DAY 13 (SPOKEN ENGLISH)
SIMPLE PAST TENSE
ఈ రోజు మనం నిన్న జరిగిన విషయాలను రాయటం మీద దృష్టి పెడదాం.
ఉదాహరణకు:
నిన్న నేను సినిమాకి వెళ్ళాను.
Friends తోటి Hotel కి వెళ్ళాను.
Homework చేసాను.
మా తమ్ముడిని Hostel లో drop చేసాను.
10 pm కి పడుకున్నాను.
పై విధంగా 5 Sentences ని తెలుగులో చెపితే, రాస్తే, ఇంగ్లీష్ లో కూడా 5 sentences మాత్రమే వస్తాయి. మనకి మరీ ఎక్కువ ఇంగ్లీష్ పరిజ్ఞానం రావాలంటే నిన్న నిజంగా ఏ సంఘటనలు జరిగాయో వాటిని అన్నింటిని రాయటానికి ప్రయత్నించాలి. తెలుగులో సెంటెన్సెస్ రాసి ఆ తరువాత దానిని ఇంగ్లీష్ రాయటానికి బదులుగా
తెలుగు సెంటెన్స్ ని direct గా ఇంగ్లీష్ లోకి రాయండి. ఏ sentence ని అయితే మీరు English లోకి మార్చలేరో ఆ తెలుగు సెంటెన్స్ ని సరళం చేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే సాధారణంగా జరిగిన విషయాలన్నీ II(1) Simple past లో ఉంటాయి. II(1) Simple past లో blind rule "V2”.
ఉదాహరణకు ( క్లిష్టమయిన తెలుగు )
నిన్న నేను మా friend ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి Cinema చూసి Hotel లో భోంచేసి, 2pm కి ఇంటికి వచ్చాను.
దానిని సరళం చేస్తే
నిన్న నేను మా friend ఇంటికి వెళ్ళాను. I went to my friend's home yesterday.
ఇద్దరం సినిమా చూసాం. We both watched cinema.
Hotel లోభోంచేసాము. We ate lunch in hotel.
2 pm కి ఇంటికి వచ్చాను. Reached to house at 2 pm.
క్లిష్టమయిన తెలుగు
నిన్న వాళ్ళు Cricket ఆడుతున్నప్పుడు నా Cell మోగింది.
దానిని సరళం చేస్తే
నిన్న వాళ్ళు Cricket ఆడుతున్నప్పుడు. They were playing Cricket yesterday.
నా Cell మోగింది. My cell rung.
When they were playing Cricket my cell rung.
ఒకసారి నిన్న జరిగిన విషయాలను మీరు స్వంతంగా రాయగలిగారంటే ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ పరిజ్ఞానంలో అద్భుతమయిన మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలా అంటే
నిన్న నేను పెళ్ళికి వెళ్ళాను.
I went to Marriage yesterday.
చాలా బాగా enjoy చేసాను.
Enjoyed a lot.
మా పాత మిత్రులందరినీ కలిసాను.
Met all my old friends.
పైన sentence నిన్నజరిగితే Yesterday అని, మొన్న జరిగితే day before yesterday అని, Last month లో జరిగితే Last month లేదా years క్రితం జరిగితే 5 years back అని రాస్తాము. Structure మాత్రం యధావిధిగా II(1) Simple Past tense తప్పదు.
అంటే ఒకసారి II(1) Simple past tense V2 చక్కగా రాయగలిగితే నిన్న మొన్న, జరిగిన విషయాలే కాదు, మీ జీవితంలో జరిగిన అన్ని విషయాలను చాలా తేలికగా రాయగలుగుతారు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. మీరు స్వంతంగా 100 sentences ను రాయగలిగారంటే వాటిని చూడకుండా చెప్పాలని ప్రయత్నిస్తే దాదాపుగా 50 చెప్పగలుగుతారు. మరీ ఎక్కువగా మాట్లాడాలంటే ఎక్కువగా రాయాలి. ఎక్కువగా రాయాలంటే జరిగిన విషయాలను చక్కగా తెలుగులో అర్ధవంతంగా రాయగలగాలి.
"తెలుగులో మన చక్కటి పరిజ్ఞానం, (సందేహం లేకుండా) ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంచుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు".
ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మాతృభాషలో చక్కగా రాయగలిగే మరియు మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవారు, మరే ఇతర భాష నేర్చుకున్నా, ఆ భాషలో కూడా చక్కగా రాయగలిగే మరియు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని తమ స్వంతం చేసుకుంటారు.
మాతృభాష లోనే చక్కగా తమ భావాన్ని తెలియచెప్పలేనివారు లేదా పొదుపుగా మాట్లాడే/రాసే వారు ఆంగ్లంలో కూడా అలాగే ఉంటారు.
ఏ భాష అయినా సరే మీ అభిప్రాయాలను, ఆలోచనలను వెలిబుచ్చే సాధనాలే తప్ప మీ ఆలోచనా శక్తిని అవి పెంపొందించవు. ఉదాహరణకు చక్కటి తెలుగు భాషా పరిజ్ఞానం మీ స్వంతం అయినప్పటికీ "అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థ పదార్ధాల మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి" అన్నామనుకోండి, దానిమీద అవగాహనే లేనప్పుడు ఎలా చెప్పగలుగుతాం. కాబట్టి భాష, భావం రెండూ ముఖ్యమే. ముందుగా మనకు మాట్లాడటానికో, రాయటానికో ఆలోచనలు ఉండాలి. అప్పుడు భాష మనకు సహాయం చేస్తుంది.
టీ తయారు చేయటాన్ని కూడా రాయండి.
"నిన్న బంధువులు మా ఇంటికి వచ్చారు. నేను వారికి Chairs offer చేసాను. మేము కొద్దిసేపు School విషయాలు discuss చేసుకున్నాం. 15 నిమిషాల తరువాత నేను టీ prepare చేయటానికి వంటగదిలోకి వెళ్ళాను. ముందుగా నేను చెయ్యెత్తి shelf లో ఉన్న గిన్నెని తీసుకున్నాను. దానిని Stove మీద ఉంచి రెండు గ్లాసుల వాటర్ పోసాను. తరువాత Stove వెలిగించి ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళాను. డోర్ తీసి చేయి లోనికి పెట్టి పాలు తీసుకుని డోర్ వేసాను. డోర్ వేసాక మూడు గ్లాసుల పాలు, సరిపడా Sugar Tea powder add చేసాను. 10 నిమిషాల తరువాత ఫిల్టర్ తో ఆ టీని Cups లోకి పోసి tray లో ఉంచి వాటిని వారికి అందించాను".
పై విధంగా రాయటం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే Vocabulary ని పెంపొందించుకోవటం కోసం. మన రోజూ వారి కార్యక్రమాలను ఇంగ్లీష్ లోకి మనం మార్చగలిగితే చాలా త్వరగా మరియూ సులువుగా స్పోకెన్ ఇంగ్లీష్ మీద పటు సాధించవచ్చు. ఈ క్రమంలో మనకు Dictionary అవసరమవుతుంది. Dictionary అనగానే అందరం అనుకున్నట్లు English to Telugu or English to English లు కాదు. Telugu to English Dictionary అత్యంత అవసరం.
మాతృభాషలో మనకు వచ్చే ఆలోచనలకు సరియైన ఇంగ్లీష్ పదం దొరక్క చాలాసారు ఇబ్బంది పడతాం. ఆ
తెలుగు సెంటెన్స్ ను ఏ టెన్స్ లో చెప్పాలో స్పష్టంగా తెలిసినా సరియైన ఇంగ్లీష్ పదం తెలీక ఆ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లోకి మార్చలేం. ఈ క్రమంలో "ఇంగ్లీష్ కష్టం" అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఇంగీష్ కష్టం కానే కాదు.
ఉదాహరణకు ఈ క్రింది సెంటెన్స్ ను గమనించండి.
"రాము ఇప్పుడు స్కూలుకి వెళుతూ ఉన్నాడు"
I(2) Ramu is going to school now.
"పాము ఇప్పుడు పుట్టలోకి వెళుతూ ఉంది"
అదే I(2) Present Continuous Tense అయినప్పటికీ పుట్టని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలీకపోతే రాయలేం. మరి పుట్టని ఇంగ్లీష్ లో ఏమంటారో, గుట్టని ఏమంటారో, లోయని ఏమంటారో తెలుసుకోవాలంటే మనం ఆధారపడాల్సింది English to Telugu Dictionary మీద కాదు. Telugu to English Dictionary మీద.
"Snake is going (Crawling = పాకటం) to Ant hill'.
పై విధంగా మీరు కూడా కొన్ని స్వంతంగా రాయటానికి ప్రయత్నించండి. రాసాక వాటిని బయటకు చదవటం మరవకండి.
HOME WORK
He explains English
అతను ‘E’ ‘E’ చేస్తాడు
Ravi cheats everyone
'R' ప్రతి ఒక్కరినీ ‘C’ చేస్తాడు
Students answer all questions
'S' ‘A Q’ కి 'A' చేస్తారు
They accept my proposal
వారు నా 'P' ని 'A’ చేస్తారు
English is explained by him
‘E’ అతని చేత 'E' చేయబడుతుంది
Everyone is cheated by Ravi
ప్రతీ ఒక్కరు ’R’ చేత 'C' చేయబడతారు
All questions are answered by Students
‘A Q' 'S' చేత 'A' చేయబడుతుంది
My proposal is accepted by them
నా ‘P’ వారి చేత ‘A’ చేయబడుతుంది
Simple Past Tense Had to Work sheets ను complete చేయండి.
ఈ రోజు మీరు Diary రాసారా
గతంలో జరిగిన పనులకు II(1)ను ఉపయోగించాలి
- మేము last year picnic కి వెళ్ళాము.
- ఆ రోజు early morning 5.00am కి లేచాము.
- నేను fresh అయి, luggage pack చేశాను.
- ఆ తరువాత luggage బయట పెట్టి room కి lock వేశాను.
- ఒక ఆటోని engage చేసుకుని college కి వెళ్ళాను
- ఆ time కి మా friends అక్కడికి చేరుకున్నారు.
- మేమందరం bus లో picnic కి బయలుదేరాము.
- మా friends bus లో dance చేశారు.
- రవి ఒక పాట పాడాడు.
- పాట విన్నాక driver bus stop చేశాడు
- చివరకు మేము basara చేరుకున్నాము.
- మేమందరం bus దిగి గోదావరి నది దగ్గరకు చేరుకున్నాము.
- మాలో కొంతమంది గోదావరి నదిలో స్నానం చేసారు.
- ఆ తరువాత అంతా సరస్వతీ దేవిని ప్రార్ధించాము.
- ఆ picnic లో మేము చాలా enjoy చేసాము.
- మాతో పాటు Maths sir కూడా వచ్చారు.
- రాంబాబు తన Swetter పోగొటుకున్నాడు.
- బాసర తరువాత మేమంతా హైదరాబాద్ వెళ్ళాము.
- Night అక్కడ హెూటల్ లో stay చేసాము.
- Next day మేము Birlamandir, Tankband చూశాము.
- ప్రతీ ఒక్కరు Lumbini park లో boat journey చేశాము.
- మేము dinner చేసి వెనక్కి బయలు దేరాము.
- Early morning 5.30 కి college కి చేరుకున్నాము.
- నేను నా Short ని bus లోనే మార్చిపోయాను.
- 25. ప్రతి ఒక్కరం 1000/- పైనే ఖర్చు చేశాము.
- మా సిస్టర్ కోసం నేను Charminar లో గాజులు కొన్నాను.
- మా friend mohan వాళ్ళ father కి watch కొన్నాడు.
- మిగిలిన sweets ని మేము enjoy చేశము.
- ఆ విధంగా మేము ఆ picnic లో enjoy చేశాము.
- చాలా సార్లు నేను ఆ picnic ని గుర్తు చేసుకున్నాను.
గతంలో చేయాల్సి వచ్చిన పనులకు Had to ను ఉపయోగించాలి
- నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది.
- 2. ప్రిన్సిపాల్ పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చింది.
- సీత భాస్కర్ ని తిట్టాల్సి వచ్చింది.
- కుమార్ తన మిత్రున్ని సమర్ధించాల్సి వచ్చింది.
- 5. ఆమె తన బావని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది.
- వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది.
- మా తమ్ముడు వాళ్ళని నమ్మాల్సి వచ్చింది.
- సెలక్టర్లు రవిని సెలక్ట్ చేయాల్సి వచ్చింది.
- అతను ఆ ఉద్యోగంతో సంతృప్తి పడాల్సి వచ్చింది.
- నేను ఇంటర్ లో సి.ఇ.సి. గ్రూపు తీసుకోవాల్సి వచ్చింది.
- వర్కర్స్ తమ జీతాల కోసం డిమాండ్ చేయాల్సి వచ్చింది.
- నేను ఆమెకి ఆశ్రమం ఇవ్వాల్సి వచ్చింది.
- వారు ఆ వ్యాపారంలోకి ప్రవేశించాల్సి వచ్చింది
- ఆమె తన పిల్లల్ని శిక్షించాల్సి వచ్చింది.
- రాహుల్ వారి సహాయాన్ని కోరాల్సి వచ్చింది.
- కాంగ్రెస్ మోహన్ బాబుకి టికెట్ కేటాయించాల్సి వచ్చింది.
- నేను లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది.
- నేను వాళ్ళ నుండి దూరం వెళ్ళాల్సి వచ్చింది.
- పోలీసులు అతన్ని విడుదల చేయాల్ని వచ్చింది.
- సచిన్ తన రిటైర్ మెంట్ ని ప్రకటించాల్సి వచ్చింది.
- చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చింది.
- క్లర్క్ మేనేజర్ గురించి భయపడాల్సి వచ్చింది.
- నేను వారిని బెదిరించాల్సి వచ్చింది.
- టీచర్ పేరెంట్స్ సలహాలను వినాల్సి వచ్చింది.
- ఆర్.టి.సి. బస్సులను రద్దు చేయాల్సి వచ్చింది.
- ప్రభాస్ ఆ సినిమాలో నటించాల్సి వచ్చింది.
- నేను నిన్న సినిమా చూడాల్సి వచ్చింది.
- గవర్నమెంట్ ఆ టెండర్ ని రద్దు చేయాల్సి వచ్చింది.
- అతను రాజీనామా చేయాల్సి వచ్చింది.
- నేను నా కోపాన్నీ అణుచుకోవాల్సి వచ్చింది.