కేంద్ర బడ్జెట్ 2019-20 (With Pics)
ః
- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ కింద 5 ఏకరాల లోపు రైతులకు ఏటా రూ.6,000 చెల్లింపు. రూ2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. మొత్తం 12 కోట్ల మంది చిన్న రైతులకు లబ్ది చేకూరుతుంది. బడ్జెట్ లో మొత్తం రూ.75,000 కోట్లను కేటాయింపు.
- ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్ళు..PF తో పాటు ఇతర పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.2లక్షల వరకు హోం లోన్స్, ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకానికి చెల్లించే వారికి మినహాయింపు.
- ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు
- పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంపు.
- ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిని రూ.62,574 కోట్ల నుంచి రూ.76,800 కోట్లకు పెంపు 35శాతానికి పైగా కేటాయింపులు పెంపు.
- రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు రూ.750 కోట్లు. దీంతో పాటు పాడి, మత్స్య పరిశ్రమ రైతులు తీసుకొన్న కిసాన్ క్రెడిట్ కార్డురుణాలపై 2శాతం వడ్డీ రాయితీ.
- ప్రకృత్తి విపత్తులు జరిగిన ప్రాంతాల్లోని రైతుల రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ. సకాలంలో చెల్లిస్తే 3శాతం వడ్డీ రాయితీ.
- ప్రధాన మంత్రి శ్రమ్ యోజన కింద నెలకు రూ.3,000 పింఛను చెల్లింపు. అందుకోసం సంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.100 చెల్లించాలి. ఈ పథకంతో ఐదేళ్లలో 10కోట్ల మందికి లబ్ధి.
- రక్షణ బలగాలకు రూ.3,00,000 కోట్లకు పైగా కేటాయింపు. అవసరమైతే అదనపు నిధుల పెంపునకు అంగీకారం.
- సైనిక దళాల వేతనాల పెంపు. వన్ ర్యాంక్ వన్ పింఛన్‌కు రూ.35,000 కోట్లు కేటాయింపు
- మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాకి రూ.19,000 కోట్లు కేటాయింపు
- ఈశాన్య భారత దేశానికి కేటాయింపులు రూ.58,166 కోట్లకు పెంచారు. గతంతో పోలిస్తే ఇది 21శాతం అదనం
- భారతీయ సినీ నిర్మాణ సంస్థలకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తారు. ఇప్పటి వరకు విదేశీ సంస్థలకు మాత్రమే ఉంది. సినీ పైరసీ అరికట్టడానికి సినిమాటోగ్రఫీ చట్టం.
- రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వారు మూడు నెలలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడానికి అవకాశం.
- వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. వచ్చే ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగాభారత్ మారుతుంది.
Note: 2019-20 కేంద్ర బడ్జెట్ కు సంబంధించి పోటీ పరీక్షలకు పనికొచ్చే ప్రశ్నలను వచ్చేవారంలో ఇవ్వబడును.