CET కి ఒకే సిలబస్

CET కి ఒకే సిలబస్

నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఒకే సిలబస్ ఉంటుంది.

దేశంలోని ప్రతి జిల్లాలో ఒక పరీక్షా కేంద్రం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఎక్కువ మంది రాస్తుంటే అదే జిల్లాలో మరో సెంటర్ ను ఎలాట్ చేస్తారు. దాంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ దూరం వెళ్లి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉండదు
ఎగ్జామ్స్ మొదట 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. దాంతో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంగ్లీష్ లేదా హిందీ వచ్చిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడేవారు. ఇప్పుడు తెలుగు, తమిళం లాంటి ప్రాంతీయ భాషల్లోనూ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.

ఎగ్జామ్స్ రాయడానికి అభ్యర్థుల కోసం ముందుగా రిజిష్ట్రేషన్ పోర్టల్ ను ఏర్పాటు చేస్తారు.

దేశవ్యాప్తంగా అభ్యర్థులందరికీ ఒకే క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఎలాంటి లీక్స్ కి ఆస్కారం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో పకడ్బందీగా సర్వర్ ను మెయింటైన్ చేస్తారు.

ప్రస్తుతం 117 జిల్లాల నుంచి ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అక్కడి అభ్యర్థులకు సమాచారం అందించడానికి 24 గంటల హెల్ప్ లైన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఇది కూడా చదవండి అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకీ ఒకే ఎగ్జామ్