Wednesday, October 23

CA 2018 MAR- TOP BITS -2

23) క్షయ రహిత భారత్ కార్యక్రమాన్ని ఎప్పటి లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 2025 కు
24) దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్ 3 సంస్థలుగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి ?
జ: ఇండియన్ ఆయిల్, ONGC, కోల్ ఇండియా
25) ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు ?
జ: అరవింద్ సుబ్రమణియన్
26)యూరియా ఎరువుపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని 2020 వరకూ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యక్ష నగదు బదిలీ కింద రైతులకు టన్ను యూరియాకి ఎంత చొప్పున కేంద్రం అందిస్తోంది ?
జ: రూ.5,360 లు
(నోట్: ఈ పథకానికి 2017-18లో కేంద్రం రూ.42,748 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాదికి ఇది రూ.45 వేల కోట్లకు పెరగనుంది )
27) భారత వృద్ధి రేటు 2018-19కి ఎంతగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ?
జ: 7.3శాతం
28) స్టీఫెన్ హాకింగ్ జీవితంపై తీసిన సినిమా ఏది ?
జ: ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్
29) ప్రపంచంలో సంతోషమైన జీవితం గడుపుతున్న ( హ్యాపినెస్ ఇండెక్స్ ) లో భారత్ కి ఎన్నో స్థానం దక్కింది ?
జ: 133వ స్థానం
(నోట్: గత ఏడాది 122 వ ర్యాంకు)
30) కేంద్ర సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే లోక్ సభ నియమావళిలోని ఏ నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వాలి ?
జ: 17వ అధ్యాయం 198(బి) నిబందన
31) అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి ?
జ: 50 మంది
32) వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: ఫిన్లాండ్
33) ఫ్రెంచ్ సోలార్ కంపెనీ సహకారంతో ఉత్తరప్రదేశ్ లో అతి పెద్ద సోలార్ ప్లాంట్ ను ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు ?
జ: మిర్జాపూర్
34) ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ ( IACP-2018) సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: న్యూ ఢిల్లీ ( మార్చి 14)
35) ప్రతిష్టాత్మక హెచ్ జె బాబా స్మారక అవార్డు ఎవరికి దక్కింది ?
జ: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్ చంద్ జైన్
36) ఇండో ఫ్రెంచ్ సంయుక్త నావిక విన్యాసాలు వరుణ 2018 ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి
జ: గోవా
37) శ్రీలంక కొలొంబోలో ప్రేమదాస స్టేడియంలో నిదహాస్ క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న దేశం ఏది ?
జ: ఇండియా
38) 2019లో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరగనుంది ?
జ: మధ్యప్రదేశ్
39) విదేశాంగ విధానం, దృక్పథం, ప్రాధాన్యాలను వివరించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: విదేశీ ఆయా ప్రదేశ్ కే ద్వార్
40) పరమ వీర చక్ర అవార్డులు అందుకున్న వారి వివరాలతో కూడిన ఏ పుస్తకాన్ని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది ?
జ: పరమ్ వీర్ పర్వానే
(నోట్: ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. డాక్టర్ ప్రభాకిరణ్ జైన్ దీన్ని రచించారు )
41) మెర్సర్ క్వాలిటీ లివింగ్ సర్వే 2018 లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ?
జ: వియన్నా