DAY 17 – SPOKEN ENGLISH

ఈరోజు నుండి ప్రతీ రోజు మీరు స్వయంగా ఒక Story ని కానీ, జరిగిన సంఘటనను కానీ, Joke ను కానీ, మీ జిల్లాను గురించి కానీ, India ను గురించి కానీ, మీకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి కానీ, ముందుగా Notes లో రాయడం (Direct గా English లో) దానిని కొన్ని రోజుల పాటు చూసి చదవటం తదుపరి చూడకుండా బయటకు Speech లాగా చెప్పటం చేయాలి. ఇంతకు ముందు చెప్పుకున్నటు మీరు ఆ విధంగా చెప్పేటప్పుడు Video  తీయటం మరవదు. ప్రతిరోజూ ఈ విధంగా ఏదో ఒక విషయం మీద మీరు స్వంతంగా ఇంగ్లీష్ లో essay రాయటం దానిని seminar లా బయటకు (వీలైతే Myke లో) చెప్పటం, Video తీయటం ద్వారా Stage fear పోవటమే కాకుండా English మాట్లాడటం మరియూ రాయటం లో గట్టి పట్టు లభిస్తుంది.

“THAT USAGE

You cooperate - మీరు Cooperate  చేస్తారు.

That   - అని

I Know – నాకు

మీరు "C" చేస్తారని నాకు తెలుసు.

I know that you cooperate

ఆమె ఇప్పుడు రాస్తూ ఉందని నేను అనుకుంటున్నాను

I think that she is writing now

వారు రేపు రావచ్చని నేను భయపడుతున్నాను

I fear that they may come tomorrow

లోనికి రాకూడదని నాకు తెలియదు

I don't know that I shouldn't come inside

ఆమె నన్ను నమ్మిందని నాకు తెలుసు

I know that she believed me

చిరంజీవి 150వ సినిమా చేస్తాడని నేను ఊహిస్తున్నాను.

I expect that Chiranjeevi will for 150th movie

మీరు వాళ్ళకి help చేస్తారని నేను నమ్ముతున్నాను.

I believe that you help them

నువ్వు రావని నేను అనుకున్నాను.

I thought that you don't come

ఈ రోజు మీరు Diary రాసారా

That

Should   have

Let

Work sheets ను complete చేయండి.

THAT

  1. మీరు నన్ను నమ్మరని నాకు తెలుసు.
  2. రవి U.S.A. వెళ్ళాడని నాకు తెలియదు.
  3. నేను fail అవుతానని మా అమ్మ భయపడింది.
  4. వాళ్ళు కారు కొన్నారని నాకు తెలియదు.
  5. డాక్టర్ నిన్న Operation చేయలేదని నాకు తెలియదు.
  6. గోపాల్ ఈ Problem & Sovle చేయగలడని నేను అనుకున్నాను.
  7. నేను హైదరాబాద్ వెళ్ళానని ఆమె అనుకుంది.
  8. సీత కుమార్ ని అవమానించిందని వారు నమ్ముతున్నారు.
  9. 9. నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలనని నమ్ముతున్నాను.
  10. రాబోయే ఎన్నికల్లో వారు గెలవవచ్చు అని నేను అనుకుంటున్నాను.
  11. వాళ్ళకి ఈ విషయం తెలియదని నాకు తెలియదు.
  12. వాళ్ళకి ఈ విషయం తెలుసు అని నాకు తెలియదు.
  13. బాస్కర్ ఈ సమస్యని పరిష్కరించాడని వారికి తెలియదు.
  14. కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని ఆమె అనుకుంటుంది.
  15. మేనేజర్ సీనియర్ అని వారికి తెలియదు.
  16. నేను రేపు సి.యం. ని కలవాలనుకుంటున్నానని ఆమెకి తెలియదు.
  17. ఆమె మీ సిస్టర్ అని నాకు తెలియదు.
  18. నువ్వు దేవుడిని నమ్ముతావని లతకి తెలియదు.
  19. ఎమ్.డి. ప్రతీ ఒక్కరిని ప్రోత్సాహిస్తాడని ప్రతీ ఒక్కరికి తెలుసు.
  20. ఆమెకి కారు ఉందని కిరeద్కి తెలియదు.
  21. మీరు మేనేజర్ అని ప్రతీఒక్కరూ నమ్ముతున్నారు.
  22. కెప్టెన్ వారిని టీంలోకి తీసుకోవాలనుకుంటున్నాడని సెలక్టర్స్ కి తెలుసు.
  23. టీచర్ నిన్న ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చిందని నాకు తెలియదు.
  24. నేను నిన్న M.L.A. ని కలవగలిగానని నీకు తెలియదు.
  25. మినిస్టర్ రేపు డిల్లీ వెళ్ళడని నేను అనుకుంటున్నాను.
  26. మా తమ్ముడు నిన్న స్కూల్కి వెళ్ళలేదని నాకు తెలియదు.
  27. వారు రారని నేను అనుకుంటున్నాను.
  28. ఆమె డాక్టర్ కావాలనుకుంటుందని వారికి తెలుసు.
  29. మా ఫాదర్ నిన్ను కలిసాడని నాకు తెలుసు.
  30. 30. మీరు అన్ని ఎగ్యాంపుల్స్ రాయగలరని నేను అనుకుంటున్నాను.

గతంలో ఇలా జరిగి ఉండాల్సింది లేదా అలా చేసి ఉండాల్సింది అనే సందర్ణంలో SHOULD HAVE ను ఉపయోగించాలి

  1. నువ్వు ఆమెని నమ్మకుండా వుండాల్సింది.
  2. 2. భాస్కర్ నిన్న ఆపరేషన్ కు వెళ్ళి ఉండాల్సింది
  3. సార్ నాకు ఎక్కువ హోం వర్క్ ఇచ్చి ఉండాల్సింది.
  4. అప్పుడు మేము వాళ్ళని ప్రోత్సహించకుండా ఉండాల్సింది
  5. లావణ్య ఎం.సెట్ కోచింగ్ తీసుకొని ఉండాల్సింది
  6. నేను హెల్త్ మీద ఎక్కువ కేర్ తీసుకొని ఉండాల్సింది
  7. ఇంటర్ లో నేను బైపిసి తీసుకోకుండా వుండాల్సింది.
  8. ప్రిన్సిపాల్ నిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఉండాల్సింది
  9. ఆమె మొన్న పార్టీలో హ్యాపీగా ఉండాల్సింది
  10. గవర్నమెంట్ ఈ టైమ్ కల్లా తెలంగాణ ఇచ్చి ఉండాల్సింది
  11. నిన్న డ్రైవర్ కేర్ ఫుల్ గా ఉండాల్సింది
  12. నీవు నిన్న కోపంగా ఉండకుండా ఉండాల్సింది
  13. మా అబ్బాయి నిన్న ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉండాల్సింది
  14. నువ్వు సీతను కూడా ఈ పెళ్ళికి పిలిచి ఉండాల్సింది
  15. పోయిన సంవత్సరం మీరు బ్యాంకు లోన్ కు అపై చేసి వండాల్సింది.
  16. ఈ పాటికి ఆయన హెల్స్ చేసి వుండాల్సింది.
  17. రోజుకో టాపిక్ చెప్పమని సార్ మమ్మల్ని ఫోర్స్ చేసి ఉండాల్సింది
  18. బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడే కొద్దిగా గోల్డ్ కొని ఉండాల్సింది
  19. నేను నిన్న క్లాస్ కి వచ్చి ఉండాల్సింది
  20. చిరంజీవి పాలిటిక్స్ కి రాకుండా ఉండాల్సింది
  21. నేను పోయిన సంవత్సరం స్పోక్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది
  22. మా ఫ్రెండ్ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సింది
  23. మా బ్రదర్ ఆ బిజినెస్ మొదలు పెట్టి ఉండాల్సింది
  24. నేను అప్పుడు రెగ్యులర్ గా చదువుకొని ఉండాల్సింది
  25. రాజు రాణిని పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సి ఉంది
  26. ఆ మేనేజర్ నిజాయితీ గా ఉండాల్సింది
  27. నిన్నటి మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేసి వుండాల్సింది.
  28. మేము ఆ ప్లేస్తో పాటు ఈ ప్లేస్ కూడా కొని వుండాల్సింది.
  29. మా పేరెంట్స్ నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జాయిన్ చేసిన ఉండాల్సింది
  30. నేను ఇంకా ఎక్కువ హెూమ్ వర్క్ చేసి వుండాల్సింది.

మనం ఈ పని చేద్దాం లేదా వారిని ఆపని చేయనిద్దాం అనేటప్పడు LET ను ఉపయోగించాలి

  1. మనం క్రికెట్ ఆడదాం.
  2. మనం సమస్యని అర్థం చేసుకుందాం
  3. మనం చెస్ ఆడదాం
  4. మనం ఒక నిర్ణయానికి వద్దాం
  5. మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం
  6. మనం టీ తాగుదాం
  7. మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం
  8. మనం వ్యాపారాన్ని మొదలుపెడదాం
  9. మనం కాలేజీకి వెళదాం
  10. మనం అక్కడికి వెళదాం
  11. మనం ఈ సమస్యని పరిష్కరిద్దాం
  12. మనం అనాధలకు సహాయం చేద్దాం
  13. మనం హార్డ్ వర్క్ చేద్దాం
  14. నన్ను నీ డౌట్ క్లియర్ చేయనివ్వు
  15. ఆమెను ఒంటిరిగా వెళ్ళనిద్దాం
  16. నన్ను వెళ్ళనివ్వు
  17. ఆమెను డ్యాన్స్ చేయనివ్వు
  18. వారిని రాసుకోనివ్వు
  19. ముందు నన్ను మాట్లాడనివ్వు
  20. నన్ను ఈ సమస్యని పరిష్కరించనివ్వు
  21. వాళ్ళని డబ్బు సంపాదించనివ్వు
  22. నన్ను మీ సహాయం చేయనివ్వండి
  23. అతన్ని తన డౌట్ అడగనివ్విం
  24. నన్ను లోనికి రానివ్వండి
  25. వారిని పరీక్ష రాయనివ్వండి
  26. నన్ను కాఫీ తీసుకోనివ్వండి
  27. ఆమెని పాడనివ్వు
  28. నన్ను నా హోంవర్క్ చేసుకోనివ్వండి
  29. ఆమెని మందుగా మనీ డిపాజిట్ చేయనివ్వండి
  30. నన్ను ఈ టాపిక్ అర్థం చేసుకోనివ్వు.