CURRENT AFFAIRS JUNE 25

ఆంధ్రప్రదేశ్
01) ఏపీలో అర్హత ఉన్న పేదలందరికీ ఒక్కొక్కరికి ఎంత భూమిని ఏడాదిలోగా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు ?
జ: సెంటున్నర
02) మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏ రోజు ?
జ: జులై 8
03) పక్షవాతం, కుష్టు వ్యాధి గ్రస్తులకు ఎంత మొత్తం ఫించన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: రూ.10 వేలు
04) ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) గ్రామీణ్ లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఎన్ని ఇళ్ళను కేటాయించింది ?
జ: 47,800 ఇళ్ళు
05) మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయ రీతిలో నిర్మాణం, పరిశుభ్రదత తదితర అంశాల ప్రాతిపదికన నిర్వహించిన పోటీల్లో వ్యక్తిగత విభాగంలో స్వచ్ఛ సుందర్ సౌచాలయ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: నెల్లూరు జిల్లాకి చెందిన కోడూరు గోవిందమ్మ
06) పాస్ పోర్ట్ జారీ అంశంలో త్వరగా పోలీస్ పరిశీలిచే ప్రక్రియను పూర్తి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగానికి విదేశాంగ శాఖ నుంచి పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ?
జ: గతంలో నిఘా విభాగం ఎస్పీ, ప్రస్తుతం గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మి

జాతీయం
07) విదేశాల్లో భారతీయులు దాచిన బ్లాక్ మనీ ఎంతగా ఉన్నట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం అంచనా వేసింది. ?
జ: రూ.34, లక్షల కోట్లు
08) ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా వాడుకునేందుకు వీలు కల్పించే ఏ చట్టాన్ని సవరించడానికి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ?
జ: ఆధార్ చట్టం 2016
09) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నది ఎవరు ?
జ: విరాల్ ఆచార్య
10) బ్యాంకులు, NBFC సంస్థలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు వీలుగా RBI తన వెబ్ సైట్ లో ఓ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. దాని పేరేంటి ?
జ: కంప్లయింట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (CMS)
11) 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఏ విమానాల వల్లే భారత్ గెలిచిందని ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు ?
జ: మిరాజ్ 2000
12) విదేశాంగమంత్రి జయ్ శంకర్ ను ఎక్కడి నుంచి రాజ్యసభ ఎంపీగా పంపాలని బీజేపీ నిర్ణయించింది ?
జ: గుజరాత్ నుంచి
13) నోయిడాలోని తమ SEZ క్యాంపస్ లో HR సేవల కోసం హ్యుమనాయిడ్ ను ప్రవేశపెట్టిన కంపెనీ ఏది ?
జ: టెక్ మహీంద్రా