Friday, January 17

Jobs Info

108 అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టులు

108 అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టులు

Jobs Info, Latest News
రాష్ట్రంలోని ICDS లో ఖాళీగా ఉన్న 108 అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వీటిని APPSC ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. మొత్తం 208 పోస్టుల్లో వంద ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మిగిలిన 108 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు.
10న డిఎస్సీ నోటిఫికేషన్, 9270 పోస్టులు

10న డిఎస్సీ నోటిఫికేషన్, 9270 పోస్టులు

Jobs Info, Latest News
ఈనెల 10న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 9,270 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలవుతోంది. నవంబర్ 30 నుంచి డిఎస్సీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు విడుదల చేస్తారు. PET పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. SGT పోస్టులకు BEd అభ్యర్థులు కూడా అర్హులేనని NCTE ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో జులైలో రిలీజ్ అవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. ఈసారి టెట్, TRT కలిపి నిర్వహిస్తున్నారు. డీఎస్సీ ద్వారా నియామకం చేపట్టే ఖాళీల వివరాలు : జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో ఖాళీలు = 5,000 మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీలు = 1,100 గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులు = 1,100 సాంఘీక సంక్షేమ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఖాళీలు = 750 షెడ్యూల్ ఏరియాలోని
పోలీస్ ఉద్యోగాలకు నెలాఖర్లో ప్రకటన !

పోలీస్ ఉద్యోగాలకు నెలాఖర్లో ప్రకటన !

Jobs Info, Latest News
ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్, అగ్నిమాపక శాఖల్లో పోస్టుల భర్తీకి ఈనెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. 2,500 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో ఏయే యూనిట్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాలు సేకరిస్తోంది రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి. అలాగే మినిస్టీరియల్ విభాగంలో మరో 184 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించాల్సి ఉంది. దీనిపై ఏపీ పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రతిపాదనలు కూడా పంపింది. వీటన్నింటినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది APSLPRB. మొత్తం ప్రక్రియని 5 నెలల్లో పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లికేషన్లను స్వీకరించనున్నారు. మరోవైపు - ఎంపిక ప్రక్రియలో 2016 జులైలో అనుసరించిన విధానమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. 5 కిలోమీటర్ల పరుగు పందెం ఉండదు. రాత పరీక్షల తర్వాత 3 విభాగాల్లో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తార
అక్టోబర్ నెలాఖరు నుంచి నోటిఫికేషన్లు

అక్టోబర్ నెలాఖరు నుంచి నోటిఫికేషన్లు

Jobs Info, Latest News
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు అక్టోబర్ చివరి వారం నుంచి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని APPSC ఛైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ భాస్కర్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 18,450 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆర్థిక శాఖ జీవో నెం. 153 కూడా జారీ చేసింది. దాంతో అన్ని ప్రభుత్వ శాఖల నుంచి APPSC కి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. రోస్టర్ నిబంధనలు లాంటి సమాచారం అక్టోబర్ నెలాఖరు కల్లా వస్తుందని APPSC భావిస్తోంది. ఆ సమాచారం రాగానే అక్టోబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ ఆఖరు వరకూ దాదాపు 40 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి APPSC సిద్ధమవుతోంది. వీటికి ఎంట్రన్స్ టెస్టులన్నీ వచ్చే ఏడాది నుంచి మొదలవుతాయని APPSC వర్గాలు చెబుతున్నాయి.
టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ

టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ

Jobs Info, Latest News
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీని డీఎస్సీ ద్వారానే చేపట్టనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. టెట్, డీఎస్సీ నిర్వహణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మున్సిపాలిటీలు, ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ స్కూళ్ళల్లో మొత్తం 6,100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈడీ అభ్యర్థులు కూడా SGT పోస్టులకు అర్హులు కావడంతో... టెట్, డీఎస్సీ కలిపి నిర్వహించే ఆలోచనలో ఉన్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు.
ఫ్లెక్స్ ట్రానిక్స్ లో 1100 జాబ్స్

ఫ్లెక్స్ ట్రానిక్స్ లో 1100 జాబ్స్

Jobs Info, Latest News
నెల్లూరు జిల్లా తడ దగ్గర్లోని శ్రీసిటీలో ఏర్పాటవుతున్న ఫ్లెక్స్ ట్రానిక్స్ లో 11 వందల ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు 8వ తరగతి ఉత్తీర్ణులై 18-23 యేళ్ళ వయస్సున్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 1 లోగా తమ దరఖాస్తులను పంపుకోవాలి. విద్యార్హత పత్రాలతో శ్రీ సిటీ ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న NTR ట్రస్ట్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో అధికారులను సంప్రదించవచ్చు. అర్హులైన వారిని మొబైల్ లైన్ అసెంబ్లీ ఆపరేటర్లుగా నియమిస్తారు. రాబోయే 2 నెలల్లో మూడు వేల మందికి ఫ్లెక్స్ ట్రానిక్స్ ఉద్యోగాలను కల్పించనుంది. ఇతర వివరాలకు సతీష్ - 9849696824 ను సంప్రదివచ్చు.
1171 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

1171 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

Jobs Info, Latest News
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1171 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 1076 పోస్టులు, వైద్య విద్య డైరక్టరేట్ పరిధిలో 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. MBBS లో సాధించిన మార్కులకు 75శాతం వెయిటేజ్ ఇస్తారు. అర్హత: MBBS పాస్, ఇంటర్న్ షిప్ తప్పనిసరి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో శాశ్వత రిజిష్ట్రేషన్ ఉండాలి వయసు: 1 జులై 2018 నాటికి 42యేళ్ళకి మించరాదు. SC/ST/PHC/Ex-Servicemen అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తులను http://cfw.ap.nic.in/ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి పోస్టులో పంపాలి. పూర్తి వివరాలకు: http://cfw.ap.nic.in/
6100 పోస్టులతో డీఎస్సీ

6100 పోస్టులతో డీఎస్సీ

Jobs Info, Latest News
రాష్ట్రంలోని పురపాలిక, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అతి త్వరలోనే నోటిఫికేషన్ పడబోతోంది. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే APPSC అధికారులతో చర్చించారు. మున్సిపల్ స్కూల్స్ లో 1100 పోస్టులతో పాటు ZP, MPP తో పాటు సర్కారీ స్కూళ్ళల్లోని 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాల నుంచి విద్యాశాఖ కమిషనరేట్ కి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఉపాధ్యాయ పోస్టులను APPSC భర్తీ చేయడానికి 115 రోజుల సమయం పట్టనుంది.
వయో పరిమితి పెంచండి

వయో పరిమితి పెంచండి

Jobs Info, Latest News
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కిందటేడాది ఇచ్చిన వయో పరిమితి పెంపు గడువు అయిపోతుండటంతో మళ్ళీ గడువు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోడానికి వయో పరిమితిని 34 నుంచి 42యేళ్ళకు పెంచుతూ 2017 డిసెంబర్ 4 న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ టైమ్ ఈ నెలాఖరుతో ముగుస్తోంది. సకాలంలో నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. పైగా 18,450 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో వయో పరిమితి పెంచకపోతే చాలా నష్టపోతామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.