Friday, February 28

CURRENT AFFAIRS – NOV 7 & 8

ఆంధ్రప్రదేశ్
01) ఎన్నివేల కోట్లతో కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 15వేల కోట్లు
02) విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఎంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.8,300 కోట్లు
03) 2018 నవంబర్ 23 నుంచి 25 వరకూ అమరావతి ఎయిర్ షో ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: విజయవాడ పున్నమి ఘాట్
04) ఎక్కడైనా భూములను రిజిష్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ఎనీవేర్ రిజిష్ట్రేషన్ సౌకర్యాన్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడ కల్పించారు ?
జ: ఉండవల్లి, మందడం, తుళ్ళూరు, అనంతవరం

జాతీయం
05) అయోధ్యలో 3 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఏ నది ఒడ్డున వీటిని వెలిగించారు?
జ: సరయూ నది తీరంలో ( మొత్తం 3,01,152 దీపాలు వెలిగించారు )
06) ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాను ఏ విధంగా పేరు మార్చనున్నట్టు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు ?
జ: అయోధ్య
07) ఆయుర్వేదానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నేషనల్ సెమినార్ నవంబర్ 4 న ఎక్కడ జరిగింది ?
జ: న్యూ ఢిల్లీ
08) రుణగ్రస్థుల వివరాల సేకరణ కోసం PCR ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. PCR అంటే ఏంటి ?
జ: Public Credit Registry
09) ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత యువ షూటర్ ఎవరు ?
జ: అంగద్ వీర్ సింగ్ బజ్వా

అంతర్జాతీయం
10) శత్రువుల రాడార్లకి దొరక్కుండా కొత్త తరం మానవరహిత యుద్ధ విమానాన్ని చైనా తయారు చేసింది. డ్రోన్స్ లో ఇదే అధునాతనమైనది. దాని పేరేంటి ?
జ: CH 7
11) కాలుష్యం, అనారోగ్య పరిస్థితులపై WHO నిర్వహిస్తున్న గ్లోబల్ కాన్ఫరెన్స్ 2018 అక్టోబర్ 30న ఎక్కడ జరిగింది?
జ: జెనీవా
12) లిటిల్ ఇండియా గేట్ - అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఏ సిటీలో ప్రారంభించారు ?
జ: మెడాన్ (ఇండోనేషియా)
13) ప్రపంచ సునామీ దినోత్సవాన్ని ప్రతి యేటా ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: నవంబర్ 5

GROUP.II (ప్రిలిమ్స్) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి ప్రారంభం (ఈలోగా ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం)
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/gr-2-prelims/

PC/SIకి 100 మాక్ టెస్టులు+10 గ్రాండ్ టెస్టులు
అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా టెస్టుల ప్రిపరేషన్
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/police-mock/