Sunday, April 5

CURRENT AFFAIRS JUNE 23 & 24

ఆంధ్రప్రదేశ్
01) రూ.90కోట్లతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్డాఫీస్ ను ఏపీలో ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొడపావులూరులో
02) తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకించారు ?
జ: వై.వి. సుబ్బారెడ్డి

జాతీయం
03) ఏ హైకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ లెటర్ రాశారు ?
జ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్. శుక్లా
(నోట్: 2017-18 విద్యా సంవత్సరంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి )
04) సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద తాత్కాలిక ప్రాతిపదికన రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించాలని CJI జస్టిస్ రంజన్ గొగొయ్ కేంద్రానికి లెటర్లు రాశారు ?
జ: 128, 224 ఎ అధికరణాలు

అంతర్జాతీయం
05) ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు ఇదే రకంగా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి గ్రీన్ ల్యాండ్ లో ఎంతశాతం మంచు కరుగుతుందని లేటెస్ట్ సర్వేలో వెల్లడైంది ?
జ: 4.5శాతం
06) విదేశీయులకు శాశ్వత నివాస పథకాన్ని సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే ఈ కొత్త పథకంలో భాగంగా ఎంత్త మొత్తం సౌదీ ప్రభుత్వానికి చెల్లిస్తే పర్మినెంట్ రెసిడెన్స్ సౌకర్యం కల్పిస్తారు ?
జ: 8 లక్షల రియాద్ లు...( రూ.21 కోట్లు లేదా 2.313 లక్షల అమెరికా డాలర్లు )
07) హాలే ఓపెన్ గ్రాస్ టోర్నీ టైటిల్ ను పదోసారి గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం ఎవరు ?
జ: రోజర్ ఫెదరర్
08) వెయ్యి కోట్లతో (145 మిలియన్ అమెరికన్ డాలర్లు ) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త కార్యాలయం ఎక్కడ ప్రారంభమైంది ?
జ: లుసానె (స్విట్జర్లాండ్ )
(నోట్: ఈ కార్యాలయాన్ని IOC అధ్యక్షుడు థామస్ బాచ్ 2019 జూన్ 23న ప్రారంభించారు. ఒలింపిక్ క్రీడలను పునరుద్దరించి 125యేళ్ళయిన సందర్భంగా ఈ భవనం ప్రారంభించారు )
09) శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏ నెలలో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత శ్రీలంకలో ఎమర్జన్సీ విధించారు ?
జ: 2019 ఏప్రిల్ లో