DAY 12 (SPOKEN ENGLISH)

ఈ రోజు మనం పూర్తిగా జరిగిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకుందాం. తెలుగు కథలను ఇంగ్లీష్ లోకి మార్చుకుందాం. ఇచ్చిన Active voice sentences ను Passive Voice లోకి మార్చుదాం.

అదే విధంగా I(1) Simple present tense ను ఉపయోగించుకుని ప్రతిరోజు చేసే పనులను ఇంగ్లీష్ లో రాద్దాం.

ఉదాహరణకు గాను క్రింది examples ను గమనించండి.

అసలు మనం ఎందుకని ఇలా రోజూ జరిగే విషయాలను ఇంగ్లీష్ లో రాయాలి? ఆలోచిద్దాం. దానికంటే ముందు, రోజు మీరేం చేస్తారు? అని ఎవరయినా ప్రశ్నిస్తే సాధారణంగా మీ సమాధానం ఈ విధంగా ఉంటుంది.

 1. నేను ఉదయం 5 am కి లేస్తాను.
 2. కొద్దిసేపు వాకింగ్ చేస్తాను.
 3. ఫ్రెష్ అయిన తరువాత ఆఫీస్ కి వెళతాను.
 4. సాయంత్రం 5 pm కి ఇంటికి చేరుకుంటాను.
 5. కొద్దిసేపు T.V. చూస్తాను.
 6. 9 pm కి పడుకుంటాను.

కొద్దో గొప్పో తేడాతో దాదాపుగా అందరు ఇలా చెపుతారు. ఇప్పుడు వాటిని English లోకి మార్చుదాం.

1) నేను ఉదయం 5 am కి లేస్తాను.

I (1)Simple Present I Wake up at 5am.

2. కొద్దిసేపు వాకింగ్ చేస్తాను.

I (1) I do walking for some time

3. ఫ్రెష్ అయి ఆఫీసు కి వెళతాను.

I (1) After freshing I go to office

4. సాయంత్రం 5 pm కి ఇంటికి చేరుకుంటాను.

I (1) At evening 5pm I reach home

5. కొద్దిసేపు TV చూస్తాను.

I (1) I watch T.V. for some time

6. 9 pm కి పడుకుంటాను.

I (1) At 9 pm I sleep

పై sentences ను గమనిస్తే మనకు ఒక విషయం అర్థం కావాలి. అదేమిటంటే మీరేం చేస్తారు అన్న ప్రశ్నకు తెలుగులో ఆరు sentences చెప్పారు కాబట్టి .... ఇంగ్లీష్ లో కూడా ఆరు sentences వచ్చాయి. ఒకవేళ తెలుగులో పది Sentences చెప్పినట్లయితే, అప్పుడు ఇంగ్లీష్ లో ఎన్ని చెప్పగలుగుతాము? పది Sentences చెప్పగలుగుతాము కదా! మరి తెలుగులో వంద Sentences చెప్పినట్లయితే? అనుమానమేమి లేదు వంద  Sentences చెప్పగలము. అంటే మన తెలుగుని బట్టే ఇంగ్లీష్ అని అర్థం చేసుకోవాలి.

ఈ రోజు ఇవ్వబోయే Worksheet లో ఉన్న Active Voice sentences ను Passive Voice లోకి మార్చండి.

  ఉదాహరణకు "మీరేం చేస్తారు రోజు?" అనే ప్రశ్నకు ఒకరి సమాధానాలు గమనిద్దాం.

 1. నేను 5 am కి లేస్తాను.
 2. ముందుగా కళ్ళు తెరచి దేవుని ఫోటో చూస్తాను.
 3. ఆ తరువాత మంచం దిగుతాను.
 4. మంచం దిగిన తరువాత దుప్పట్లు మడత పెడతాను.
 5. ఆ తరువాత వాటిని Neat గా shelf లో సర్దుతాను.
 6. Bathroom కి వెళ్ళి brush తీసుకుని paste వేసుకుని brush చేసుకుంటాను.
 7. ఇవన్నీ అయిన తరువాత వంటగదిలోకి వెళ్ళి ముందుగా bowl తీసుకుని stove మీద పెడతాను.
 8. రెండు గ్లాసుల నీళ్ళు bowl లో పోస్తాను.
 9. Lighter తో stove వెలిగిస్తాను.
 10. Sugar, Tea powder add చేస్తాను.
 11. 10 నిమిషాలు కాగనిస్తాను.
 12. తరువాత ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి door open చేసి పాలు తీసుకుని door close చేస్తాను.
 13. 1 1/2 cup పాలు add చేసి మరో 5 నిమిషాలు మరగనిస్తాను.
 14. Stove of చేసి ఆ టీని 3 cups లో పోసి మేము తాగుతాము.
 15. టీ తాగేటప్పుడు Newspaper చదువుతాను.
 16. సాధారణంగా నేను Sports News ఎక్కువగా చూస్తాను.
 17. టీ తాగిన తరువాత కొద్దిసేపు Home work చేస్తాను మరియు చదువుతాను.
 18. వంటలో అమ్మకు సహాయం చేస్తాను కూడా.
 19. మా తమ్ముడు మాత్రం టీ తాగడు కాబట్టి తనకి అమ్మ boost పాలు ఇస్తుంది.
 20. అమ్మమ్మ మాత్రం కాఫీ తాగుతుంది.
 21. అమ్మ ఎక్కువగా ఉప్మా టిఫిన్ గా చేస్తుంది.
 22. నేను fresh అయి కాలేజ్ కి బయలుదేరతాను.
 23. కాలేజ్ బస్ లో రోజు నేను కాలేజ్ కి వెళతాను.
 24. బస్ లో ఫ్రెండ్స్ తో రోజూ ఎంజాయ్ చేస్తాను.
 25. కాలేజ్ కి చేరుకున్న తరువాత ముందుగా క్యాంటీన్ కి వెళతాము.

 

పై వాటిని మనం ఇంగ్లీష్ లో రాసినట్లయితే ఈ విధంగా ఉంటాయి.

 1. I wake up at 5am.
 2. At first I open my eyes and see God's photo.
 3. After that I get down from bed.
 4. After getting down from the bed, I fold the blankets.
 5. After that I arrange them neatly in the shelf.
 6. I go to bathroom, take brush, keep paste on the brush and do brushing.
 7. After all these I go to kitchen, take bowl and keep it on the stove.
 8. I pour two glasses of water in to the bowl.
 9. I light the stove with lighter.
 10. I add sugar and tea powder.
 11. I (Let) allow it to boil for 10 minutes.
 12. After that I go near fridge, open the door, take milk and close the fridge door.
 13. I add 11/2 cup milk and allow it to boil for more 5 minutes.
 14. I turn off the stove, pour it in to three cups and we take it.
 15. While drinking tea I read newspaper.
 16. Usually I read Sports news.
 17. After taking tea I do homework some time and read.
 18. I help my mother also in cooking.
 19. My brother doesn't take tea so mother gives boost milk to him.
 20. My grand mother takes only coffee.
 21. My mother prepares Upma as tiffin generally.
 22. I fresh up and go to college.
 23. I go to college by college bus.
 24. I enjoy with my friends in the bus.
 25. After reaching the college at first I go to canteen.

 

పై sentences అన్ని కూడా  I (1) Simple Present tense లోనే రాయాలి. ఇప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్ధం అయి ఉంటుంది. అదేమిటంటే తెలుగులో మనకు ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని మనం ఇంగ్లీష్ లో రాయగలుగుతాము. అంతే తప్ప కేవలం ఇంగ్లీష్ గ్రామరు బాగా నేర్చుకుంటే మాత్రమే కాదు. ముందుగా మనం చెప్పుకున్నట్లు మనకు వచ్చే ఆలోచనలన్నీ

I Present tense

II Past tense లేదా

III Future tense లో
మాత్రమే ఉంటాయి. ఇకపోతే రోజూ జరిగే విషయాలను అంత వివరంగా రాయాల్సిన అవసరం ఏమిటి అనే అనుమానం సాధారణంగా వస్తుంది.

ఖచ్చితంగా అవసరమే. ఉదాహరణకు "కళ్ళు తెరిచాను" అనే సెంటెన్స్ ద్వారా “open" అనే "verb", “దేవుడి ఫోటో చూసాను" అనే సెంటెన్స్ ద్వారా "see" అనే “verb" ఇలా ఎన్నో “verbs” అంటే "Vocabulary" ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా “open" "See" ఇలాంటి “verbs" ను ఇంకా ఎన్నో సందర్భాలలో వాడతాము.

ఉదాహరణకు "మంచం దిగుతాను" అనే సెంటెన్స్ ను గమనించినట్లయితే "Get down" అనే "verb" ను మరియు దాని మూడు రూపాలను

అంటే V1 - get down

V2 - got down

V3 - got down లను

మనం అర్థం చేసుకున్నట్లయితే అదే “get down" ను " ఆటో దిగటానికి", "బస్ దిగటానికి" కూడా వాడతాము. మంచం దిగటం విషయంలో మనం “get down" లాంటి “Verb" ను తెలుసుకున్నట్లయితే మరెన్నో సందర్భాలలో దానిని మనం ఉపయోగించుకోవచ్చు. అందువల్లే రోజు మనం చేసే పనులన్నింటినీ వీలైనన్ని ఎక్కువ రాయటం ద్వారా చక్కటి పరిజ్ఞానాన్ని పొందగలం.

ఆ తెలుగు ఉదాహరణలను ఇంగ్లీష్ లోకి రాయటం. General Activities sentences ను కనీసం యాభై స్వంతంగా రాయటం, ఇచ్చిన తెలుగు కథలను ఇంగ్లీష్ లోకి మార్చటమే కాకుండా మీరు కూడా స్వంతంగా మీకు తెలిసిన నీతి కథలను ఇంగ్లీష్ లోకి మార్చటానికి ప్రయత్నం చేయండి. అలా రాసేటప్పుడు వాటిని ముందుగా తెలుగులో రాయనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడయితే నేను ఇచ్చే కథ ఏమిటో, తెలుగు sentences ఏమిటో మీకు తెలియాలి కాబట్టి వాటిని రాయటం జరిగింది.

అదే మీరు రాసేటప్పుడు మీ స్వంత ఆలోచనలను, కథలను రాస్తారు. కాబట్టి వాటిని ముందుగా తెలుగులో రాయాల్సిన అవసరం లేదు. తెలుగు సెంటెన్స్ ను స్పష్టంగా మనసులో ఉంచుకోండి. తగిన విధంగా ఇంగ్లీష్ లోకి మార్చండి సరిపోతుంది. ఈ విధమయిన అభ్యాసం మీకు ముందు ముందు చాలా ఉపకరిస్తుంది. కాబట్టి మీరు రాయబోయే రోజువారీ దినచర్యలను, రకరకాల కథలను, సంఘటనలను డైరెకుగా ఇంగ్లీష్ లోనే రాయటం ప్రారంభించండి. ఒకవేళ ఏదయినా తెలుగు సెంటెన్స్ ను ఇంగ్లీష్ లోకి మార్చలేకపోయినట్లయితే అదే తెలుగు సెంటెన్స్ ను “భావం” దెబ్బతినకుండా తెలుగులోనే మార్చటానికి ప్రయత్నం చేయండి. అంటే తెలుగులో కఠినంగా ఉండే సెంటెన్స్ ను ముందుగా తెలుగులోనే సరళంగా చేయండి. అప్పుడు తేలికగా ఇంగ్లీష్ లోకి మార్చగలుగుతాము.

                                                           HOME WORK

They help me

వారు నాకు ‘H’ చేస్తారు

You ask money

మీరు ‘M’ అడుగుతారు

I submit records

నేను ‘R’ ‘S’ చేస్తాను

She records everything

ఆమె అంతా ‘R’ చేస్తుంది

I am helped by them

నేను వారి చేత ‘H’ చేయబడతాను

Money is asked by you

‘M’ మీ చేత అడగబడుతుంది

Records are submitted by me

'R' నా చేత 'S' చేయబడతాయి

Every thing is recorded by her

అంతా ఆమె చేత 'R' చేయబడుతుంది

 

                         ఈ రోజు మీరు Diary రాసారా?

Change the Voice of the following Sentences

 1. He will learn English. ........................................
 2. I ask doubts. .........................................
 3. You have finished H.W. .......................................
 4. They exams will conduct exams. ........................................
 5. She has cautioned him. .............................................
 6. I invited them. .........................................
 7. They will solve this problem. ..........................................
 8. Teachers encourage students. ......................................
 9. My father transferred clerks. ........................................
 10. She will have invited Bhaskar. ......................................
 11. I had followed rules. ......................................
 12. She had played chess. ...........................................
 13. You will complete Everything. ......................................
 14. He sings Songs. ...........................................
 15. You should follow rules. .........................................
 16. I may invite him to the function. ........................................
 17. She cannot speak English. ......................................
 18. 18. They have not appointed her. ......................................
 19. M.D. may conduct meeting tomorrow. ..........................................

20.  My brother may not write this exam.     .....................................

21.  Kumar is not announcing results now.      ..........................................

22. He has not completed this work.          .........................................

23.  I encouraged every one.            ............................................

24. She didnot take permission.          ...........................................

25. Suguna broke the glass.          .........................................

26. I teach English.                         ...........................................

27. Children love parents.        .........................................

28. R.T.C. cancels buses.      ......................................

29. They are arranging party.    ..................................

30.. Workers have troubled manager.   ................................

   

                                                    PASSIVE VOICE

 1. అతను అరెస్ట్ అయ్యాడు. ­­­­­­­­­­­­­­­­­­­­­­­­…………………………..
 2. ఆమెకి తెలియజేయబడుతుంది…………………………..
 1. ఈ పని రేపు పూర్తి అవుతుంది. ………………………….
 2. ఈ పని రేపు పూర్తి కావాలి. ………………………….
 3. ఈ పని రేపు పూర్తి కాగలదు. …………………………
 4. ఈ పని రేపు పూర్తి కావచ్చు. …………………………
 5. అతన్ని రక్షిస్తూ ఉన్నారు. …………………………
 6. వాళ్ళు మోసపోయారు. …………………………
 7. గీతని ఆహ్వానిస్తారు. …………………………
 8. అతను శిక్షించబడతాడు. ………………………….
 9. ఇక్కడ పాలు అమ్ముతారు. …………………………
 10. మా ఫాదర్ బదిలీ అయ్యారు. ……………………….
 11. అది పగిలింది. ……………………..
 12. ఈ సమస్య పరిష్కరించబడవచ్చు. ……………………..
 13. ఉత్తరాలు ఇప్పుడు పోస్ట్ అవుతూ ఉన్నాయి. ………………………..
 14. ఇంతకుముందే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. …………………..
 15. సచిన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వలేదు. ………………………..
 16. స్కూటర్స్ ఇక్కడ పార్క్ చేయకూడదు. …………………………
 17. నిన్న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ……………………….
 18. రేపు పరీక్ష నిర్వహించబడుతుంది. ………………………
 19. బాలకృష్ణ కి ఇంతకుముందే అవార్డు యిచ్చారు. ……………………
 20. వారు ఇప్పుడు డిస్ట్రబ్ అవుతూ వున్నారు. ………………………
 21. ఈ సమస్య రేపు పరిష్కరించబడవచ్చు. ………………………
 22. క్లర్క్ ని రేపు సస్పెండ్ చేస్తారు. ..…………………….
 23. స్కూల్ రేపు రీ ఓపెన్ అవుతుంది. ……………………….
 24. ఫలితాలు ఇంతకుముందే ప్రకటించడడ్డాయి. ……………………….
 25. శ్రీను కి రన్నింగ్ లో మొదటి బహుమతి యిచ్చారు. …………………………
 26. అతన్ని ఇప్పుడు ఆ పెళ్ళికి ఆహ్వానిస్తూ వున్నారు. ………………………..
 27. నన్ను నిన్ననే ఆ పెళ్ళి కి ఆహ్వానించారు. ………………………….
 28. సీత ను రేపు ఆ పెళ్ళి కి ఆహ్వానిస్తారు. …………………………