CURRENT AFFAIRS JUNE 5

ఆంధ్రప్రదేశ్
01) ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుబ్రమణ్యం శ్రీరామ్
02) ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: అజేయ కల్లం ( రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి)
03) సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పేరుతో ఇచ్చే జాతీయ పురస్కారాలు ఎవరికి దక్కాయి ?
జ: నటుడు చంద్రమోహన్, సేవా రంగం నుంచి ముంబైకి చెందిన అబిద్ సూర్తి

జాతీయం
04) వంటగ్యాస్ సబ్సిడీని ధనికులు వదులుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ గతంలో ఇచ్చిన నినాదం ఏది ?
జ: గివ్ ఇట్ అప్
05) గివ్ ఇట్ అప్ స్ఫూర్తితో ఇప్పుడు పేద విద్యార్థులను చదివించేందుకు ఏ నినాదాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: ఈచ్ వన్.. టీచ్ వన్
06) ఈచ్ వన్ టీచ్ వన్ కింద ఎన్ని కోట్ల రూపాయలు సేకరించి, ఉన్నత విద్య చదివే 10 లక్షల మంది పేద విద్యార్థులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: రూ.25 వేల కోట్లు
07) మనుషుల్లో కుంగుబాటుకు కారణమయ్యే సెరటోనిన్ గ్రాహకాల సంచారానని కణాల్లో గుర్తించినట్టు ఏ శాస్త్రవేత్తలు ప్రకటించారు ?
జ: CCMB శాస్త్రవేత్తలు
08) 23 యేళ్ళ విద్యార్థికి ప్రాణాంతక నిఫా వైరస్ సోకింది. ఈ సంఘటన ఏ రాష్ట్రంలో బయటపడింది ?
జ: కేరళలో
09) భారత వాతావరణ విభాగం (IMD) చీఫ్ గా ప్రముఖ శాస్త్రవేత్త, సైక్లోన్ మ్యాన్ నియమితులయ్యారు. ఆయన పేరేంటి ?
జ: మృత్యుంజయ మహాపాత్ర
10) క్రికెట్ వరల్డ్ కప్ 2019 లో భారత్ మొదటి మ్యాచ్ ఏ జట్టుతో ఆడుతోంది ?
జ: దక్షిణాఫ్రికా
11) భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రపంచ క్రికెట్ కప్ 2019 మొదటి మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది ?
జ: సౌథాంప్టన్

అంతర్జాతీయం
12) కంటి శుక్లాలకు నిర్ధిష్టమైన చికిత్సను రూపొందించి ఎందరికో దృష్టి ప్రసాదించిన ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయారు. ఆమె పేరేంటి ?
జ: డాక్టర్ ఫ్యాట్రీసియా బాత్