Friday, February 28

CA 2018 MAR- TOP BITS-1

01) దేశంలో అత్యుత్తమమైన బయోనెస్ట్ అనే బయో - ఇంక్యుబేటర్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
02) 2018లో భారత్ జీడీపీ వృద్ధి ఎంతశాతం ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది ?
జ: 7.6 శాతం
03) 2018 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటి ?
జ: Science and Technology for a Sustaianable Future
04) విజయ్ హజారే ట్రోఫీ 2018 ని ఏ క్రికెట్ టీమ్ గెలుచుకుంది ?
జ: కర్ణాటక
05) క్రీడారంగంలో ఆస్కార్ లాంటి లారెస్ స్పోర్ట్స్ అవార్డులు రెండింటిని దక్కించుకున్న స్విస్ టెన్నిస్ దిగ్గజం ఎవరు ?
జ: రోజర్ ఫెదరర్
06) అరేబియా సముద్రంలో మూడు వారాలుగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి చెందిన త్రివిధ దళాల విన్యాసాలు ముగిశాయి. 2018 ఫిబ్రవరి 12న ఏ పేరుతో ఈ విన్యాసాలను ప్రారంభించారు ?
జ: పశ్చిమ్ లెహర్
07) మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆత్మ కథ పేరేంటి ?
జ: ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్
08) 2018 మార్చిలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ: నవజోత్ కౌర్
09) ఏ దేశానికి చెందిన ఎస్-400 ట్రయంఫ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది ?
జ: రష్యా (ఒప్పందం విలువ రూ.40వేల కోట్లు)
10) ఏ నగరంలో విమానాశ్రయానికి త్వరగా చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి ?
జ: బెంగళూరులో
11) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2018-19 దేశ జీడీపీ వృద్ధి రేటు ఎంతకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది ?
జ: 7.5 శాతం
12) 11) 90 వ ఆస్కార్ అవార్డులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగాయి.
ఉత్తమ నటుడు - గ్యారీ ఓల్డ్ మ్యాన్
ఉత్తమ నటి - ఫ్రాన్నిస్ మెక్ డొర్మండ్
ఉత్తమ చిత్రం, ఉత్త దర్శకుడితో మరో 2 అవార్డులు గెలుచుకున్న చిత్రం - షేప్ ఆఫ్ వాటర్
13) దక్షిణ మధ్య రైల్వే ఏరియాలో పూర్తిగా మహిళలే పనిచేసే రైల్వే స్టేషన్ గా ఏది నిలిచింది ?
జ: బేగంపేట్
14) అమెరికా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్ తాజాగా LNG కూడా దిగుమతి చేసుకుంటోంది. గెయిల్ కు చెందిన ఏ నౌక ద్వారా దిగుమతి అవుతోంది ?
జ: మెరీడియన్ స్పిరిట్
15) ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితా(2018)లో అగ్రస్థానం ఎవరికి దక్కింది ?
జ: అమెజాన్ వ్యవస్థాపకుడు, CEO జెఫ్ బెజోస్
(నోట్: బెజోస్ సంపద 112 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.7.28 లక్షల కోట్లు)
16) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారతకు 170 డాలర్లు ( రూ.11వేల కోట్లు ) పథకాన్ని ప్రకటించిన ప్రముఖ ఫౌండేషన్ ఏది ?
జ: బిల్ - మెలిండా గేట్స్ ఫౌండేషన్
17) మార్చి 8నాడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: ఝుంఝమా (రాజస్థాన్ )
18) ప్రతిష్టాత్మక ప్రిట్జ్ కర్ పురస్కారం గెలుచుకున్న ప్రముఖ భవన రూపశిల్పి (ఆర్కిటెక్ట్ ) ఎవరు ?
జ: బాలకృష్ణ దోశి
19) భారత్ లో ఫ్రాన్స్ సహకారంతో నిర్మిస్తున్న అణువిద్యుత్ కర్మాగారం ఏది ?
జ: జైతాపూర్
20) 2018లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సర్వీసెస్ బ్రాండ్ గా అవతరించిన భారతీయ కంపెనీ ఏది ?
జ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS)
21) పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 2022 నాటికి ఎన్ని గిగావాట్ల విద్యుత్ ను భారత్ ఉత్పత్తి చేయనుందని ప్రధాన నరేంద్ర మోడీ వెల్లడించారు ?
జ: 175 గిగావాట్లు
22) మలేసియాలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2018 ను ఏ దేశం గెలుచుకుంది ?
జ: ఆస్ట్రేలియా