Saturday, December 5

General Knowledge

కరోనా కోసం వరల్డ్ బ్యాంక్ ఫండ్

General Knowledge, Latest News
ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొవిడ్ 19 (కరోనా) ను సమర్థంగా ఎదుర్కునేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. కరోనాతో ఇబ్బంది పడుతున్న దేశాలకు స్పీడప్ గా నిధులు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తెలిపారు. ఇప్పటికే సాయం కోరిన దేశాలకు 8 బిలియన్ డాలర్లు అందించనున్నారు. పేద దేశాలకు ఈ ముప్పును ఎదుర్కోవడం ఇబ్బందిగా మారిందని మల్పాస్ చెబుతున్నారు. ఈ నిధుల ద్వారా అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణులు, విధి విధానాలను రూపొందించుకోడానికి ఉపయోగించుకోవాలి. గతంలో ఎబోలా, జికా వైరస్ వ్యాపించినప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ ఇలాగే ఫండ్ కేటాయించింది. ప్రపంచంలో 3 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. మరో 85 వేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ

General Knowledge
- రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. - 2018 అక్టోబర్ 5 నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. - ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.36.9 వేల కోట్లు ) - S-400 క్షిపణులను భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగిస్తారు - ఈ వ్యవస్థతో ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించవచ్చు - రష్యాకి చెందిన అల్మాజ్ యాంట్ సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. - ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులు ఉంటాయి. - ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఒకే టైమ్ లో గుర్తించగలదు. దాదాపు 600 కిమీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడని కనిపెడుతుంది. 400కిమీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. - రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెర

కేంద్ర ప్రభుత్వ పథకాలు (Part-2) – QUICK REVISION

General Knowledge, Latest News
( 2nd part ) 11) ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన - 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైంది. - దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ( పేద కుటుంబాలు ) మహిళల పేరుతో ఉచితంగా LPG (వంట గ్యాస్‌) కనెక్షన్లు ఇస్తారు. - మొదటి మూడేళ్ళలో 5 కోట్ల కనెక్షన్లు ఇస్తారు. 12) హృదయ్‌ - HRIDAY (Heritage City Development and Augmentation Yojana - వారసత్వ నగరాల సంరక్షణ కోసం 2015 జనవరి 21న ఈ పథకం ప్రారంభమైంది. - మొదటి దశలో 12 నగరాలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ నుంచి వరంగల్, ఏపీ నుంచి అమరావతి ఉన్నాయి. ఇవి కాకుండా... వారణాసి (ఉత్తరప్రదేశ్‌), పూరి (ఒడిశా), అమృత్‌సర్‌ (పంజాబ్‌), అజ్మీర్‌ (రాజస్థాన్‌), గయ (బీహార్‌), మధుర (ఉత్తరప్రదేశ్‌), కాంచీపురం (తమిళనాడు), వేలంగిణి (తమిళనాడు), బాదామీ (కర్ణాటక) తోపాటు ద్వారక (గుజరాత్‌). 13) ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన - వ్యవసాయరంగం, గ్రామాలకు న

కేంద్ర ప్రభుత్వ పథకాలు (1) – QUICK REVISION

General Knowledge, Latest News
1) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) - ఒక దేశం - ఒక పథకం అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. - పథకానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అశిష్ కుమార్ భుటానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మే 2020 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు - 2016 జనవరి 13 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ స్కీమ్ కింద ప్రకృతి విపత్తులు, చీడ పీడలతో రైతులు పంట నష్టపోయినప్పుడు త్వరగా బీమా సౌకర్యం, ఇతర సాయం అందించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. - గతంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, పునర్వవస్థీకరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం పథకాలను తొలగించి... ఒకే పథకంగా PMFBY తెచ్చారు - ఈ స్కీమ్ కోసం రైతులు ఖరీఫ్ కి అయితే 2శాతం, రబీకి అయితే 1.5శాతం ప్రీమియం చెల్లించాలి. ఉద్యాన, వాణిజ్య పంటలకైతే 5శాతం ప్రీమియం చెల్లించాలి. 2) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - 2015 జూన్‌ 25న ప్రధాని ఆవాస్‌ యోజనను ప్రారంభించారు. - ఈ పథకం కింద పేదలకు రెండు కోట్ల ఇళ్లు నిర్మ

ఆయుష్మాన్ భారత్

General Knowledge
- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జయ్ - ఆయుష్మాన్ భారత్ ) పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు - లబ్ది పొందే కుటుంబాలు - గ్రామీణంలో - 8.03 కోట్లు, పట్టణాల్లో : 2.33 కోట్లు - దేశంలో 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి బీమా రక్షణ కల్పిస్తారు - 1300కు పైగా రోగాలకు ఈ పథకం కింద రక్షణ కల్పిస్తారు - ఇంతవరకూ గ్రామాల్లో : 85.9 శాతం, పట్టణాల్లో 82 శాతం మందికి ఆరోగ్య బీమా లేదు - కొత్త పథకంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.3500 కోట్లు ఖర్చవుతాయని నీతి ఆయోగ్ అంచనా - పథకం కోసం హెల్ప్ లైన్ నెంబర్ : 14555