అన్ని యూనివర్సిటీలకూ ఒకే ఎంట్రెన్స్ టెస్ట్

అన్ని యూనివర్సిటీలకూ ఒకే ఎంట్రెన్స్ టెస్ట్

ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొత్తం 55 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో కన్వెన్షనల్ యూనివర్సిటీలు 10 ఉంటే, స్పెషలైజ్డ్ 19, PPP మోడల్ లో 2, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ 8, సెంట్రల్ వర్సిటీలు 3, డీమ్డ్ యూనివర్సిటీలు 2, ప్రైవేటు వర్సిటీలు 8 ఉన్నాయి. ప్రస్తుతం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ యూనివర్సిటీలు వేర్వేరుగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. దాంతో అన్ని పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. వేర్వేరు చోట్ల ఎగ్జామ్ సెంటర్లు, ఒక్కో యూనివర్సిటీకి విడి విడిగా ఎగ్జామ్స్ ఫీజులు చెల్లించడం లాంటి బాధలు ఇక తప్పే అవకాశం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు ప్రవేశాల్లో పారదర్శకత పాటించడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒకే పరీక్ష ద్వారా వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి తాము కోరుకున్న యూనివర్సిటీలో చేరే అవకాశం విద్యార్థికి ఉంటుంది. రాష్ట్రంలోని నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. వచ్చే ఏడాది నుంచే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టును ప్రవేశపెట్టాలని ఏపీ ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది.