CURRENT AFFAIRS – JUNE 7

ఆంధ్రప్రదేశ్
01) CBIకి ఏపీలో అనుమతి నిరాకరిస్తూ గత టీడీపీ సర్కార్ చేసిన జీవోను సీఎం జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ జీవో నెంబర్ ఎంత ?
జ: జీవో 176
02) ఏపీలో రైతు భరోసా కింది అన్నదాతలకు పెట్టుబడి సొమ్ముగా 2019 అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతు కుటుంబానికి ఎంత మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది ?
జ: రూ.12,500లు
(నోట్: గతంలో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు )
03) ప్రమాదవశాత్తూ చనిపోయిన, ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద ఎంత మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు ?
జ: రూ.7 లక్షలు సాయం
04) రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి

జాతీయం
05) ఎనిమిది కీలక మంత్రి వర్గ సంఘాలు (కేబినెట్ కమిటీలు) తో పాటు నీతి ఆయోగ్ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
06) డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వేటిపై ఛార్జీలు ఎత్తివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ?
జ: RTGS, NEFT
07) డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి ఛార్జీలు ఎత్తివేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
జ: నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ
08) దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్ ప్రేమ్ జీ 2019 జులై 30న ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారు. ఈ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తున్నారు ?
జ: ప్రేమ్ జీ కొడుకు రిషద్ ప్రేమ్ జీ
09) పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాద స్థావరాలపై విసిరన తరహాలోని స్పైస్ 2000 బాంబులను కొనుగోలు చేసేందుకు రూ.300 కోట్లతో భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇజ్రాయెల్
(నోట్: 900 కిలోల ఉక్కు కవచంతో 80 కిలోల పేలుడు పదార్థాలతో ఈ బాంబు ఉంటుంది)
10) ఇంగ్లండులో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ లో ధోనీ ధరించిన ఏ గుర్తును తీసివేయించాలని BCCI కి ICC విజ్ఞప్తి చేసింది ?
జ: బలిదాన్ బ్యా్డ్జ్ - ఇది ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో
11) మహేంద్ర సింగ్ ధోనీకి ఆర్మీలో గౌరవ ప్రదమైన హోదా ఉంది. అది ఏంటి ?
జ: గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా

అంతర్జాతీయం
12) 2019 జూన్ 12 - 14 తేదీల మధ్య షాంఘై సహకార సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: కర్గిజిస్తాన్ లో రాజధాని బిష్కెక్ లో
13) తమ దేశంలో 5జీ మొబైల్ సేవలను ప్రారంభించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీలకు వాణిజ్య లైసెన్సులు ఇచ్చిన దేశం ఏది ?
జ: చైనా