DAY 15 – SPOKEN ENGLISH

ఈ రోజు మనం ప్రశ్నలు ఎలా చేయాలో తెలుసుకుందాం. Let's know how to create

questions properly. ముందుగా తెలుగులో ఒక సెంటెన్స్ ని ఎలా ప్రశ్నలా మార్చాలో చూద్దాం.

I                                                                                                        

1) మీరు క్రికెట్ ఆడుతారు. A.V.

క్రికెట్ మీ చేత ఆడబడుతుంది P.V

Q. మీరు క్రికెట్ ఆడతా(రు)రా? A.V.

క్రికెట్ మీచేత ఆడబడుతుం(ది)దా?  P.V

2. మీరు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. A.V.

క్రికెట్ ఇప్పుడు మీ చేత ఆడబడుతూ ఉంది P.V.

Q. మీరు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నా(రు)రా? A.V.

క్రికెట్ ఇప్పుడు మీ చేత ఆడబడుతూ ఉం(ది)దా?. P.V.

3) మీరు ఇంతకుముందే క్రికెట్ ఆడారు A.V.

క్రికెట్ ఇంతకుముందే మీ చేత ఆడబడింది P.V.

Q. మీరు ఇంతకుముందే క్రికెట్ ఆడా(రు)రా ? A.V.

క్రికెట్ ఇంతకుముందే మీ చేత ఆడబడిం(ది)దా? P.V.

4) మీరు 2002 నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. A.V.

Q. మీరు 2002 నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నా(రు)రా? A.V.

                II

1.మీరు నిన్న క్రికెట్ ఆడారు. A.V.

క్రికెట్ అప్పుడు మీచేత ఆడబడింది. P.V.

Q. మీరు నిన్న క్రికెట్ ఆడా(రు)రా? A.V.

క్రికెట్ నిన్న మీచేత ఆడబడిం(ది) దా? P.V.

2) మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. A.V.

క్రికెట్ అప్పుడు మీచేత ఆడబడుతూ ఉంది. P.V.

Q. మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నా(రు)రా? A.V.

క్రికెట్ అప్పుడు మీచేత ఆడబడుతూ ఉం(ది) దా? P.V.

3) మీరు అంతకుముందే క్రికెట్ ఆడారు. A.V.

క్రికెట్ అంతకుముందే మీచేత ఆడబడింది. P.V.

Q. మీరు అంతకుముందే క్రికెట్ ఆడా(రు)రా? A.V.

క్రికెట్ అంతకుముందే మీచేత ఆడబడిం(ది)దా?  P.V.

4) మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. A.V.

Q.మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూనే ఉన్నా(రు)రా? A.V.

------------------------------------

            III                                                        

1. మీరు రేపు క్రికెట్ ఆడతారు.   A.V.

క్రికెట్ రేపు మీచేత ఆడబడుతుంది.   P.V.

Q. మీరు రేపు క్రికెట్ ఆడతా(రు)రా? A.V.

క్రికెట్ రేపు మీచేత ఆడబడుతుం(ది)దా? P.V.

2) మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు. A.V.

-------------------------

Q. మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటా(రు)రా? A.V.

--------------------------

3) మీరు అంతకుముందే క్రికెట్ ఆడి ఉంటారు.  A.V.

క్రికెట్ అంతకుముందే మీచేత ఆడబడి ఉంటుంది.  P.V.

Q. మీరు అంతకుముందే క్రికెట్ ఆడి ఉంటా(రు)రా? A.V.

క్రికెట్ అంతకుముందే మీచేత ఆడబడి ఉంటుం(ది)దా? P.V.

4) మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. A.V.

---------------------------

Q. మీరు అప్పుడు క్రికెట్ ఆడుతూనే ఉంటా(రు)రా? A.V.

---------------------------

అవి మాత్రమే కాకుండా మరికోన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

  1. బాస్కర్ ఇంతకుముందే పరీక్ష రాసాడు.
  2. బాస్కర్ ఇంతకుముందే పరీక్ష రాసా(డు)డా?
  3. నువ్వు నన్ను నమ్మవు.
  4. నువ్వు నన్ను నమ్మ(వు)వా?
  5. క్రికెట్ లో భారత్ గెలుస్తుంది.
  6. క్రికెట్ లో భారత్ గెలుస్తుం(ది)దా?
  7. ఆమె కిషోర్ ని పెళ్ళి చేసుకుంది.
  8. ఆమె కిషోర్ ని పెళ్ళి చేసుకుం(ది)దా?
  9. మేనేజర్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు.
  10. మేనేజర్ మీటింగ్ కండక్ట్ చేస్తా(డు)డా?

ప్రతీ Sentence లో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించి ఉంటారు.

Sentence చివరలో ఒక్క అక్షరాన్ని మార్చడం ద్వారా మామూలుగా ఉండే sentence ప్రశ్నగా మారిపోతుంది. Just by changing a single letter at the end of a telugu Sentence, a normal sentence becomes an Interrogative one. So to change a normal sentence into Interrogative no need to change the entire sentence.

ముఖ్య గమనిక:

 సాధారణంగా తెలుగు సెంటెన్స్ లో ముఖ్యమైన భావం సెంటెన్స్ యొక్క “చివరలో" ఉంటుంది. ఇంగ్లీష్  సెంటెన్స్ లో "ప్రారంభంలో" ఉంటుంది.

వారు పరీక్ష­­­­­­­­­ ––––––––––––––––––––––––––.

పై సెంటెన్స్ చివరని “రాస్తారు”అని పూరిస్తే I(1) Simple present tense, ఇప్పుడు "రాస్తూ ఉన్నారు" అని పూరిస్తే  I(2) Present continuous tense, "ఇంతకుముందే రాసారు” I(3) Present perfect tense, "రాస్తూనే ఉన్నారు" అంటే I(4) Present perfect continuous tense

"నిన్న రాసారు” అంటే II(1) Simple past tense, “అప్పుడు రాస్తూ ఉన్నారు" అంటే II(2) Past continuous tense, “అంతకుముందే రాసారు” అంటే II(3) Past perfect tense, "అప్పుడు రాస్తూనే ఉన్నారు" అంటే II(4) Present perfect continuous tense.

"రేపు రాస్తారు” అంటే III(1) Simple present tense, "అప్పుడు రాస్తూ ఉంటారు” అంటే III(2) Future continuous tense, "అంతకుముందే రాసి ఉంటారు” అంటే III(3) Future perfect tense, "అప్పుడు రాస్తూనే ఉంటారు” అంటే III(4) Future perfect continuous tense.

 ఆమె వారిని Invite–––––––––––––––––––––

“చేస్తుంది" అంటే ఒక Tense, 'చేస్తూ ఉంది" అంటే మరో Tense, “చేస్తూనే ఉంది" అంటే వేరే Tense, “చేసింది” అంటే మరోటి "ఇప్పుడు చేస్తూ ఉంది", "అప్పుడు చేస్తూ ఉంది", "అప్పుడు చేస్తూ ఉంటుంది", "ఇంతకు ముందే చేసింది", "అంతకుముందే చేసింది" అలా Tense మారిపోతూ ఉటుంది. కాబట్టి తెలుగు సెంటెన్స్ చివర అనేది చాలా ముఖ్యం.

         ఇక ఇంగ్లీష్ సెంటెన్స్ విషయానికి వస్తే

I am––––––––––––––––––

అనగానే “Present tense” అని

I was––––––––––––––––––

అనగానే “Past tense” అని

I will/shall––––––––––––––––––

అనగానే “Future tense” అని

సెంటెన్స్ ప్రారంభంలోనే మనకు దాని మీద అవగాహన వస్తుంది. సెంటెన్స్ చివరి వరకు చూడాల్సిన పనిలేదు.

ఒక Normal Sentence ను ప్రశ్నగా మార్చే విషయానికి వస్తే మనం పై విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలుగు సెంటెన్స్ లో "చివరని" ని మార్చితే మామూలు సెంటెన్స్ ఎలా అయితే ప్రశ్నగా మారుతుందో అదేవిధంగా ఇంగ్లీష్ సెంటెన్స్ లో "ప్రారంభాన్ని" మారిస్తే చాలు. మామూలు సెంటెన్స్ కాస్తా ప్రశ్నగా మారుతుంది.

కాబట్టి తెలుగు సెంటెన్స్ లో చివర మరియూ ఇంగ్లీష్ సెంటెన్స్ లో ప్రారంభం అనేవి చాలా ముఖ్యం. అవి మన పుస్తకం మొదట్లో చెప్పుకున్నట్లు Active Voice, Passive Voice మరియు Be forms ఒకదాని తరువాత š మరొకటి మీకు పూర్తిగా అవగాహన వచ్చి ఉండాలి. అప్పుడు మనకు Questions చాలా తేలికగా అవగాహన అవుతాయి. ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ Sentence ను ఎలా ప్రశ్నగా మార్చాలో.

ఇప్పుడు మనం Home work ఎలా చేయాలో గమనిద్దాం. Active Voice Home work మరియు Passive voice Home work లో  చేసినట్లుగానే ఇక్కడ కూడా ఒక I(1) Simple Present tense sentence ను తీసుకుని దాన్ని III(4) Future perfect continuous tense వరకు రాయాల్సి ఉంటుంది.

Active voice లో మరియూ Passive voice లో ఒక ఉదాహరణను ప్రశ్న రూపంలో తెలుగు సెంటెన్స్ తో సహా రాయాల్సి ఉంటుంది. ఈ క్రింది example home work ని పరిశీలించినట్లయితే మనం Home work ఎలా రాయాలో తెలిసిపోతుంది.

                                                                HOME WORK

`Do you conduct exams?

మీరు 'E' 'C' చేస్తారా?

Does she complete homework?

ఆమె ‘H.W’ ‘C’ చేస్తుందా?

Do they announce results?

వారు ‘R’ ‘A’ చేస్తారా?

Does he learn music?

అతను ‘M’ నేర్చుకుంటాడా?

Are exams conducted by you?

‘E’ మీ చేత 'C' చేయబడతాయా?

Is homework completed by her?

‘H.W’ ఆమె చేత 'C' చేయబడుతుందా?

Are results announced by them?

'R' వారి చేత 'A' చేయబడతాయా?

Is music learned by him?

‘M’ అతని చేత నేర్చుకోబడుతుందా?

                                  I

1) Do you play cricket?

మీరు 'C' ఆడతారా? (AV)

Is cricket played by you? -

‘C’ మీ చేత ఆడబడుతుందా? (PV)

2) Are you playing cricket now?

మీరు ఇప్పుడు 'C' ఆడుతూ ఉన్నారా?  (AV)
Is cricket being played by you now?

‘C’ మీ చేత ఇప్పుడు ఆడబడుతూ ఉందా? (PV)

3) Have you played cricket just before?

మీరు ఇంతకుముందే ‘C’ ఆడారా? (AV)

Has cricket been played by you just before?

‘C’ మీ చేత ఇంతకుముందే ఆడబడిందా? (PV)

4) Have you been playing Cricket?

మీరు ‘C’ ఆడుతూనే ఉన్నారా? (AV)

4. ----------------(PV)

 

II                                                                                                                 

1.Did you play cricket yesterday?

మీరు నిన్న 'C' ఆడారా?  (AV)

Was cricket played by you yesterday?

‘C’ మీ చేత అప్పుడు ఆడబడినదా? (PV)

2) Were you playing cricket at that time?

మీరు అప్పుడు ‘C’ ఆడుతూ ఉన్నారా? (AV)

Was cricket being played by you at that time?

‘C’ మీ చేత అప్పుడు ఆడబడుతూ ఉందా? (PV)

3) Had you played cricket before that?

మీరు అంతకుముందే ‘C’ ఆడారా? (AV)
Had cricket been played by you before that?

‘C’ మీ చేత అంతకుముందే ఆడబడిందా? (PV)

4) Had you been playing cricket at that time?

మీరు అప్పుడు 'C' ఆడుతూనే ఉన్నారా? (AV)

4. -------------------(PV)

III                                                                                                                         

1.Will you play cricket Next year?

మీరు Next year ‘C’ ఆడతారా?   (AV)

Will cricket be played by you Next year?

‘C’ మీ చేత Next year లో ఆడబడుతుందా? (PV)

2) Will you be playing cricket at that time?

మీరు అప్పుడు 'C' ఆడుతూ ఉంటారా? (AV)
2. -------------- (PV)

3) Will you have played cricket before that?

మీరు అంతకుముందే ‘C’ ఆడి ఉంటారా?   (AV)

3. Will cricket have been played by you before that?

‘C’ మీ చేత అంతకుముందే ఆడబడి ఉంటుందా? (PV)

4) Will you have been playing cricket at that time?

మీరు అప్పుడు 'C' ఆడుతూనే ఉంటారా? (AV)

4. --------------- (PV)

 

1.They are playing cricket.

Are they playing cricket?

2) She has completed her work.

Has she completed her work?

3) You will go to office.

Will you go to office?

4) I am repairing cell now.

Am I repairing cell now?

5) She was reading.

Was she reading?

6) Sravanthi had completed the work.

Had Sravanthi completed the Work?

7) Manager has been waiting.

Has manager been waiting?

పై విధంగా ప్రతీ English Sentence ను question గా మార్చవచ్చు. ఒక English sentence ను question గా మార్చాలంటే

Sentence లో "Is” ఉంటే దానితో sentence ను ప్రారంభించాలి. Sentence లో "has” ఉంటే దానితో sentence ను ప్రారంభించాలి. అలాగే "was” ఉంటే "was” తో, "were” ఉంటే ”ware” తో, "had” ఉంటే "had” తో, "will" ఉంటే "will" తో, మనం sentence ను ప్రారంభించినట్లయితే అది question గా మారిపోతుంది. అంతకు మించి ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదు.

Note :- Sentence లో “Has been" ఉన్నట్లయితే కేవలం “Has" ను మాత్రమే ముందుకు తీసుకురావాల్సి ఉటుంది. అంతే కాని మొత్తం "has been" ను ముందుకు తీసుకురావటం సరికాదు. అదే విధంగా "will have" లేదా “will have been” వీటిలో కూడా ఒక్క “will" ను మాత్రమే ముందుకు తీసుకుని sentence ను మనం ప్రారంభించినట్లయితే అది question గా మారిపోతుంది.

ఇకపోతే "Is కాని ”was” కాని  “have” కాని “has” కాని లేనట్లయితే ఆ sentence ను ఎలా question గా మార్చాలి?ఈ సమస్య మనకు  I(1) Simple present tense Active voice లో మరియు II(1) Simple past tense Active voice లలో వస్తుంది.

ఒక్కసారి Active voice I(1) Simple present tense మరియు II(1) Simple past tense లను గుర్తుకు తెచ్చుకుందాం.

I(1)    I      

We

You            Cooperate

He                (V1+s)

She             Cooperates

It

 

 II(1)  

I

We

You

They        (V2)  Cooperated

He

She

It

పై Structures ను పరిశీలించినట్లయితే వాటిలో Is, Was, Has, Have, Will, Can, May లాంటివి ఏమీ లేవనే విషయం మనకు తెలుస్తుంది. అవి ఉన్నట్లయితే Sentences ను వాటితో ప్రారంభించేవాళ్ళం. Question రూపంలోనికి మార్చేయటం జరిగేది.

ఇలా Is, was, has, will లాంటివి ఏమీ లేనప్పుడు మనం తప్పనిసరిగా "Do" అనే verb మీద ఆధారపడాల్సి ఉంటుంది. దీని మూడు రూపాలు. Do - Did - Done.

             ఉదాహరణకు

(V1) I play cricket

పై Sentence లో am, is, was లాంటివి ఏమీ లేవు కాబట్టి దానిని ప్రశ్నగా మార్చాలంటే "Do" అనే Verb ని తెచ్చుకోవాల్సిందే. “V1” ని వాడాలి కాబట్టి మనం “Do" యొక్క V1 “do" ని తెచ్చుకోవాలి.

Do you play cricket?

మరో ఉదాహరణ చూద్దాం.

(V1+S)

He learns English.

పై sentence లో కూడా am, is, was లాంటివి లేవు కాబట్టి దానిని ప్రశ్నగా మార్చాలంటే "Do" అనే Verb ని తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. V1+S వాడాలి అనేది మనకు తెలుసు. అందుకే Learn + S ని వాడాము. అదే విధంగా Do +S =Does ను వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే Sentence లో ముందుగా వచ్చే verb కే మనం rule ని వర్తింపచేయాలి కనుక.

(V1+S)

Does he learn English ?

Does he learns  (wrong)

గమనించారా? ఒకసారి V1+S అనే rule ని మనం does రూపంలో వాడాక మళ్ళీ అదే rule ని వాడకూడకదు. అందువల్లనే does లో V1+S అనే rule ని వాడాం కాబట్టి learns V1+S ని వాడకూడదు.

“Learn" అని మాత్రమే వాడాలి.

మరో ఉదాహరణ

V2 He saved money.

Do యొక్క V2 - Did కాబట్టి

V2 Did he save money?

Did he saved  (Wrong)

ఒకసారి V2 ని Did రూపంలో వాడాక మళ్ళీ V2 ని saved రూపంలో వాడటం సరికాదు.

సాధారణంగా చాలా మంది చేసే తప్పులు యివే.

 I(1) Simple present tense లో మరియు

II(1) Simple past tense లో.

(V1+S) (V1+S)

Does he goes to school?      Wrong

(V1+S)

Does he go to school?        Correct

(V1+S) (V1+S)

Does she knows cooking?    Wrong

(V1+S)

Does she know cooking?     Correct

(V2) (V2)

Did they completed work?   Wrong

(V2)

Did they complete work?   Correct

(V2) (V2)

Did you went?                Wrong

(V2)

Did you go?                   Correct

What =ఏమిటి

Why =ఎందుకు

When=ఎప్పుడు

Where=ఎక్కడ

Which =ఏది

Whose =ఎవరి యొక్క

Who = ఎవరు

Whom=ఎవరిని

How =ఎలా

How far =ఎంతదూరం, ఎంతవరకు

How often =ఎన్నిసార్లు, ఎంత తరచుగా

How much =ఎంత

How many =ఎన్ని

How long ఎంతసేపు, ఎంతదూరం వరకు

How long ago =ఎంతకాలం

How soon = ఎంత తొందరగా

How fast = ఎంత త్వరగా

How early = ఎంత ముందుగా

ముందుగా మామూలు వాక్యాలను మనసులోకి తెచ్చుకోండి, దానిని ప్రశ్నగా మార్చుకోండి. దాని ముందు పై వాటిని సందర్భానుసారం వాడండి.

సచిన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు.

Sachin is playing Cricket now.

సచిన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా?

Is Sachin playing Cricket now?

సచిన్ ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడుతున్నాడు?

How is Sachin playing Cricket now?

 

         Questions Word Questions

I(1) You take

మీరు తీసుకుంటారా

Do you take?

మీరు తీసుకుంటారా?

Why do you take?

మీరు ఎందుకు తీసుకుంటారు?

You don't take

మీరు తీసుకోరా

Don't you take?

మీరు తీసుకోరా?

Why don't you take?

మీరు ఎందుకు తీసుకోరు

I(1)

They support  -వారు ‘S' చేస్తారు.

They don’t support?- వారు ‘S’ చేయరు.

Do they support? - వారు ‘S' చేస్తారా?

Don’t they support?-  వారు ‘S’ చేయరా?

Why do they support? -వారు ఎందుకు 'S' చేస్తారు?

Why don’t they support? -వారు ఎందుకు ‘S’ చేయరు?

 

నీకు ఎంత మనీ కావాలి?

-How much money do you need?

ఎప్పుడు నీకు మనీ కావాలి?

-When do you need money?

ఎక్కడ నీకు మనీ కావాలి?

-Where do you need money?

ఎంత త్వరగా నీకు మనీ కావాలి?

- How soon do you need money?

నేను ఎంత ఎర్లీగా రావాలి?

- How early should I come?

 నేను ఎలా రావాలి?

-How should I come?

ఎప్పుడు నేను రావాలి?

-When should I come?

ఎంత త్వరగా నేను రావాలి?

-How early should I come?

ఎందుకు నేను రావాలి?

-Why should I come?

వారు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు?

Why do they go to Hyderabad

వారు ఎలా హైదరాబాద్ వెళ్తున్నారు?

How do they go to Hyderabad

వారు ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు?

When do they go to Hyderabad

ఎందుకోసం వారు హైదరాబాద్ వెళ్తున్నారు?

What for do they go to Hyderabad

ఎంత త్వరగా వారు హైదరాబాద్ వెళతారు?

How fast do they go to Hyderabad

                                ఈ రోజు మీరు Diary రాసారా