CURRENT AFFAIRS – JUNE 30

ఆంధ్రప్రదేశ్
01) రైతు జీవితాలను కళ్ళముందుంచే కథానికల్ని రాసిన ప్రముఖ రచయిత, కవి ప్రొద్దుటూరులో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: డాక్టర్ ఎన్ రామచంద్ర
02) రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే కోసం ఎన్ని కోట్ల వ్యయం అవుతుందని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ?
జ: రూ.1758 కోట్లు
03) దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు జులై 8 ని ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన ఎంతమంది రైతులకు రైతు నేస్తం అవార్డు ఇవ్వనుంది ?
జ: 13 మందికి (జిల్లాకి ఒకరు చొప్పున)
04) రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కింద 64.05 లక్షల మందికి రూ.5,085 కోట్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏటా రైతులు, కౌలు రైతులకు ఎంత మొత్తాన్ని అందించనున్నారు ?
జ: రూ.12,500
05) విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఇంధన పొదుపునకు కృషి చేస్తున్న APSPDCL కు ఏ అవార్డు దక్కింది ?
జ: జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు

జాతీయం
06) కేదరీ నాథ్ ఆలయం దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం చేసిన గుహకు డిమాండ్ ఏర్పడింది. అక్కడే ధ్యానం చేసేందుకు చాలామంది ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఆ గుహ పేరేంటి ?
జ: ధ్యాన గుహ
07) ఆగస్టు 15 నుంచి ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని ఏయే రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రకటించారు ?
జ: ఏపీ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర
08) ఒకే దేశం - ఒకే కార్డు విధానాన్ని ఎప్పటి కల్లా దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2020 జూన్ 30 నాటికి
09) దేశంలో కొత్త రైల్వే టైమ్ టేబుల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2019 జులై 1 నుంచి
10) అమెరికాలోని ఆస్పత్రులు, బీమా కంపెనీలకు ఆఫ్ షోర్, ఆన్ సైట్ పద్దతిలో అనలిటికల్ సేవలు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ డేలా మార్షల్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ అవార్డు దక్కింది ?
జ: ఇండియా SME 100 అవార్డు
11) జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ గా జూలై 1 నుంచి బాధ్యతలు చేపడుతున్న భారత క్రికెట్ దిగ్గజం ఎవరు ?
జ: రాహుల్ ద్రవిడ్

అంతర్జాతీయం
12) ఏ రెండు బడా దేశాలు వాణిజ్య యుద్ధాన్ని నిలిపివేసి... చర్చలు జరపాలని నిర్ణయించాయి ?
జ: అమెరికా - చైనా
13) అమెరికాలో నిర్వహించిన క్విజ్ షోలో లక్ష డాలర్లు గెలుచుకున్న భారత్ అమెరికన్ యువకుడు ఎవరు ?
జ: అవి గుప్తా
(నోట్: 2019 టీన్ జెపర్డీ అనే పోటీలో సాధారణ విజ్ఞానంపై ఈ అవార్డు గెలుచుకున్నాడు)
14) భారత్ , బ్రిటన్ మధ్య సంబంధాలను పెంపొందించినందుకు ఏ బ్రిటీష్ సీనియర్ జర్నలిస్టుకి యాన్యువల్ యుకే-ఇండియా అవార్డ్స్ లో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు దక్కింది ?
జ: సర్ మార్క్ టులీ
(నోట్: గతంలో ఈయన బీబీసీ బ్యూరో చీఫ్ గా ఢిల్లీలో పనిచేశారు. ఎలిజబెత్ 2 మహారాణి నుంచి నైట్ బిరుదుతో పాటు, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ కూడా అందుకున్నారు. )