DAY 18-SPOKEN ENGLISH (ANS)
Need to
మనం ఏదైనా పనిని చేయాల్సిన అవసరం ఉంది అని చేప్పే సమయంలో ‘Need to’ ను వాడతాము.
1. వాళ్ళు ఈ సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.
జ. They need to understand this problem.
- నువ్వు Manager ను కలవాల్సిన అవసరం వుంది.
జ. You need to meet Manager.
- నేను నీతో మాట్లాడాల్సిన అవసరం వుంది.
జ. I need to talk to you.
- నేను Money bank లో deposit చేయాల్సిన అవసరం వుంది.
జ. I need to deposit money in the Bank.
- మనం పేదప్రజలకు సహాయం చేయాల్పిన అవసరం వుంది.
జ. We need to help poor people.
- ఆమె Interview కి attend కావాల్సిన అవసరం వుంది.
జ. She needs to attend Interview
- మా father రోజు tablets వాడాల్సిన అవసరం వుంది.
జ. My father needs to use tablets daily.
- మనం కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం వుంది.
జ. We need to learn new things.
- వాళ్ళు good habits అలవర్చుకోవాల్సిన అవసరం వుంది.
జ. They need to cultivate good habits.
- నేను ఆ పెళ్ళికి attend కావాల్సిన అవసరం వుంది.
జ. I need to attend that marriage.
- నువ్వు Hindi నేర్చుకోవాల్సిన అవసరం వుంది.
జ. You need to learn Hindi.
- నేను permission తీసుకోవాల్సిన అవసరం వుంది.
జ. I need to take permission.
- Principal results announce చేయాల్సిన అవసరం వుంది.
జ. Principal needs to announce results.
- మీరు Students ని control
జ. You need to control students.
- మనం మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం వుంది.
జ. We need to elect good leaders.
Going to
మనం ఏదైనా చేయబోతున్నామనే సమయంలో ‘Going to’ వాడతాము.
- ఆమె ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నది.
జ. She is going to learn English.
- 2. నేను ఫీజు చెల్లించబోతున్నాను.
జ. Iam going to pay fee.
- వాళ్ళు కారు కొనబోతున్నారు.
జ. They are going to buy Car
- Vinay M.A. complete చేయబోతున్నాడు.
జ. Vinay is going to complete M.A.
- మా brother inter లో M.P.C. తీసుకోబోతున్నాడు.
జ. My brother is going to take M.P.C in Inter.
- వాళ్ళు M.L.A. ని Invite చేయబోతున్నారు.
జ. They are going to Invite M.L.A.
- ఆమె నీతో ఒక విషయం చెప్పబోతున్నది.
జ. She is going to tell one thing to you.
- వాళ్ళు ఆ స్థలం కొనబోతున్నారు.
జ. They are going to buy that place.
- నేను నీ సమస్యను పరిష్కరించబోతున్నాను.
జ. Iam going to solve your problem.
- వాళ్ళు కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నారు.
జ. They are going to start new Business.
- ఆమె తన బావని పెళ్ళి చేసుకోబోతున్నది.
జ. She is going to marry her brother - in - law.
- నేను వాళ్ళను Invite చేయబోతున్నాను.
జ. Iam going to Invite them.
- ఆమె doubts అడగబోతున్నది.
జ. She is going to ask doubts.
- అతను test conduct చేయబోతున్నాడు.
జ. He is going to conduct test.
- నేను ఈ box తెరవబోతున్నాను.
జ. Iam going to open this box.
Might Have
(చేసియుండవచు)
- మా నాన్నగారు ఆఫీసుకు బయల్దేరి ఉండవచ్చు.
జ. My father might have started to office.
- నిన్న కుమార్ హూమ్ వర్క్ చేసి ఉండవచ్చు.
జ. Kumar might have completed H.W. yesterday.
- వాళ్ళు ఎమ్.ఎల్.ఎ. ని కలిసి ఉండకపోవచ్చు
జ. They might not have met M.L.A.
- మా అబ్బాయి పరీక్ష మంచిగానే వ్రాసి ఉండకపోవచ్చు
జ. My son might have written exam well.
- మేనేజర్ నిన్న ఎం.డి. ని కలిసి ఉండకపోవచ్చు.
జ. Manager might have met M.D. yesterday.
- నేను గత సంవత్సరం వారిని కలిసానేమే !
జ. I might have met them last year.
- బాస్కర్ ఈ టైమ్ కి పూణె చేరుకోని ఉండవచ్చు.
జ. Bhaskar might have reached pune by this time.
- వాళ్ళు ఆ డబ్బు దొంగిలించి ఉండవచ్చు
జ. They might have stolen that money.
- నిన్న మైసూర్ లో వర్షం పడి ఉండవచ్చు
జ. It might have rained in Mysore yesterday.
- వాళ్ళు ఏ.టి.ఎం. నుండి డబ్బు డ్రా చేసి ఉండవచ్చు.
జ. They might have drawn money from A.T.M.
Have Must
(చేసి వుంటారు)
- రాము లావణ్యకి సహాయం చేసే ఉంటాడు.
జ. Ramu must have helped Lavanya.
- అతను జగన్ ని కలిసి ఉంటాడు.
జ. He must have met Jagan.
- ఆమె కుమార్ ని మోసం చేసే ఉంటుంది.
జ. She must have cheated Kumar.
- మా అమ్మాయి పరీక్ష బాగా వ్రాసే ఉంటుంది.
జ. My daughter must have written exam well.
- ఆ పాటకి వాళ్ళు పారిపోయే ఉంటారు
జ. They must have escaped by now.
- ఎవరో వారికి చెప్పే ఉంటారు.
జ. Somebody must have told them.
- సీతని కలవడానికి లోకేష్ అక్కడికి వెళ్ళి ఉంటాడు.
జ. Lokesh must have gone there to meet sita.
- నువ్వు వాళ్ళని అవమానించే ఉంటావు.
జ. You must have Insulted them.
- ధోనీ సెంచరీ చేసే ఉంటాడు.
జ. Dhoni must have done century.
- ఆమె నాకు మనీ ఇచ్చే ఉంటుంది.
జ. She must have given money.
Could Have
(చేయగలిగి ఉండేవారు)
- సచిన్ సెంచరీ చేలగలిగి ఉండేవాడు.
జ. Sachin could have done century.
- వారు ఆ పని పూర్తి చేయగలిగేవారు.
జ. They could have done that work.
- ఆమె హోమ్ వర్క్ చేలగలిగి ఉండేది.
జ. She could have done home work.
- అశోక్ క్లాస్ ఫస్ట్ పొందగలిగేవాడు.
జ. Ashok could have got class first.
- వాళ్ళు ఆ పాటకి రాగలిగే వాళ్ళు.
జ. They could have come by this time.
- మేము మినిస్టర్ ని కలువగలిగే వారము.
జ. We could have met minister.
- నేను ఆ సమస్యను పరిష్కరించగలిగేవాడను.
జ. I could have solved that problem.
- నేను ఎం.బి.ఎ. పూర్తి చేయగలిగే వాడను.
జ. I could have completed M.B.A.
- ఆమె మంచి ర్యాంక్ పొందగలిగేది.
జ. He could have got good rank.
- వారు ఆ Building కట్టగలిగి ఉండేవారు.
జ. They could have built that building.
Not only.....But also.....
(ఇది మాత్రమే కాదు అదికూడా చేస్తాను లేదా చేశాను అని చెప్పే
సందర్భాలలో ‘Not only… But also…’ ను వాడతాము.)
- నన్నేకాదు రేఖని కూడా పిలిచారు.
జ. They not only invited me but also Rekha.
- నేను నిన్నేకాదు అందరు స్టూడెంట్స్ నీ ఎంకరేజ్ చేస్తాను.
జ. I not only encourage you but also all the students.
- అతను ఈ స్థలమే కాదు ఆ ఇల్లు కూడా కొన్నారు.
జ. He not only bought this place but also that house.
- ధోనీనే కాదు సచిన్ కూడా నిన్న సెంచరీ చేశాడు
జ. Not only Dhoni but also Sachin did century yesterday.
- వాళ్ళు గత సంవత్సరం కోచింగ్ తీసుకోవటమే కాదు మంచి ర్యాంకు సాధించారు.
జ. They not only took coaching but also got good rank last year.
- ఆమె కోచింగ్ కి హాజరు అవుతూ ఉండటమే కాదు doubts కూడా అడుగుతూ ఉంది.
జ. She is not only attending to coaching but also asking doubts.
- మేము ఈ లీడర్ నే కాదు మంచి లీడర్స్ ని అందరినీ సపోర్ట్ చేస్తాము.
జ. We not only support these leaders but also all the good leaders.
- నేను నేర్చుకుంటూ ఉండటమే కాదు వాటిని డైలీ లైఫ్ లో వాడుతూ ఉంటాను.
జ. I not only learn but also use them in my daily life.
- అతను నన్నే కాదు నిన్ను అడుగుతాడు.
జ. He will not only ask me but also you.
- నేను డిల్లీనే కాదు ఆగ్రానీ విజిట్ చేస్తాను.
జ. I not only visited Delhi but also Agra.
Used to
ఒకప్పుడు అలవాటుగా చాలాసార్లు చేసిన పనులను తెలియచేయుటకు ‘Used to’ ను వాడతాము.
- గాంధీ రోజుకు 10 మైళ్ళు నడిచేవారు.
జ. Gandhiji used to walk 10 miles a day.
- మా తమ్ముడు వారానికి 4 సినిమాలు చూసేవాడు .
జ. My brother used to watch 4 cinemas a week.
- ఒకప్పుడు నేను Cricket బాగా ఆడుతూ ఉండేవాడిని.
జ. I used to play cricket well once.
- Rahul 10th class e5 Novels చదివేవాడు.
జ. Rahul used to read novels in 10th class.
- నేను Puzzles పూర్తి చేసేవాడిని.
జ. I used to solve puzzles.
- పెళ్ళికి ముందు రాధ పాటలు పాడుతూ ఉండేది.
జ. Radha used to sing songs before marriage.
- ఒకప్పుడు నేను రెగ్యులర్ గా dairy రాసేవాడిని.
జ. I used to write dairy once upon a time.
- వాళ్ళు last year వరకు రోజు exercise చేసేవారు.
జ. They used do exercise till last year.
- మా father regular గా Park వెళ్ళేవారు.
జ. My father used to go to Park regularly.
- ఒకప్పుడు నేను సెలవుల్లో village కి వెళ్ళేవాణ్ణి.
జ. I used to go to my village in holidays once upon a time.
- Krishna పెళ్ళికి ముందు వరకూ రోజు templeకి వెళ్ళేవాడు.
జ. Krishna used to go to telmple before marriage.
- నేను doubts అడిగేవాడిని.
జ. I used to ask doubts.
- Maths lecturer ఒకప్పుడు weekly tests conduct చేసేవాడు.
జ. Maths lecturer used to conduct weekly tests once upon a time.
- ఆమె పెళ్ళికి ముందు వరకు సీరియల్స్ చూసేది.
జ. She used to watch serials before Marriage.
- ఆమె తన కోడల్ని torture చేసేది.
జ. She used to torture her daughter - in- law.
As if
- తనేదో ప్రిన్సిపాల్ లాగా రాము ఇప్పుడు రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నాడు.
జ. As if he is the principal Ramu is checking all the rooms now.
- తనేదో అందగత్తె లాగా ఆమె నిన్న బిహేవ్ చేసింది.
జ. As if she is beautiful she behaved yesterday.
- ఆమేదో ధనవంతురాలిలాగ నిన్న విచ్చలవిడిగా ఖర్చుపెట్టింది.
జ. As if she is rich she spent money recklessly yesterday.
- తనకేదో అంతా అర్థం అయినటు తను ఇప్పుడు తలాడిస్తుంది.
జ. As if she understood everything she is nodding her head now.
- ఆమేదో మంచిదయినట్లు మాకు నీతులు చెప్పింది.
జ. As if she is good she told morals to us.
- అతనేదో clever అయినట్లు మాకు సలహాలె ఇవ్వాలనుకుంటున్నాడు.
జ. He wants to give advices to us If he is clever.
- తనేదో M.D. అయినటు కుమార్ నిన్నటి నుండి ప్రవర్తిస్తూ ఉన్నాడు.
జ. As if he is the M.D. Kumar has been behaving since yesterday.
- టీ వేడిగా ఉన్నట్లు నువ్వు నెమ్మదిగా తాగుతూ ఉన్నావు.
జ. You are taking Tea slowly as if it is hot.
- అదేదో Benz car లాగా అతను ఆ పాత మారుతీ కార్ని నడుపుతున్నాడు.
జ. He is driving old Maruthi car as if it is Benz car.
- అన్నీ తనకే తెలిసినట్లు అతను ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు.
జ. As if he know everything he is behaving now.
- అతనేదో సీన్సియర్ అయినట్టు ఇంతకుముందే మాకు సలహాలు ఇచ్చాడు.
జ. He has advised us just before as if he is sincere.
- తనేదో హీరోలాగా కుమార్ ఇప్పుడు ఫోజు కొడుతున్నాడు.
జ. Kumar is posing as if he is a Hero.
- నేనేదో నిన్ను తిట్టినట్టు నిన్న నువ్వు నటించావు.
జ. You behaved yesterday as if I scolded you.
- తన దగ్గర ఏదో మనీ ఉన్నట్లు ఆమె ప్రవరిస్తూ ఉంది.
జ. She is behaving as if she has money.
- తనేదో చైల్డ్ లాగా ఆమె యిప్పుడు మాట్లాడుతూ ఉంది.
జ. As If she is a child she is talking now.
Have/ Get
మనం స్వయంగా చేసే పనులు కాకుండా చేయించే/చేయించుకునే పనులకు Get ను ఉపయోగించాలి.
- నేను Scooter repair చేస్తాను.
I repair the scooter .
- నేను Scoote repair చేయిస్తాను.
I get scooter repaired (or) I have the scooter repaired .
- వారు ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నారు.
They are washing the clothes now
వారు ఇప్పుడు బట్టలు ఉతికిస్తూ ఉన్నారు.
They are getting the clothes washed now (or) They are having the clothes washed now
- ఆమె ఇంతకుముందే ఇంటికి పెయింట్ వేయించింది.
She has got the house painted just before .
- రాము రేపు hair cut చేయించుకుంటాడు.
Ramu will get his hair cut tomorrow .
- వారు నిన్న లెటర్ టైప్ చేయించారు.
They got the letter typed yesterday
- Shiva ఈ లెటర్ మీద సంతకం పెట్టించాడు.
Shiva got this letter signed
- అతను తన కారుని సర్వీస్ చేయిస్తాడు.
He gets his Car serviced every month
- Raju ఇంతకుముందే గుండు చేయించుకున్నాడు.
Raju has got his head tonsured just before
- వారు టి.వి. బాగుచేయించాలనుకుంటున్నారు.
They want to get the T.V. repaired
- మా ఫ్రెండ్ తన సీటుని రిజర్వు చేయించుకుంటూ ఉన్నాడు.
My friend is getting his seat reserved now
- ఆశ టీ prepare చేయించుకుంది.
Asha got tea prepared
- మా తమ్ముడు తన వాచి బాగు చేయించుకోగలిగాడు.
My brother could get his watch repaired
- మా అమ్మ తన ఉత్తరం వ్రాయించుకుంది.
My mother had her letter written
- అతను ఈ యంత్రాన్ని పని చేయిస్తాడు.
He has this machine worked
- మా నాన్నగారు రేపు ఇంటికి రంగు వేయిస్తారు.
My father will get the house painted tomorrow
- వారు తమ బూటు పాలిష్ చేయించుకోలేదు.
They did not get their shoes polished
- నేను క్రాఫ్ చేయించుకోవాలి.
I should get my hair cut
- లత తన ఫోటో తీయించుకుంటుంది.
Latha gets her photograph taken
- సూడెంట్స్ ఇప్పుడు ఫోటో తీయించుకుంటున్నారు.
Students are getting their photographs taken now
- మనం ఫోటో దిగుదాం.
Let's get our photograph taken
MAKE = చేయించు
1. వారు నన్ను నవ్విస్తారు.
They make me laugh
- ఆమె అతన్ని ఏడ్పించింది.
She made him cry
- అతను వారిని ఇప్పుడు సంతోషపరుస్తూ ఉన్నాడు.
He is making them feel happy now
- నేను అతనితో పని చేయిస్తాను.
I make him work
- మీరు అతనితో పని చేయించారా?
Have you made him work?
- పిల్లల్ని ఏడ్పించకు.
Don't make children cry
- టీచర్ ఇప్పుడు వాళ్ళతో వ్రాయిస్తున్నాడు.
Teacher is making them write now
- ఈ సంతకం చేయించు.
Get it signed
- ఈ పని చేయించు.
Get this work done
- బట్టలు ఉతికించు.
Get the clothes washed
- దానిని బాగుచేయించు.
Get that repaired
- దానికి రంగు వేయించు.
Get it painted