Friday, February 28

CURRENT AFFAIRS -NOV 09

ఆంధ్రప్రదేశ్
01) ఆంధ్రప్రదేశ్ లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: విజయనగరం జిల్లా రెల్లిలో
02) విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కేంద్రీయ గిరిజన వర్సిటీకి ఆంధప్రదేశ్ విభజన చట్టంలోని ఎన్నో అంశం కింద చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: 13వ షెడ్యూల్ లోని 6 వ అంశం ( రూ.420 కోట్లు తొలి దశ కింద కేటాయిస్తున్నారు )
03)తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
జ: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ( కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు )
04) పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: ఆంధ్రప్రదేశ్
05) దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న 100 టన్నుల పండ్లల్లో ఎన్ని టన్నులు ఏపీ నుంచి వస్తున్నాయి ?
జ: 15 టన్నులు
(నోట్: ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి )
06) దేశంలో పండుతున్న పంటల్లో ఆంధప్రదేశ్ నుంచి ఏయే పండ్లకు అగ్రస్థానం లభించింది ?
జ: మామిడి, అరటి
07) రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కోసం ఏ సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఆంధ్రప్రదేశ్ మారిటైం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ (APMID)

జాతీయం
08) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద సుప్రీం కోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తారు ?
జ: ఆర్టికల్ 124
09) క్యాన్సర్ కణాల జాడ కనిపెట్టడానికి నానో కార్బన్ పదార్థాన్ని అభివృద్ధి చేసిన పరిశోధకులు ఏ సంస్థకు చెందినవారు ?
జ: IIT రూర్కీ
10) 2018 ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది ?
జ: షిల్లాంగ్
11) రోమ్ చలన చిత్రోత్సవం 2018 లోకి ఎంట్రీ అయిన భారతీయ సినిమా ఏది ?
జ: Mare Pyare Prime Minister
12) 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మేరీ కామ్

అంతర్జాతీయం
13) అమెరికా ప్రతినిధుల సభలో గెలిచిన భారతీయ అమెరికన్ ప్రముఖులు ఎవరు ?
జ: రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, రాజా కృష్ణ మూర్తి
14) 2018 నవంబర్ లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికా చట్ట సభల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల బలా బలాలు ఎలా ఉన్నాయి ?
జ: 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమోక్రాట్లకు 193 సీట్లు
100మంది సభ్యులున్న సెనేట్ లో 35 సీట్లకి ఎన్నికలు జరగ్గా 51 స్థానాలు రిపబ్లికన్లకు 51 స్థానాలు డెమోక్రాట్లకి 46 స్థానాలు వచ్చాయి.
15) అమెరికా అటార్నీ జనరల్ ను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఆయన పేరేంటి ?
జ: జెఫ్ సెషన్స్
16) జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో 13 బంగారు పతకాలు గెలుచుకున్న సిమోన్ బైల్స్ ఏ దేశానికి చెందిన అథ్లెట్ ?
జ: అమెరికా
(నోట్: ఖతార్ లోని దోహాలో ఈ పోటీలు జరిగాయి )
17) ప్రతియేటా 31 అక్టోబర్ నాడు నిర్వహించిన వరల్డ్ సిటీస్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Building Sustainable and Resilient Cities

GROUP.II (ప్రిలిమ్స్) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి ప్రారంభం (ఈలోగా ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం)
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/gr-2-prelims/

PC/SIకి 100 మాక్ టెస్టులు+10 గ్రాండ్ టెస్టులు
అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా టెస్టుల ప్రిపరేషన్
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/police-mock/