DAY 14 – SPOKEN ENGLISH

మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. జరిగిపోయిన విషయాలు చెప్పాలంటే మనం II(1) Simple past tense ని ఉపయోగించాలని ఆ tense లో V2 ని మాత్రమే వాడతామని, అంతేకాకుండా II(1) Simple past tense ని ఉపయోగించి ఎంతో మాట్లాడవచ్చని మనకు తెలుసు. ఇప్పుడు ఆ Tense లో మరింత పరిజ్ఞానం పొందటానికి ఒక ప్రయోగం చేద్దాం. అందులో భాగంగా మనకు ఒక వ్యక్తి సహకారం అవసరమవుతుంది.

వివరంగా తెలుసుకుందాం. మనం ఒక దగ్గర ఉండి మరో వ్యక్తిని రకరకాల పనులను చేయమని చెప్పాలి. ఏ రకమయిన పనులు చేయాలి అనేది ఆ వ్యక్తి ఇష్టానికే వదిలేయాలి. అతను చేసే పనులన్నీ చక్కగా గమనించి, వాటిని మనం  II(1) Simple past tense లో V2 ని ఉపయోగించి తిరిగి చెప్పాలి.

ఉదాహరణకు ఆ వ్యక్తి చైర్ ని జరిపి అందులో కూర్చున్నాడు. జేబులోని Cell తీసి మళ్ళీ జేబులోనే పెట్టుకున్నాడు. లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళి ఒక బుక్ తీసుకుని పేజీలు తిప్పాడు. ఆ బుక్ ని చైర్ కింద పెట్టి చైర్ కి గోడకి మధ్యన నిలబడ్డాడు.

పైన జరిగిన అన్ని విషయాలను మనం జాగ్రత్తగా గమనించి వాటిని II(1) Simple past లో V2 ని ఉపయోగిస్తూ చెప్పినట్లయితే మనకి ఆ Tense మీద గట్టి పట్టు రావటమే కాకుండా ఇంగ్లీష్ లో అన్ని సెంటెన్స్ లను గడగడ చెప్పటం వలన చక్కటి ఉచ్చారణ మన స్వంతమవుతుంది.

పైన ఉదాహరణను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం.

At first he dragged the chair and sat down. He took cell from his pocket and kept it again. After keeping the cell in his pocket he stood up from the chair, went to table, took the book and turned the pages of the book. After that again he came back to the chair, bent down and kept / placed/put the book under the chair. After keeping the book under the chair he stood behind the chair / infront of the wall / In between wall and chair.

పై విధంగా ఆ వ్యక్తి చేసే రకరకాల పనులను మనం ఇంగ్లీష్ లో చెప్పటం వలన మన ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలా బాగా పెరుగుతుంది. II(1) Simple past tense ని (V2) ఉపయోగించటమే కాకుండా అవే పనులను అతను చేసూ ఉన్నప్పుడే I(2) Present continuous tense కూడా ప్రయత్నిస్తుంది. Running Commentary లాగా.

అలా ఒకరి actions ని మీరు II(1) Simple past tense లో explain చేసేటప్పుడు తప్పనిసరిగా వారి actions ని వీడయో తీయాలి సుమా! ప్రస్తుతం అందరి దగ్గర Smart Phone అనేది సర్వసాధారణం. కాబట్టి Video తీయటం అనేది చాలా తేలికగా చేయవచ్చు. అంతేకాదు దానిని Data Cable ద్వారా Computer లో కూడా వెంటనే చూడటం మరియూ జాగ్రత్తగా వినటం చేయాలి. మీ Body Language ని Grammar mistakes ని Pronuonciation ని సరిచూసుకోవాలి.

పై విధంగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయటం ద్వారా నెమ్మదిగా Stage fear తగుతుంది. మనం మాట్లాడేది కేవలం II(1) Simple Past Tense కాబట్టి అందులో మనం అందులో మనం తప్పు చేసే అవకాశం దాదాపుగా లేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతాం. సరేనా All the best మరి go ahead!.

ఈ రోజు Have / Has Work sheet ను complete చేయండి.

                                ఈ రోజు మీరు Diary రాసారా

 ఏదయినా కలిగి ఉన్నట్లయితే Have/Has ను ఉపయోగించాలి

  1. వారికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
  2. అతనికి నాలెడ్జ్ ఉంది.
  3. నాకు Scooter ఉంది.
  4. అతనికి చాలా పొగరుబోతు తనం ఉంది
  5. Students కి సీన్సియారిటీ ఉంది.
  6. అతనికి డిగ్రీ సర్టిఫికెట్ ఉంది.
  7. మా ఫ్రెండ్ కి గవర్నమెంట్ జాబ్ ఉంది.
  8. నాకు హక్కు ఉంది.
  9. అతనికి స్కూలు ఉంది.
  10. ఆమెకి చేయటానికి హోమ్ వర్క్ ఉంది.
  11. కిషోర్ కి అనుమానాలు ఉన్నాయి.
  12. నీకు బద్దకం ఉంది.
  13. నాకు ఇద్దరు Cousins ఉన్నారు.
  14. ఆమెకి తెలివితేటలు ఉన్నాయి.
  15. అతనికి మంచి పేరు ఉంది.
  16. 16. నా దగ్గర మనీ లేదు.
  17. లావణ్యకి కారు లేదు.
  18. వారికి దేవుడి మీద నమ్మకం లేదు.
  19. నాకు సొంత ఇల్లు లేదు.
  20. వారికి సీన్సియారిటీ లేదు.
  21. కుమార్ కి బాధ్యతలు లేవు.
  22. మా ఫ్రెండ్ కి సినిమా హాల్ లేదు.
  23. నాకు ఏ సమస్యలు లేవు.
  24. లీపు సం. లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి.
  25. అతనికి Intelligence లేదు.
  26. నాకు స్పష్టత లేదు.
  27. నాకు శత్రువులు లేరు.
  28. నాకు doubts లేవు.
  29. నీకు అడిగే హక్కు లేదు.
  30. వారికి పని లేదు.