CURRENT AFFAIRS – JUNE 8

ఆంధ్రప్రదేశ్
01) టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ ఎవరు ?
జ: సుధా నారాయణ మూర్తి
02) ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: జీవీడీ కృష్ణ మోహన్
03) ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా నియమితులయ్యే తమ్మినేని సీతారామ్ ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ?
జ: శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస

04) పంటలకు మద్దతు ధరలను కేంద్ర స్థాయిలో నిర్ణయించే కమిషన్ ఏది ?
జ: భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (CACP)
05) ప్రస్తుతం వరికి ఎంత మద్దతు ధర కొనసాగుతోంది ?
జ: రూ.1750లు

జాతీయం
06) నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించాక మొదటగా ఏ దేశంలో పర్యటించారు ?
జ: మాల్దీవులు తర్వాత శ్రీలంక
07) మాల్డీవుల్లో ఏర్పాటు చేసినే తీర ప్రాంతా నిఘా రాడార్ వ్యవస్థ ( హిందూ మహాసముద్రంలో భారత నౌకా దళ నిథా సామర్థ్యం పెరుగుతంది ) ను ఆ దేశాధ్యుక్షుడితో ప్రారంభించారు. మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు ?
జ: సోలిహ్
08) క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకొస్తోంది. క్రిప్టో కరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019 ప్రకారం క్రిప్టోకరెన్సీని రూపొందించినా, దగ్గర ఉంచుకున్నా, అమ్మినా, లావాదేవీలు జరిపినా ఎన్నేళ్ళ జైలు శిక్ష వేయనున్నారు ?
జ: 10 యేళ్ళు
09) కేబినెట్ సెక్రటరీ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. దీంతో ఎక్కువ కాలం కొనసాగిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో ఎవరు కొనసాగుతున్నారు ?
జ: ప్రదీప్ కుమార్ సిన్హా
10) దేశంలో అడవులు నాశనమైన భూముల్లో తిరిగి చెట్ల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాంటి చోట్ల వనాలను పెంచి దాంతో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పొందే అవకాశం కల్పించనుంది. ఈ కార్యక్రమాన్ని ఏ పేరుతో చేపడుతున్నారు ?
జ: ఆగ్రో ఫారెస్ట్రీ ( వ్యవసాయ వనాలు )
11) భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటనకు జయశంకర్ ఏ దేశం వెళ్లారు ?
జ: భూటాన్

అంతర్జాతీయం
12) బ్రెగ్జిట్ వ్యవహారంలో తన విధానాలకు మద్దతు లభించకపోవడంతో బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రధాని థెరిసా మే ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకురాలిగా రాజీనామా చేశారు. ఆమె ఏ పార్టీకి చెందినవారు ?
జ: కన్జర్వేటివ్ పార్టీ ( టోరీ)
13) బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్వెల్త్ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా మొదటిసారిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు ?
జ: కుమార్ అయ్యర్
14) అమెరికాలోని 80మంది అత్యంత ధనిక మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంతతి ముగ్గురు మహిళలు ఎవరు ?
జ: ఆరిస్టా నెట్ వర్క్స్ CEO జయశ్రీ ఉల్లాల్, సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథీ, కన్ ఫ్లుయెంట్ టెక్నాలజీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే