Thursday, November 14

Latest Trends

ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

Latest News, Latest Trends, Videos
థర్డ్ పార్టీ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో చాలా యాప్స్ అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతాల్లోని నగదును ఒక ఖాతా నుంచి మరో చోటికి బదిలీ చేయడం జనానికి ఈజీ అయింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా సొంతంగా యాప్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొన్ని యాప్స్ క్యాష్ బ్యాక్స్, రివార్డు పాయింట్లు ఇస్తామని ప్రకటిస్తుండటంతో చాలామంది ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పైగా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని తమ మిత్రులు, బంధువులకు ఇన్విటేషన్స్ కూడా పంపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోడానికి కొన్ని యాప్స్ అయితే మీ అకౌంట్ లో ఫలానా వ్యక్తి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు... ఈ లింక్ తో యాప్ డౌన్లోడ్ చేసుకొని... వెయ్యి రూపాయల గిఫ్ట్ పొందండి అంటూ ఊరిస్తున్నాయి. జాగ్రత్త... ఇలాంటి యాప్స్ తోనే మోసగాళ్ళు మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను దోచేస్తారు. థర్డ్ పార్టీ యాప్
కేంద్ర బడ్జెట్ 2019-20 (With Pics)

కేంద్ర బడ్జెట్ 2019-20 (With Pics)

Latest News, Latest Trends
 ః       ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ కింద 5 ఏకరాల లోపు రైతులకు ఏటా రూ.6,000 చెల్లింపు. రూ2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. మొత్తం 12 కోట్ల మంది చిన్న రైతులకు లబ్ది చేకూరుతుంది. బడ్జెట్ లో మొత్తం రూ.75,000 కోట్లను కేటాయింపు. ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్ళు..PF తో పాటు ఇతర పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.2లక్షల వరకు హోం లోన్స్,  ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకానికి చెల్లించే వారికి మినహాయింపు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు పోస్టాఫీస్‌ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్‌ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంపు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిని రూ.62,574 కోట్ల నుంచి రూ.76,800 క
అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

Latest News, Latest Trends
అగ్రవర్ణాలు (ఓసీలు) ల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60శాతానికి చేరే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం కోసమే శీతాకాల సమావేశాలను మరో 2 రోజుల పాటు పొడిగ
RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

Latest News, Latest Trends
అసిస్టెంట్ లోకో పైలట్/టెక్నీషియన్ పోస్టుల కోసం RRB నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి హాజరైన వారికి ఫీజు తిరిగి చెల్లిస్తున్నారు. మీకు ఫీజు రిఫండ్ కావాలంటే ఏం చేయాలి ఓసారి ఈ ఆర్టికల్ చదవండి. RRB ALP/ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ 2018 కు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థుల ఫీజులను RRB రిఫండ్ చేస్తోంది. ఇందులో రిజర్వుడ్ అభ్యర్థులకు మొత్తం ఫీజును రిటర్న్ చేస్తోంది. అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన ఫీజును 50శాతం మినహాయించుకొని మిగతావి చెల్లిస్తోంది. అయితే మొదటి దశకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి హాజరైన వారికి మాత్రమే ఈ ఫీజును తిరిగి చెల్లిస్తారు. CBT ఎగ్జామ్ కి హాజరు కానివారికి ఎలాంటి ఫీజ్ రిఫండ్ ఉండదు. ఇప్పటిదాకా ఫీజు రిఫండ్ కాని వారికి SMS ద్వారా ఈనెల 17న అభ్యర్థులకు సమాచారం ఇవ్వనుంది. అభ్యర్థులు RRB నోటిఫికేషన్ ప్రకారం అప్లయ్ చేసినప్పుడు చాలామంది త
ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

Latest News, Latest Trends
ప్రధాని నరేంద్రమోడీ నాలుగున్నరేళ్ళ కాలంలో విదేశీ టూర్లకి, ప్రభుత్వ పథకాల ప్రచారానికి పెట్టిన ఖర్చులు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ఈ రెండు కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 920 మిలియన్ డాలర్లు... అంటే దాదాపు 7వేల కోట్ల రూపాయలు... ఇంకా వివరంగా చెప్పాలంటే రూ. 6,620,32,00,000.00 ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి 2018వరకూ మొత్తం 84 విదేశీ ట్రిప్పులకు వెళ్ళారు. అందుకోసం భారత ప్రభుత్వం రూ.2వేల15 కోట్లు ఖర్చుపెట్టింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలను దేశమంతా ప్రచారం చేయడానికి రూ.4వేల604 కోట్లు ఖర్చయ్యాయి. ఇక ప్రతి విదేశీ ప్రయాణానికి ఎయిర్ ఇండియా వన్ విమానం, అందులో సెక్యూర్ హాట్ లైన్ సెటప్ చేసేవారు. ఇవి ప్రతిపక్షాలు ఆరోపించినవి కావు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వీకే సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పిన సమాధానాలు ఇవి.
ఇలా చేయకపోతే  మీ డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ !!

ఇలా చేయకపోతే మీ డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ !!

Latest News, Latest Trends
మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 లోపు మార్చుకోవాలి. లేకపోతే వాటిని బ్లాక్ చేస్తాం. SBI తో పాటు అనేక బ్యాంకులు తమ కస్టమర్లకి ఇదే మెస్సేజ్ పంపాయి... ఎందుకు ... ఏ కార్డులు మార్చుకోవాలి... ఓసారి చూద్దాం. మీరు ఇంకా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పాతది లేదా మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులు కలిగి ఉంటే... వెంటనే వాటిని మార్చేసుకోండి. EMV చిప్ కలిగిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకపోతే ఇక దాన్ని ఉపయోగించే ఛాన్సే ఉండదు. మీకు డిసెంబర్ 31 దాకా డెడ్ లైన్ ఉంది. అప్పట్లోపు కార్డులు మార్చుకోకపోతే దాన్ని బ్యాంకులు బ్లాక్ చేస్తాయి. SBI తో పాటు మెజార్టీ బ్యాంక్సులు ఇప్పటికే తమ కస్టమర్లకి మెస్సేజ్ లు పంపుతున్నాయి. RBI నిబంధనల ప్రకారం ప్రస్తుతం మీ దగ్గర ఉన్న మెజిస్ట్రిప్ డెబిట్ కార్డులను EMV చిప్ కలిగిన కార్డులుగా మార్చుకోవాలని SBI మెస్సేజ్ లు పంపుతోంది. మెజిస్ట్రిప్ డెబిట్ కార్డులును డిసెంబర్ 31 తర్
వాళ్ళకి అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ !!

వాళ్ళకి అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ !!

Latest News, Latest Trends
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈమధ్యే డైలీ విత్ డ్రా లిమిట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. SBI క్లాసిక్, Maestro డెబిట్ కార్డు కలిగిన వినియోగదారులు గతంలో రోజుకి రూ.40వేలు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంటే... ఇప్పుడు రూ.20వేలకు కుదించింది. అయితే కొందరు కస్టమర్లకి ATMల్లో అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ కల్పించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు... గత నెలలో యావరేజ్ బ్యాలెన్స్ రూ.25వేలు మెయింటైన్ చేసినవారికి ఈ సదవకాశం కల్పించింది. ఇప్పటిదాకా SBI లో ఉన్న సౌకర్యాలు మామూలుగా SBI సేవింగ్స్ ఖాతాదారులు నెలలో ఎనిమిది సార్లు ATM నుంచి విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. ఇందులో 5సార్లు SBI ఏటీఎంల్లో, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో విత్ డ్రా చేసుకోవచ్చు. మెట్రో సిటీస్ లో 8 సార్లు ఛాన్స్ ఉంటే... నాన్ మెట్రో సిటీల్లో 5 + 5 చొప్పున 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుమించి విత్ డ్రా చేసుకుంట
SBI, HDFC డెబిట్ కార్డులపై ఛార్జీల మోత

SBI, HDFC డెబిట్ కార్డులపై ఛార్జీల మోత

Latest Trends
మీరు SBI లేదా HDFC డెబిట్ కార్డుల వాడుతున్నారా... అయితే మీకు ఛార్జీల మోత తప్పదు. ATM విత్ డ్రా నుంచి పిన్ జనరేషన్ దాకా ఈ రెండు బ్యాంకులు ఛార్జీలు పెంచేశాయి. నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. అయితే మన దేశంలో సామాన్యులు మాత్రం ఇంకా డెబిట్ కార్డుతో ATM ల్లో డబ్బులు విత్ డ్రా చేసి వాడుతున్నారు. 2018 సెప్టెంబర్ తో గడచిన అర్థ సంవత్సరంలో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి 798.65 మిలియన్ల లావాదేవీలు జరగ్గా... మొత్తం రూ.2,690.60 బిలియన్లు విత్ డ్రా చేసుకున్నారు. అంటే డెబిట్ కార్డులు మనం ఎంతగా ఉపయోగిస్తున్నామన్నది ఈ లెక్కలు చెబుతున్నాయి. మన జీవితాలతో ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది. అయితే ఈ  రెండు బ్ట్యాంకుల డెబిట్  కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తే మీ జేబులకు చిల్లులు పెడే ప్రమాదముంది. దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ త
ప్రాణం తీసిన సరదా (వీడియో)

ప్రాణం తీసిన సరదా (వీడియో)

Latest Trends
పాముతో ఓ వ్యక్తి సరదా అతని ప్రాణం తీసింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన విషాదం ఇది. మంగళంపాడు గ్రామానికి చెందిన చిట్టేటి జగదీష్.. వీధుల్లో పాముల ఆటలు ఆడిస్తున్న వ్యక్తి దగ్గర పామును చూసి సరదా పడ్డాడు. విషం లేదనుకొని... ఆ పాముని మెడలో వేయించుకున్నాడు. స్నేహితులతో వీడియో తీయించుకున్నాడు. అయితే ప్రమాదవశాత్తు పాము జగదీష్ మెడ మీద కాటు వేసింది ..పరిస్థితి కాస్త విష మించడంతో హటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యంలోని జగదీష్ (25) ప్రాణాలు కోల్పోయాడు https://www.youtube.com/watch?v=nb8sEPkZXmg&t=4s
మీ సంస్థకి ఉద్యోగి కావాలా ?

మీ సంస్థకి ఉద్యోగి కావాలా ?

Latest News, Latest Trends
సరైన ఉద్యోగి కోసం వెతుకుతున్నారా ? అయితే మాతో జతకట్టండి !! మా www.telanganaexams.com యాప్ ను ఇప్పటి దాకా లక్ష మందికి పైగా download చేసుకున్నారు. ప్రతి రోజూ మా 3 వెబ్ సైట్స్ ని  20 వేలమందికి పైగా సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళంతా Youngesters... ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులే. వీళ్ళల్లో మీకు talented persons చాలా మంది ఉంటారు. మీకు అవసరమయ్యే ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు www.telanganaexams.com www.tsexams.com www.andhraexams.com వెబ్ సైట్స్ ద్వారా మీ ప్రకటనలను ఉచితంగా మేం ప్రచురిస్తాం. మా youngstersతో మిమ్మల్ని కలిపేందుకు సాయం చేస్తాం. 10 వ తరగతి లేదా అంతకంటే తక్కువ అర్హత నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్.... ఇలా ఏ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి అయినా మీకు కావాల్సిన అభ్యర్థిని వెతికి ఇస్తాం. అందుకోసం మీ సంస్థ/కంపెనీలో అవసరమైన ఉద