ఇలా చేయకపోతే మీ డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ !!

మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 లోపు మార్చుకోవాలి. లేకపోతే వాటిని బ్లాక్ చేస్తాం. SBI తో పాటు అనేక బ్యాంకులు తమ కస్టమర్లకి ఇదే మెస్సేజ్ పంపాయి... ఎందుకు ... ఏ కార్డులు మార్చుకోవాలి... ఓసారి చూద్దాం.

మీరు ఇంకా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పాతది లేదా మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులు కలిగి ఉంటే... వెంటనే వాటిని మార్చేసుకోండి. EMV చిప్ కలిగిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకపోతే ఇక దాన్ని ఉపయోగించే ఛాన్సే ఉండదు. మీకు డిసెంబర్ 31 దాకా డెడ్ లైన్ ఉంది. అప్పట్లోపు కార్డులు మార్చుకోకపోతే దాన్ని బ్యాంకులు బ్లాక్ చేస్తాయి.

SBI తో పాటు మెజార్టీ బ్యాంక్సులు ఇప్పటికే తమ కస్టమర్లకి మెస్సేజ్ లు పంపుతున్నాయి. RBI నిబంధనల ప్రకారం ప్రస్తుతం మీ దగ్గర ఉన్న మెజిస్ట్రిప్ డెబిట్ కార్డులను EMV చిప్ కలిగిన కార్డులుగా మార్చుకోవాలని SBI మెస్సేజ్ లు పంపుతోంది. మెజిస్ట్రిప్ డెబిట్ కార్డులును డిసెంబర్ 31 తర్వాత శాశ్వతంగా బ్లాక్ చేస్తామని తెలిపింది. వెంటనే EMV చిప్ కార్డుల కోసం అప్లయ్ చేసుకోవాలనీ... SBI ఖాతాదారులు తమ హోం బ్రాంచ్ ల ద్వారా అప్లయ్ చేసుకోవాలని ఉచితంగానే ఈ డెబిడ్ కార్డులు అందిస్తామంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

డెబిట్ కార్డుకి ముందు వైపు EMV చిప్ ఉంటుంది. EMV చిప్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డెబిట్ కార్డులకు ఉపయోగిస్తున్నారు. ఇందులో పెట్టే మైక్రో ప్రాసెసర్ చిప్ లో కార్డుదారుల డేటాని భద్ర పరుస్తారు. మెజిస్ట్రిప్ కార్డుల కన్నా EMV చిప్ కార్డులు ఎంతో సురక్షితమైనవి.

కార్డు రిలేటెడ్ మోసాలను అరికట్టడం, కార్డుదారుల పేమెంట్ డేటాని సురక్షితంగా ఉంచడం దీని ఉద్దేశ్యమని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న ఈ మెగ్నటిక్ స్ట్రిప్ కార్డు నుంచి సమాచారాన్ని చాలా ఈజీగా దొంగిలించే అవకాశముంది. లేదా హాకర్స్ స్కిమ్మింగ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ దొంగిలించి డబ్బులు మాయం చేస్తారు. అలాంటి సమస్యలు EMV చిప్ కార్డులతో ఉండవని చెబుతున్నారు. 2015లో RBI ఇచ్చిన సూచనలతో చాలా బ్యాంకులు EMV చిప్ కార్డులను జారీ చేశాయి. ఇంకా ఈ పాత డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను మార్చుకోని వారు ఇప్పటికైనా ఛేంజ్ చేసుకోవాలి. లేదంటే డిసెంబర్ 31 తర్వాత మీ కార్డులు వాడే అవకాశం ఉండదు.