కరోనా కోసం వరల్డ్ బ్యాంక్ ఫండ్

ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొవిడ్ 19 (కరోనా) ను సమర్థంగా ఎదుర్కునేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. కరోనాతో ఇబ్బంది పడుతున్న దేశాలకు స్పీడప్ గా నిధులు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తెలిపారు. ఇప్పటికే సాయం కోరిన దేశాలకు 8 బిలియన్ డాలర్లు అందించనున్నారు. పేద దేశాలకు ఈ ముప్పును ఎదుర్కోవడం ఇబ్బందిగా మారిందని మల్పాస్ చెబుతున్నారు. ఈ నిధుల ద్వారా అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణులు, విధి విధానాలను రూపొందించుకోడానికి ఉపయోగించుకోవాలి. గతంలో ఎబోలా, జికా వైరస్ వ్యాపించినప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ ఇలాగే ఫండ్ కేటాయించింది. ప్రపంచంలో 3 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. మరో 85 వేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.