CURRENT AFFAIRS JUNE 26

ఆంధ్రప్రదేశ్
01) నాలుగేళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంతశాతం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు ?
జ: 67శాతం
02) 2015 మార్చి నాటికి రూ.1,48,743 కోట్లు ఉన్న అప్పు 2018-19 నాటికి ఎంతకు చేరింది ?
జ: రూ.2,49,435 కోట్లు
03) వైఎస్పార్ పెళ్ళి కానుక సాయం మొత్తాన్ని ఎంతకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, బీసీలకు 50 వేలు, మైనార్టీలు, దివ్యాంగులకు లక్ష చొప్పున
04) ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాన ప్రజా సంబంధాల అధికారి (CPRO) గా ఎవరు నియమితులయ్యారు ?
జ: గాపూడి శ్రీహరి
05) నీతి ఆయోగ్ విడుదల చేసిన రాష్ట్రాల ఆరోగ్య సూచీలో ఆంద్రప్రదేశ్ కి ఎన్నో ర్యాంక్ దక్కింది ?
జ: రెండో ర్యాంక్.
06) విశాఖపట్నం - విజయవాడ మధ్య ప్రతిపాదిత రైలు మళ్ళీ విశాఖ చేరే అవకాశాలున్నాయి. ఆ రైలు పేరేంటి ?
జ: ఉదయ్ ఎక్స్ ప్రెస్
07) రాష్ట్రానికి చెందిన ఎన్ని గ్రామపంచాయతీలో రూరల్ డెవలప్ మెంట్ గ్యాప్ అనాలసిస్ సర్వేలో 75శాతానికి పైగా మార్కులు సాధించాయి ?
జ: 1502 పంచాయతీలు

జాతీయం
08) నీతి ఆయోగ ప్రకటించిన జాబితాలో దేశంలో ఆరోగ్య సాధనలో మొదటి రాష్ట్రంలో ఏది నిలిచింది ?
జ: కేరళ
09) దేశంలో వైద్య సేవలపై నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేరేంటి ?
జ: పురోగమన భారత్ లో ఆరోగ్య రాష్ట్రాలు
10) నలుగురు టీడీపీ ఎంపీల చేరికతో రాజ్యసభలో బీజేపీకి ఎంత మంది సభ్యుల బలం ఉంది ?
జ: 74 మంది సభ్యులు
(నోట్: జులై 5న జరిగే 6 స్థానాల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత మొత్తం ఎన్డీఏ సభ్యుల బలం 109 మందికి చేరుతుంది )
11) ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నియమించిన కమిషన్ గడువు ఎప్పటి దాకా పొడిగించినట్టు కేంద్ర సామాజిక న్యాయం,సాధికార శాఖ మంత్రి థావర్ చంద్ గహ్లోత్ తెలిపారు ?
జ: 2019 జులై 31 వరకూ
12) ఇటీవల వార్తల్లోకి వచ్చిన కట్ మనీ అంటే ఏంటి ?
జ: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో లబ్దిదారులుకు అందే మొత్తాల్లో కమీషన్ తీసుకోడాన్ని కట్ మనీగా పశ్చిమబెంగాల్ లో వ్యవహరిస్తున్నారు
13) దేశ విభజన సమయంలో లండన్ బ్యాంకులో హైదరాబాద్ ఏడో నిజాం నవాబు ఎంత మొత్తాన్ని దాచి ఉంచాడు ?
జ: 3.5 కోట్ల పౌండ్లు ( రూ.300 కోట్లు)
(నోట్: వీటిని పాకిస్తాన్ కు అప్పగించాలా లేదా నిజాం వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫ ఖంజాకి చెందాల అన్న దానిపై బ్రిటన్ కోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది )
14) ఆధ్యాత్మిక గురువు స్వామి సత్య మిత్రానంద గిరి మహారాజ్ (87) డెహ్రాడూన్ లో చనిపోయారు. ఆయన ఏ ట్రస్ట్ కి సారధిగా ఉన్నారు ?
జ: భారత్ మాత జనహిత్ ట్రస్ట్