CURRENT AFFAIRS – JUNE 27

ఆంధ్రప్రదేశ్
01) రాష్ట్రంలో అమ్మఒడి లబ్దిదారులు ఎంతమంది ఉన్నట్టు ప్రాథమికంగా పాఠశాల విద్యాశాఖాధికారులు అంచనా వేశారు ?
జ: 37 లక్షల మంది
02) ఉడాన్ ప్రాంతీయ అనుసంధాన పథకం (RCS) లో భాగంగా ఏరో డ్రోమ్ నిర్మాణానికి (జల విమానాశ్రయం) ఏపీలో ఏ ప్రాంతాన్ని కేంద్రం గుర్తించింది ?
జ: నాగార్జున సాగర్
03) రాష్ట్రంలో రూ.12 వందల కోట్లతో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద తీర ప్రాంతంలో
(నోట్: ప్రభుత్వం 381 ఎకరాల భూమి కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనికి ఆమోదం తెలపనుంది )
04) రాష్ట్రంలో లోటు వర్షపాతంతో ఎన్ని మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు ?
జ: 505 మండలాలు
05) ప్రేమ, వాత్సల్యం, గౌరవం, కృతజ్ఞత, నమ్మకం, సానుభూతి, అభినందన, ఏకత్వం, నిజాయతీ-జ్ఞానం, అంగీకారం... లాంటి 9 మానవీయ విలువలను పెంపొందచేందుకు ఇకపై స్కూళ్ళల్లో మొదటి పీరియడ్ లో 30 నిమిషాల పాటు ఏ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ?
జ: ఆనంద వేదిక కార్యక్రమం

జాతీయం
06) దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొన్న 255 జిల్లాల్లో జులై 1 నుంచి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: జల్ శక్తి అభియాన్
07) బాలాకోట్ దాడుల వ్యూహకర్త అయని సామంత్ గోయల్ కు కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థకు అధిపతిగా నియమించింది ?
జ: రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) చీఫ్
08) ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కశ్మీర్ నిపుణుడు అర్వింద్
09) ప్రస్తుతం IB చీఫ్ గా ఎవరు పదవిలో ఉన్నారు ?
జ: రాజీవ్ జైన్ (ఈయన పదవీ కాలం ఈనెల 30తో ముగుస్తోంది)
10) వాయిు కాలుష్యంతో భారతీయ మహిళలకు అధిక రక్త పోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని ఏ ఇనిస్టిట్యూట్ కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు ?
జ: బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్
11) భారతీయ మహిళ ఆరోగ్యంపై బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు ఎక్కడ పరిశోధనలు చేశారు ?
జ: హైదరాబాద్ శివారుల్లో
12) అంతర్జాతీయంగా హిల్ కాల్ కలరా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు హిల్లేమ్యాన్ ల్యాబ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ ఔషధ దిగ్గజం ఏది ?
జ: భారత్ బయోటెక్
13) సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు ( MSME) లకు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
జ: యూకే సిన్హా కమిటీ
14) ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల హైదరాబాద్ లో చనిపోయారు. ఆమె 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమెకు ఏ గిన్నిస్ రికార్డు ఉంది ?
జ: అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా