CURRENT AFFAIRS – MAR 14

ఆంధ్రప్రదేశ్
01) మంత్రి లోకేశ్ ను 2019 యంగ్ గ్లోబల్ లీడర్ గా గుర్తించిన సంస్థ ఏది ?
జ: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)
02) మానవ వనరుల అభివృద్ధి, నిర్వహణలో విశేష ప్రతిభ కనపరచినందుకు అమర్ రాజా బ్యాటరీస్ కి ఏ సంస్థ నుంచి అవార్డు దక్కింది ?
జ: CII నేషనల్ HR ఎక్సెలెన్స్ అవార్డ్
03) ఈనెల 15 నుంచి ఎక్కడ నిర్మించిన జ్యుడీషియల్ కాంప్లెక్స్ లో ఏపీ హైకోర్టు విధులు ప్రారంభం అవుతాయి ?
జ: నేలపాడు

జాతీయం
04) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించే ఎంతమందికి ఇస్రో అవార్డులను ప్రదానం చేసింది ?
జ: 96 మందికి (బెంగళూరులోని అంతరిక్ష భవన్ లో )
05) అమెరికా మిలటరీ మొదటి బెటాలియన్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ (వైమానిక విభాగం), జాతీయ భద్రతా దళం ( NSG) సంయుక్తంగా చేపట్టిన విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని NSG కేంద్రంలో
06) ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించినప్పటికీ వీటిని రిలీజ్ చేసే అధికారం ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతికి
07) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది ?
జ: ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 14 ప్రకారం
08) సమాజ సేవ కోసం విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ తన వాటాల్లో 34శాతం కేటాయించారు. దీంతో ఎంత మొత్తాన్ని ఫౌండేషన్ కు కేటాయించనున్నారు ?
జ: రూ.52,700 కోట్లు
09) LIC - లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: MR కుమార్

అంతర్జాతీయం
10) వాయు కాలుష్యంపై పోరాటం చేసేందుకు 8 అత్యవసర బిల్లును ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది ?
జ: దక్షిణ కొరియా

ఏపీలో అన్ని పోటీ పరీక్షలకు పనికి వచ్చే మాక్ టెస్టులు

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/
 రోజువారీ ప్రణాళికకు ఈ లింక్ క్లిక్ చేయండి
AP GS COMMON EXAMS-converted (1)