కేంద్ర ప్రభుత్వ పథకాలు (Part-2) – QUICK REVISION
( 2nd part )
11) ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన
- 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైంది.
- దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ( పేద కుటుంబాలు ) మహిళల పేరుతో ఉచితంగా LPG (వంట గ్యాస్) కనెక్షన్లు ఇస్తారు.
- మొదటి మూడేళ్ళలో 5 కోట్ల కనెక్షన్లు ఇస్తారు.
12) హృదయ్
- HRIDAY (Heritage City Development and Augmentation Yojana
- వారసత్వ నగరాల సంరక్షణ కోసం 2015 జనవరి 21న ఈ పథకం ప్రారంభమైంది.
- మొదటి దశలో 12 నగరాలను ఎంపిక చేశారు.
ఇందులో తెలంగాణ నుంచి వరంగల్, ఏపీ నుంచి అమరావతి ఉన్నాయి. ఇవి కాకుండా... వారణాసి (ఉత్తరప్రదేశ్), పూరి (ఒడిశా), అమృత్‌సర్ (పంజాబ్), అజ్మీర్ (రాజస్థాన్), గయ (బీహార్), మధుర (ఉత్తరప్రదేశ్), కాంచీపురం (తమిళనాడు), వేలంగిణి (తమిళనాడు), బాదామీ (కర్ణాటక) తోపాటు ద్వారక (గుజరాత్).
13) ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన
- వ్యవసాయరంగం, గ్రామాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
-కేంద్ర- రాష్ట్రాలు 75:25తో నిధులను భరించాలి
- ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి 90:10
-సేద్యపు నీటి వినియోగం పెంచుతూ సూక్ష్మ సాగునీటి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఈ పథకం ఉద్దేశ్యం.
14) ప్రధానమంత్రి సురక్షబీమా యోజన
- ప్రమాద బీమా పథకమైన దీన్ని 2015లో ప్రారంభించారు.
- 18 నుంచి 70యేళ్ళ వారికి ఇది వర్తిస్తుంది. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి.
- ఈ పథకం కింద 2 లక్షల రూపాయల బీమా ఇస్తారు.
- అంగవికలురు అయితే లక్ష రూపాయల బీమా చెల్లిస్తారు.
15) ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం
-ఈ పథకం ప్రారంభ మైంది : - 2014 ఆగస్టు 28. నినాదం ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’.
- దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ అకౌంట్ ఉండేలా పథకం రూపకల్పన
-ఈ అకౌంట్ కలిగిన వారికి రూ.30 వేల బీమా సౌకర్యం, లక్ష రూపాయల ప్రమాదబీమా సౌకర్యం ఉంటుంది.
16) మేక్ ఇన్ ఇండియా
- ఈ కార్యక్రమాన్ని 2014 సెప్టెంబరు 25న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం
- సంపూర్ణ ఉద్యోగితతో 25 రంగాల్లో ఉపాధి కల్పన, నైపుణ్య పెంపుదల కృషి చేయడం
- సాంకేతికతను పెంపుదల, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయ స్థాయిని పెంచడం ఈ పథకం లక్ష్యం
- మొత్తమ్మీద భారత్ ను తయారీ కేంద్రంగా తీర్చి దిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
17) ప్రధానమంత్రి ముద్రా యోజన
- ఈ పథకం 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైంది.
- చిన్న వ్యాపారులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చేయూత అందిస్తారు. అందుకోసం రూ.10లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.
-మూడు రకాలుగా రుణాన్ని అందిస్తారు.
1) శిశు (రూ.50 వేల వరకు రుణం)
2) కిశోర్ (రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు)
3) తరుణ్( రూ.5లక్షల నుంచి పది లక్షలు)
18) స్టాండప్ ఇండియా
- 2016 ఏప్రిల్ 5న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభించారు.
- SC, ST మహిళలకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి ఒక కోటి వరకు రుణం మంజూరు చేస్తారు
19) స్టార్టప్ ఇండియా
- స్టార్టప్ ఇండియా కార్యక్రమం 2016 జనవరి 16న ప్రారంభమైంది.
- కొత్త కంపెనీలు, వెంచర్ల ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పించడం
- రూ.25 కోట్ల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు.
20) డిజిటల్ ఇండియా
- డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 జూలై 1న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు
- గ్రామీణ ప్రాంతాలను హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తారు. అలాగే గ్రామాల్లో డిజిటల్ లిటరసీని కలిగిస్తారు.
21) అటల్ పెన్షన్ యోజన
- 60 యేళ్ళు పైబడిన వృద్ధులకు వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు పెన్షన్‌ను అందించడం ఈ పథకం ఉద్దేశ్యం.
-2015 మే 9న ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పథకంలో చేరడానికి 18-40యేళ్ళ వాళ్ళు అర్హులు. వయసును బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు.
22) ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన
- 2015 మే9న పథకం ప్రారంభమైంది. ఇది కూడా జీవిత బీమాకి సంబంధించినది
- 18-50 యేళ్ళ వయస్సున్న వారికి వర్తిస్తుంది.
- 2 లక్షల రూపాయల బీమా సదుపాయం ఉంటుంది. కల్పిస్తారు.
- బీమా ప్రీమియంగా ఏడాదికి రూ.330లు చెల్లించాలి.
23) ప్రధానమంత్రి సురక్షబీమా యోజన
- 2015లో ప్రారంభమైన ఈ పథకం ప్రమాద బీమాకి సంబంధించినది.
- ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి.
- 18 - 70 యేళ్ళ వయస్సు ఈ యోజన వర్తిస్తుంది. రెండు లక్షల ప్రమాద బీమా
- వైకల్యానికి లక్ష రూపాయల బీమా ఇస్తారు.
24) శ్యాంప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్
- 2016 ఫిబ్రవరి 21న చత్తీస్‌గఢ్‌లోని కురుభాత్ గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామాల్లో కూడా కల్పిస్తారు.
- మూడేళ్ళలో 300 స్మార్ట్ విలేజ్‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యం.
- దేశంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.