Wednesday, October 23

Education Info

IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

Education Info, Latest News
ఫ్రెండ్స్ IBPS 2019 క్లర్క్స్ ఎగ్జామ్ తెలుగులో నిర్వహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ లో మాత్రం ఇంగ్లీష్ లేదా తెలుగులో మాత్రమే ఎగ్జామ్ అని ఉంది. మేం www.telanganaexams.com & www.andhraexams.com తరపున మేడమ్ కు ట్వీట్స్ ద్వారా రిప్రజెంట్ చేశాం. ఫ్రెండ్స్ మీరు కూడా నిర్మలా సీతారామన్ గారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయండి... ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా తెలుగులో జరుగుతుంది. 16.09.19న జరిగే ఆఫీసర్స్ స్కేల్ 1 పోస్టు మెయిన్ ఎగ్జామ్ కూడా తెలుగుతో సహా ఇతర ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశం ఇచ్చారు. మనకీ ఛాన్స్ వస్తుంది. దయచేసి ఈ ట్విట్టర్ ఉద్యమంలో మీరూ పాల్గొనండి. ఎక్కువమంది నిరుద్యోగులకు ఈసారి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే అవకాశం దక్కుతుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఈ రోజే మీ ట్వీట్ ను ట్విట్టర్ ద్వారా సీతారామన్ గారికి రిప్రజెంట్
6th నుంచే సివిల్స్ ఫౌండేషన్ !

6th నుంచే సివిల్స్ ఫౌండేషన్ !

Education Info, Latest News
మిత్రులారా ! తెలంగాణ ఎగ్జామ్స్ / ఆంధ్ర ఎగ్జామ్స్ వెబ్ సైట్ ద్వారా గత కొన్నేళ్ళుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎందరో మార్గదర్శకంగా నిలిచాం. మరెందరికో ఉద్యోగాలు రావడానికి సాయం చేశాం. ఇప్పుడు 6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ English Medium విద్యార్థులకు సివిల్స్ సర్వీసెస్ లో ఫౌండేషన్ కల్పించేందుకు కొత్తగా MASTERS ACADEMY FOR CIVILS FOUNDATION (MACF) ను ఏర్పాటు చేశాం. సివిల్స్ లేదా గ్రూప్స్ విద్యార్థులెవరికైనా 6th to 10th standardలో ఫౌండేషన్ ఉంటే.. భవిష్యత్తులో ఏ ఉద్యోగాన్ని అయినా ఈజీగా సాధించవచ్చు. అందుకే మేం ఆన్ లైన్ ద్వారా మెటీరియల్, క్లాసులు అందిస్తున్నాం. ఇందులో 5 లెవల్స్ ఏర్పాటు చేశాం. ఈ కోర్సును స్కూల్స్ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం నిర్వహించవచ్చు. లేదా ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. పూర్తి వివరాలకు ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి లేదా మీ వివరాలను వాట్సాప్ ద్వా
ఏపీ సెట్స్ తేదీలు విడుదల

ఏపీ సెట్స్ తేదీలు విడుదల

Education Info, Latest News
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్ లను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతంలో పరీక్షల నిర్వహణ ఆలస్యం కావడం వల్ల మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని చెప్పారు. అందుకే ఈసారి ముందుగానే షెడ్యూల్ ప్రకటించామన్నారు. మొత్తం ఏడు సెట్ లను కూడా ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. ఏపీ సెట్స్ షెడ్యూల్ వివరాలు: ఏపీ ఈ సెట్ ఏప్రిల్ 19(అనంతపురం జేఎన్టీయూ) ఏపీ ఐ సెట్ ఏప్రిల్ 26(ఎస్వీయూ) ఏపీ పీజీ సెట్ మే 1 నుంచి(ఏయూ) ఏపీ ఎడ్ సెట్ మే 6 (ఎస్వీయూ) ఏపీ లా సెట్ మే 6(ఎస్కేయూ) ఏపీ పీఈ సెట్ మే 5 నుంచి(నాగార్జున) ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 20 నుంచి(కాకినాడ జేఎన్టీయూ)
మీ ఇంజనీరింగ్ కాలేజీకి NBA స్టాంప్ ఉందా ? అది లేకపోతే మీకు విదేశీ ఉద్యోగం రానట్టే !

మీ ఇంజనీరింగ్ కాలేజీకి NBA స్టాంప్ ఉందా ? అది లేకపోతే మీకు విదేశీ ఉద్యోగం రానట్టే !

Education Info, Latest News
ఇంజనీరింగ్ కాలేజీలు తప్పనిసరిగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) కలిగి ఉండాలట.  లేకపోతే భారతీయ ఇంజనీర్లకి ఇక దేశాల్లో ఉద్యోగాలు వచ్చే ఛాన్సే లేదంటున్నారు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అధికారులు.  NBA లేని ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ ను ఇకపై విదేశాల్లో అనుమతించడం లేదు. వాళ్ళ డిగ్రీలు చెల్లవు. అంతేకాదు వాళ్ళకి వర్క్ పర్మిట్ కూడా దొరకదు. దేశంలోనే 10 నుంచి 15శాతం టెక్నికల్ విద్యా సంస్థలు మాత్రమే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగి ఉన్నట్టు AICTE ఛైర్మన్ అనిల్ ది సహస్రబుద్దే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కూడా NBA కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది.  ఈ NBA లేని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండవని AICTE ఛైర్మన్ తెలిపారు.  ఇప్పటికే కువైట్ ప్రభుత్వం తమ దగ్గర పనిచేసే  ఇంజనీరింగ్ ప
మే19న JEE అడ్వాన్సుడ్ పరీక్ష

మే19న JEE అడ్వాన్సుడ్ పరీక్ష

Education Info, Latest News
ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే JEE అడ్వాన్సుడ్ 2019 పరీక్ష 2019 మే 19 (ఆదివారం) జరుగుతుంది. ఈసారి ఈ ఎగ్జామ్ ను IIT, రూర్కీ నిర్వహించబోతోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఆన్ లైన్ ) ను అమలు చేయబోతున్నారు. ఎగ్జామ్ టైమ్: 2019 మే 19 (ఆదివారం) ఉదయం 9-12 గంటల వరకూ పేపర్ - 1 మధ్యాహ్నం 2-5 గంటల వరకూ పేపర్ - 2 JEE మెయిన్ నుంచి కటాఫ్ మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రకారం 2.20 లక్షల మందికి మాత్రమే అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 2019-20 విద్యా సంవత్సరానికి దేశంలోని 23 IITల్లో బీటెక్ లోకి ప్రవేశం కల్పిస్తారు.
టెట్ పేపర్ – 1కి బీఈడీ అర్హత

టెట్ పేపర్ – 1కి బీఈడీ అర్హత

Education Info, Latest News
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) పేపర్ 1 రాసేందుకు ఇకపై బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులే. ఒకటి నుంచి ఐదో తరగతి చెప్పేందుకు వీరికి అర్హత ఉంటుంది. బీఎడ్ అభ్యర్థులు కూడా SGT పోస్టులకు అర్హులేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేయడంతో ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా దీనికి సంబంధించిన మార్పులు చేసింది. దీనిపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టెట్ పేపర్ -1 రాయాలంటే 50శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు సరిపోతుంది. ఇంటర్ తో పాటు 2యేళ్ళ డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4యేళ్ళ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ( స్పెషల్ ఎడ్యుకేషన్ ) పూర్తి చేసి ఉండాలి. వీళ్ళతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. 2010 ఆగస్టు 23 నాటికి NCTE నోటిఫికేషన్ కు ముందుగా DL