CURRENT AFFAIRS – JUNE 29

జాతీయం
05) మొక్క జొన్న, వేరు సెనగల్లో ఏ విషపూరిత పదార్థం ఉండటం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ?
జ: అఫ్లోటాక్సిన్
06) యాక్సిస్ బ్యాంక్, MSME మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2018-19 సంవత్సరం ఉత్తమ SME అవార్డు హైదరాబాద్ కు చెందిన ఏ కంపెనీకి దక్కింది ?
జ: షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్
07) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రబుత్వం వడ్డీ రేటు ఎంత శాతం తగ్గించింది ?
జ: 0.1 శాతం
08) ఆస్ట్రేలియా సాంకేతిక సహకారంతో రూ.650కోట్ల పెట్టుబడితో థర్మల్ సెల్ తయారీ పరిశ్రమను ఎక్కడ నెలకొల్పనున్నారు ?
జ: హైదరాబాద్ లో
09) ఒక్కసారి ఛార్జింగ్ తో 800 కిమీలు ప్రయాణించే సామర్థ్యం ఉన్న థర్మల్ సెల్ (హై ఎనర్జీ డెన్సిటీ స్టోరేజ్ డివైజ్ - హెడ్స్) ను ఆవిష్కరించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ పాట్రిక్ గ్లిన్
10) ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లిథియాన్ బ్యాటరీ (దీని తయారీకి కోబాల్ట్, లిథియం వాడతారు ) కి బదులుగా వస్తున్న హెడ్స్ బ్యాటరీల్లో దేన్ని వాడతారు ?
జ: గ్రాఫైట్, సిలికాన్
11) గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో మన దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఏది నిలిచింది ?
జ: ముంబై
12) ఆసియా పరంగా చూస్తే ముంబై ఎన్నో స్థానంలో ఉంది ?
జ: 67 వ ర్యాంక్
13) మెర్సర్ సంస్థ నిర్వహించిన అత్యంత ఖరైదన నగరాల్లో మిగతా నగరాలకు వచ్చిన ర్యాంకులు ఏవి ?
జ: ఢిల్లీ (118), చెన్నై (154), బెంగళూరు (179), కోల్ కతా (189)
14) భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన IIT ఏది ?
జ:IIT కాన్పూర్

అంతర్జాతీయం
15) ఐఫోన్, ఐపాడ్, ఐమ్యాక్ లాంటి యాపిల్ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన డిజైన్స్ ఇచ్చిన చీఫ్ డిజైనర్ ఆ సంస్థ నుంచి వైదొలిగి సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయన పేరేంటి ?
జ: జానీ ఈవ్
16) గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఏది నిలిచింది?
జ: హాంకాంగ్ (వరుసగా రెండోసారి )
(నోట్ : మొత్తం 209 నగరాల్లో నిర్వహించిన సర్వేలో 8 నగరాలు ఆసియాలోనే ఉన్నాయి )
17) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు, వాటికి వచ్చిన ర్యాంకులు తెలపండి ?
జ: టోక్యో (2), సింగపూర్ (3), సియోల్ (4), జ్యూరిక్ (5), షాంఘై (6)
18) ప్రపంచంలో తక్కువ ఖరీదైన నగరాల్లో ఏవి నిలిచాయి ?
జ: టునిస్ (209), తాష్కెంట్ (208), కరాచీ (207)
19) ఆస్ట్రేలియా అందాల పోటీల్లో మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాగా నిలిచిన భారతీయ సుందరి ఎవరు ?
జ: ప్రియా సెరావ్
(నోట్: ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో సెరావ్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది )
20) జలాంతర్గామి నుంచి ప్రయోగించే JL3 అత్యాధునిక ఖండాంతర క్షిపణిని జూన్ 2న విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించిన దేశం ఏది ?
జ: చైనా
21) 2022లో జరిగే వింటర్ ఒలింపిక్ గేమ్స్ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించనున్నాయి. ఈ పోటీల సందర్భంగా సహజ కార్బన్ డై ఆక్సైడ్ శీతలీకరణ వ్యవస్థను ఉపయోగించనున్నారు. ఈ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయి ?
జ: బీజింగ్ (చైనా)
22) శని గ్రహం చుట్టూ తిరుగుతున్న భారీ చందమామ టైటన్ ను పరిశోధించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఏ డ్రోన్ ని పంపాలని నిర్ణయించింది ?
జ: డ్రాగన్ ఫ్లై
(నోట్: 2026లో ఈ డ్రోన్ ను ప్రయోగిస్తారు. ఇధి 2034లో టైటన్ ను చేరుకుంటుంది )
23) డేటా ఆధారంగా పనిచేసే IOT పరికరాలే లక్ష్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ ఏది ?
జ: సైలెక్స్