CURRENT AFFAIRS – JUNE 28

ఆంధ్రప్రదేశ్
01) ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొ. కె.హేమచంద్రారెడ్డి
02) ఏపీలో వైద్య సౌకర్యాల మెరుగు కోసం రూ.2,264కోట్లు (328 మిలియన్ డాలర్లు) రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంస్థ ఏది ?
జ: ప్రపంచ బ్యాంక్
03) రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: సజ్జల రామకృష్ణా రెడ్డి
04) ఇంటర్ విద్యార్థులకు కూడా అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయాలని ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలను చదివించే ప్రతి తల్లికి ఏటా ఎంత మొత్తాన్ని ఇస్తారు ?
జ: రూ.15 వేలు
05) అంతర్జాతీయ నవ జాత శిశువుల వైద్య సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: విజయవాడలో
(నోట్: జాతీయ నియోనాటాలజీ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో హోటల్ నోవా టెల్ లో నిర్వహిస్తారు )
06) షార్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఆర్ముగం రాజరాజన్

జాతీయం
07) జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడికి వెళ్ళారు ?
జ: జపాన్ లోని ఒసాకా నగరానికి
08) దేశంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)లను విలీనం చేసి ఏ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఉన్నత విద్యా కమిషన్
09) మౌలిక వసతుల కల్పన భారంగా మారడంతో ఏ నగరంలో అపార్ట్ మెంట్స్ ( బహుళ అంతస్తు) నిర్మాణాలపై నిషేధం విధించాలని భావిస్తున్నారు ?
జ: బెంగళూరులో
10) కాగిత రహిత కార్యాలయాల నిర్వహణ దిశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన సిస్టమ్ ఏది ?
జ: డ్రాయింగ్ అప్రూవల్ సిస్టమ్ ( ఈ-డాస్)
11) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( NCTE) రుసుముల కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొ. ఘంటా రమేష్ ( ఖమ్మం జిల్లా )
(నోట్: దేశంలోని దాదాపు 20 వేల బీఈడీ, 16 వేల డీఈడీ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంత రుసుము ఉండాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది )
12) ఏ బ్యాంకుతో కలసి భారత్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఆధారిత సేవలను ప్రారంభించేందుకు వాట్సాప్ సిద్ధమైంది ?
జ: ICICI బ్యాంక్