DAY 10 (SPOKEN ENGLISH )

జవహర్ లాల్  నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధాని. ఆయన 1889 లో అలహాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ లాయరు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి "లా" చదివారు. కాని ఆయన లాయరు కాలేదు. ఆయన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆయన చాలాసారు జైలుకి వెళ్ళాడు. ఆయన జైల్లో ఉండే చాలా బుక్స్ రాసాడు. ఆయన చాలా ధనవంతుడు. కానీ దేశంకోసం చాలా త్యాగం చేశాడు. స్వాతంత్ర్యం తరువాత ఆయనే మన మొదటి ప్రధానమంత్రి. ఆయన 1964 వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పాలనలో ఇండియా చాలా అభివృద్ధి చెందింది. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఆమె కూడా తరువాత ప్రధానమంత్రి అయింది.

Write down the above passage into English

Passive voice యొక్క ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసుకుంటూ ముందుకి వెళదాం.

Official reports, Government GO’s, Orders, Certificates మొదలైన వాటిలోనే కాక News papers, Text books అలా ఎన్నో వాటిలో Passive voice మాత్రమే వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు Passive Voice Sentence అంటే సాదారణంగా

"Cricket is played by Sachin" లాగా “by” తో end అవుతాయి అనుకుంటూ వాటిని గుర్తుపట్టటం తేలిక అనుకుంటాం.

కానీ Passive voice sentence అయినంత మాత్రాన "by" తో end కావాలి అనే సిద్దాంతం ఏమీ లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 'by" తో end అయ్యే Sentence ఉన్నట్లయితే దానిని Passive voices' లో చెప్పాల్సిన పని దాదాపుగా రాదు. Active voice లోనే చెప్పొచ్చు.

        Practical గా చెప్పాలంటే దాదాపుగా అన్నిPassive voice sentences “by" తోటి end కావు. Passive Voice తెలుగులో ముందుగా మనం చెప్పకున్నటు "బడ" "బడు" అనే పదాలు కూడా రావు. అయినప్పటికీ అవి మాత్రం Passive voice sentences మాత్రమే.

ఉదాహరణకు:

P.V :- This work is completed

ఈ Work complete చేయబడుతుంది

(ఎవరిచేత అనేది ముఖ్యం కాదు).

మనం ఆ తెలుగు Sentence ని ఇలా అంటాం.

ఈ work complete అవుతుంది

P.V :- Cricket is being played now

Cricket ఇప్పుడు ఆడబడుతూ ఉంది

(ఎవరిచేత అనేది ముఖ్యం కాదు)

మనం ఆ తెలుగు Sentence ని ఇలా అంటాం.

Cricket ఇప్పుడు ఆడుతున్నారు

(ఎవరిచేత ఆడబడుతున్నది అనేది ముఖ్యం కాదు. అదే ముఖ్యం అయితే They are playing Cricket

now అనో He is playing Cricket now అనో అనే వాళ్ళం)

P.V :- She has been admitted in the hospital

ఆమెని Hospital లో ఇంతకుముందే admit చేసారు.

పొరపాటున

"She has been admitted in the hospital” కు బదులుగా

A.V:- "She has admitted in the hospital" అన్నామంటే,

దాని అర్ధం

ఆమె (ఎవరినో) Hospital లో admit చేసింది అనే భావం వస్తుంది.

కాబట్టి Passive voice Homework చేసేటప్పుడు తెలుగుని జాగ్రత్తగా రాయండి.

                                          HOME WORK

 ACTIVE VOICE 

She solves all problems

ఆమె 'A' 'P' ని 'S' చేస్తుంది

Workers demand  Salary

'W' 'S' ని ‘D’ చేస్తారు

I sanction leaves

నేను 'L' 'S' చేస్తాను

You insult me

మీరు నన్ను "I" చేస్తారు

PASSIVE VOICE

All problems are solved by her

‘A’ ‘P’ ఆమె చేత 'S' చేయబడతాయి

Salary is demanded by Workers

‘S’ ‘W’ చేత  'D' చేయబడుతుంది.

Leaves are sanctioned by me

‘L’ నాచేత ‘S’ చేయబడుతాయి.

I am insulted by you

నేను మీ చేత ‘I’ చేయబడతాను

ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్నారు. ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళి విద్యార్ధులుగా జాయిన్ అయ్యారు. ఆ గురువుగారు వారికి చాలా విషయాలు బోధించారు. కొంతకాలానికి మొదటివాడు జంతువుల ఎముకలను క్రమపద్దతిలో ఉంచడం నేర్చుకున్నాడు. రెండవ వాడు చనిపోయిన జంతవులకు ప్రాణంపోసే విద్య నేర్చుకున్నాడు. మూడవవాడు చదివి జ్ఞానం సంపాదించాడు.

ఒకరోజు వారు ముగ్గురు అడని గుండా వెళుతూ ఉండగా వారు చనిపోయిన సింహం ఎముకలు చూశారు. మొదటి వాడు వాటిని క్రమపద్దతిలో పేర్చాడు. రెండవ వాడు దానికి ప్రాణం పోశాడు. మూడవవాడు జరగబోయేది తెలిసి అక్కడి నుంచి అక్కడి నుండి తప్పుకున్నాడు. సింహం ఆ ఇద్దరి మీదకి దూకి వారిని చంపి తినేసింది.

ఇప్పుడు ఈ క్రింది Passage ని English లోకి convert చేయండి. మెత్తం Passive voice లోనే ఉంది.

ఈ రోజు అనగా 5th September Teachers Day. Dr. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు Teachers day గా జరుపుకుంటారు. ఈ Teachers day ని grand గా celebrate చేసారు. Students కి prizes గా Dictionaries ఇచ్చారు. అందరికి Sweets distribute చేసారు. Self government కూడా conduct చేయడం జరిగింది.

10th class రమ్య కి Self government లో 1st prize ఇచ్చారు. 9th class గీత కూడా బాగా perform చేసింది. కాని ఆమెకి prize ఇవ్వలేదు. Principal, Correspondent & Chief guests speeches ఇచ్చారు.

ఈ రోజు మీరు Diary రాసారా ?