరినట్టు మేరీ మీకర్ 2019 నివేదిక తెలిపింది ?
జ: 380 కోట్లు